'Will Bury You 10-Feet Deep': మామా..మంచి ఫామ్ మీద ఉన్నాడు, మిమ్మల్ని పది అడుగుల గోతిలో పాతేస్తా, మాఫియాకు హెచ్చరికలు జారీ చేసిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ మాఫియా, గుండాగాళ్లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. గుడ్‌ గవర్నెన్స్‌ డే సందర్భంగా సీఎం (Madhya Pradesh CM Shivraj Singh Chouhan) మాట్లాడుతూ.. తన మూడ్ అసలు బాలేదని రాష్ట్రంలో ఎవరైనా మాఫియా ఉంటే వెంటనే తట్టాబుట్టా సర్దుకుని పారిపోవాలంటూ వార్నింగ్ ఇచ్చాడు. అసాంఘిక కార్యకలాపాలు రాష్ట్రంలో ఆపకుంటే అందర్నీ 10 అడుగుల గోతిలో పాతిపెడతానని ('Will Bury You 10-Feet Deep') హెచ్చరించారు.

Former Madhya Pradesh CM Shivraj Singh Chouhan | File Image | (Photo Credits: PTI)

Hoshangabad, December 26: మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ మాఫియా, గుండాగాళ్లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. గుడ్‌ గవర్నెన్స్‌ డే సందర్భంగా సీఎం (Madhya Pradesh CM Shivraj Singh Chouhan) మాట్లాడుతూ.. తన మూడ్ అసలు బాలేదని రాష్ట్రంలో ఎవరైనా మాఫియా ఉంటే వెంటనే తట్టాబుట్టా సర్దుకుని పారిపోవాలంటూ వార్నింగ్ ఇచ్చాడు. అసాంఘిక కార్యకలాపాలు రాష్ట్రంలో ఆపకుంటే అందర్నీ 10 అడుగుల గోతిలో పాతిపెడతానని ('Will Bury You 10-Feet Deep') హెచ్చరించారు.

మామా ఇప్పుడు ఫామ్‌లో ఉన్నాడు. నా రాష్ట్రాన్ని విడిచి వెళ్లకపోతే.. మీరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియకుండా 10 అడుగుల గోతిలో పాతి పెడతా’అని ట్విట్టర్‌ వేదికగా సీఎం చౌహన్‌ గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. ప్రజలకు సమస్యలు లేకుండా ఉన్నప్పుడు అది గుడ్‌ గవర్నెన్స్‌ అవుతుందని, అలాంటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్‌ మారుస్తామని సీఎం అన్నారు. చట్టాలను గౌరవించే పౌరుల పట్ల రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం పువ్వు మాదిరిగా సున్నితంగా వ్యవహరిస్తుందని, రాక్షసంగా ప్రవర్తించేవారి పట్ల పిడుగులు వర్షం కురిపిస్తుందని అన్నారు.

Here's ANI Tweet

డ్రగ్స్‌ పెడ్లర్‌, భూ దందా, చిట్‌ ఫండ్‌ మాఫియా, గూండాలు ఇలాంటివారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం చౌహాన్ స్పష్టం చేశారు. అలాగే, రాష్ట్రంలో పాతుకుని ఉన్న డ్రగ్స్‌ మాఫియాను మట్టుబెట్టడానికి కేంద్ర సంస్థలతో మంతనాలు జరుపుతున్నామని సీఎం తెలిపారు. ఇక నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) సూచనల మేరకు డ్రగ్స్‌ మాఫియాపై చర్యల కోసం డిసెంబర్‌ 15 నుంచి 22 వరకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహణకు సీఎం చర్యలు తీసుకున్నారు. ఇదిలాఉండగా.. మధ్యప్రదేశ్‌లోని 15 జిల్లాల్లో డ్రగ్స్‌ దందా జోరుగా సాగుతోందని ఎన్‌సీబీ తెలిపింది. ముఖ్యంగా మాల్వా, మహాకోషల్‌ ప్రాంతాల్లో డ్రగ్స్‌ దందా అధికంగా సాగుతోందని వెల్లడించింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now