Mumbai Shocker: ముంబైలో దారుణం, నడిరోడ్డుపై కత్తితో దాడి చేసి వ్యాపారస్తుడు కిడ్నాప్, బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్న ముంబై పోలీసులు

దీంతో ఆప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన ఘటన మొత్తం సమీపంలోని సీసీఫుటేజ్‌లో రికార్డు అయ్యింది.

Man Attacked With Sword Near Mumbai (Photo-Video Grab)

Mumbai, Dec 21: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఒక సముహం ఒక వ్యక్తి కారుని ఢీ కొట్టి, అతనిపై కత్తితో దాడి (Man Attacked With Sword ) చేశారు. దీంతో ఆప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన ఘటన మొత్తం సమీపంలోని సీసీఫుటేజ్‌లో రికార్డు అయ్యింది.

ఆ వీడియోలో ఒక పిక్‌ అప్‌ వ్యాన్‌ మరో వాహనాన్ని ఢీ కొట్టినట్లు కనిపించింది. తర్వాత ఒక గుంపు వాహనంలోని ఓ వ్యక్తిని (Mumbai Man) బయటకు లాగి కత్తితో పదేపదే దాడి చేసి గాల్లో కత్తిని ఊపాడు.యపడిన వ్యక్తిని ఎవరూ కాపడే ప్రయత్నం చేయనీయకుండా ఆ దుండగులు గాల్లో కాల్పులు జరిపినట్లు స్థానికులు చెబుతున్నారు.మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది.

మణిపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, అదుపు తప్పి బోల్తా పడిన రెండు స్కూల్ బస్సులు, 15 మంది మృతి, పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు

ప్రత్యక్ష సాక్షుల ప్రకారం దాడికి గురైన వ్యక్తిని హర్జిత్‌సింగ్‌గా గుర్తించారు పోలీసులు. నిందితులు దాడి అనంతరం ఆ వ్యక్తిని కిడ్నాప్‌​ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కత్తిని, ఆ కారుని స్వాధీనం చేసుకున్నారు. ఈ వివాదం పంది మాంస వ్యాపారంతో ముడిపడి ఉండవచ్చని అన్నారు.

Here's Video

వారంతా పందిమాంస వ్యాపారులని (Allegedly Over Trade Dispute) చెప్పారు. ఐతే అదే వాహనంలోని ఇతర వ్యక్తులపై దుండగులు దాడి జరగనట్లు సీసీటీవీ విజ్యువల్స్‌ చూపిస్తున్నాయని చెప్పారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.