Rainfall -Representational Image | (Photo-ANI)

Hyderabad, NOV 22: తెలుగు రాష్ట్రాల్లో ఒకపక్క చలి (Cold) వణికిస్తోంది. ఈ సమయంలో వాతావరణ శాఖ (IMD) కీలక సమాచారం ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలో (Telangana) రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని, ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల కారణంగా మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) తెలిపింది. ఈశాన్య దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్‌ హైదరాబాద్‌లో (GHMC) ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.

AP Weather Update: ఏపీలో మొదలైన వానలు, రానున్న రెండు రోజుల పాటు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, బంగాళాఖాతంలో కలిసిపోయి కొనసాగుతున్న రెండు ఉపరితల ఆవర్తనాలు  

నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 19.1 డిగ్రీలుగా నమోదయ్యాయి. గాలిలో తేమ 41 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD) అధికారులు వెల్లడించారు. ఈనెల 23 నుంచి 26 వరకు హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Telangana Assembly Election 2023: కాంగ్రెస్‌కు వచ్చేది 20 సీట్లే, భట్టి గెలిచేది లేదు, సీఎం అయ్యేది లేదు, మధిర ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ 

ఏపీలో ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం నుంచి మోస్తరు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు, ఉరుములతో కూడిన జల్లులకు అవకాశం ఉంది.