IMD Weather Alert: భారీ వర్షాలు, ఆ రెండు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్, స్కూళ్లు మూసివేతకు సర్కారు ఆదేశాలు, తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల పాటు జోరు వానలు

ఈ మేరకు ఆ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. బుధవారం భారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రతగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.

Rains in Chennai (Photo-Twitter)

ఈశాన్య రుతుపవనాలు తీవ్రతరం కావడంతో దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. బుధవారం భారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రతగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.

కేరళలో ఈ రెండు రోజులు(బుధ, గురువారాలు) అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడు, పుదుచ్చేరిలో బుధవారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్‌డీ హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా పుదుచ్చేరి, కారైకల్‌లోని పాఠశాలలకు అధికారులు నేడు సెలవు ప్రకటించారు. అటు.. తమిళనాడులోని 10 జిల్లాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

జాతీయ వాతావరణ సంస్థ నుండి వచ్చిన తాజా అప్‌డేట్ ప్రకారం కేరళ, తమిళనాడులో గత నాలుగు రోజులుగా ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. పతనంతిట్ట, తిరువనంతపురం జిల్లాల్లో వరుసగా 7 సెం.మీ, 5 సెం.మీ వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా జనం అవస్థలు పడుతున్నాయి. కాలనీల్లో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన, రాబోయే మూడురోజుల పాటూ అక్కడక్కడా వానలు పడుతాయని అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, రాబోయే 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఇదే!

చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తమిళనాడులోని పది జిల్లాల్లో రానున్న రెండు రోజుల్లో అడపాదడపా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతోపాటు బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలను మూసివేయడం ఈ నెలలో ఇది రెండోసారి. నవంబర్‌లో, పుదుచ్చేరి, చెన్నైలోని రెండు పాఠశాలలు, కళాశాలలు నిరంతర భారీ వర్షాల కారణంగా మూసివేయబడ్డాయి.

AP Weather Update: ఏపీలో మొదలైన వానలు, రానున్న రెండు రోజుల పాటు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, బంగాళాఖాతంలో కలిసిపోయి కొనసాగుతున్న రెండు ఉపరితల ఆవర్తనాలు  

మధ్య భారతదేశం గురించి IMD ఒక అప్‌డేట్ ఇస్తూ.. “నవంబర్ 24 నుండి నవంబర్ 27 2023 వరకు మధ్య భారతదేశం మరియు పశ్చిమ తీరంలో కొన్ని ప్రదేశాలలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా, దక్షిణ ప్రాంతంలో వర్షాలు కురుస్తాయని ఊహించిన సమయంలోనే ఉత్తర భారతదేశం చల్లటి ఉష్ణోగ్రతలను స్వీకరిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో ఒకపక్క చలి (Cold) వణికిస్తోంది. ఈ సమయంలో వాతావరణ శాఖ (IMD) కీలక సమాచారం ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలో (Telangana) రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని, ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల కారణంగా మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) తెలిపింది. ఈశాన్య దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్‌ హైదరాబాద్‌లో (GHMC) ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.

నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 19.1 డిగ్రీలుగా నమోదయ్యాయి. గాలిలో తేమ 41 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD) అధికారులు వెల్లడించారు. ఈనెల 23 నుంచి 26 వరకు హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం నుంచి మోస్తరు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు, ఉరుములతో కూడిన జల్లులకు అవకాశం ఉంది.



సంబంధిత వార్తలు