Mamata Banerjee: సార్వత్రిక ఎన్నికల్లో పోటీపై మమతా బెనర్జీ కీలక ప్రకటన, ఇకపై ఒంటరిగానే పోరాటం చేస్తామన్న దీదీ, బెంగాల్‌లో ఉప ఎన్నికలో ఓటమితో నిర్ణయం

పశ్చిమ బెంగాల్లోని సాగర్దిగి నియోజకవర్గానికి జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఎంసీ, బీజేపీ అభ్యర్థులను ఓడించి కాంగ్రెస్ అభ్యర్థి బైరాన్ బిశ్వాస్ విజయ ఢంకా మోగించారు.

West Bengal CM Mamata Banerjee (Photo Credits: Facebook)

Kolkata, March 02: దేశంలో 2024 ఎన్నికల్లో టీఎంసీ (TMC) ఒంటరిగానే పోటీచేస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రకటించారు. పశ్చిమ బెంగాల్లోని సాగర్దిగి నియోజకవర్గానికి జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఎంసీ, బీజేపీ అభ్యర్థులను ఓడించి కాంగ్రెస్ అభ్యర్థి బైరాన్ బిశ్వాస్ విజయ ఢంకా మోగించారు. ఆయనకు ఆ నియోజక వర్గంలో వామపక్ష పార్టీల మద్దతు లభించింది. 13 ఏళ్లుగా సాగర్దిగి నియోజక వర్గంలో టీఎంసీకి ఎదురులేదు. ఈ సారి మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి బైరాన్ బిశ్వాస్ 22,986 మెజార్టీతో టీఎంసీ అభ్యర్థిపై గెలిచారు. ఈ ఫలితాలపై స్పందిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు.

ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అనైతిక విజయం సాధించిందని మమతా బెనర్జీ (Mamata Banerjee) ఆరోపించారు. టీఎంసీని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలో సీపీఎంతోనే కాకుండా బీజేపీతోనూ కలిసిందని ఆరోపించారు. దీంతో తమ పార్టీ 2024 ఎన్నికల్లో ఒంటరిగానే (fight alone in 2024) పోటీచేస్తుందని ప్రకటించారు. సామాన్య ప్రజల మద్దతుతోనే తాము గెలుస్తామని చెప్పుకొచ్చారు. సాగర్దిగి నియోజక వర్గంలో టీఎంసీకి ఎదురైన ఓటమి పట్ల తాను ఎవరినీ బాధ్యులను చేయలేనని అన్నారు.

Northeast Election Results 2023: బీజేపీకే పట్టం కట్టిన ఈశాన్య రాష్ట్రాలు, భారీ ఓటమిని చవి చూసిన కాంగ్రెస్, మేఘాలయలో మ్యాజిక్ ఫిగర్ దాటని సీఎం కాన్రాడ్‌ సంగ్మా పార్టీ 

అయితే, కాంగ్రెస్ గెలుపుకోసం ఏర్పడిన అనైతిక కూటమిని మాత్రం తాను ఖండిస్తున్నానని చెప్పారు. బీజేపీ తమ ఓట్లను కాంగ్రెస్ కు బదిలీ చేసిందని ఆరోపించారు. ఈ నియోజక వర్గంలో మతపర చర్యలకు పాల్పడ్డారని అన్నారు. తమను తాము బీజేపీకి వ్యతిరేమని కాంగ్రెస్ పార్టీ ఇక చెప్పుకోకూడదని విమర్శించారు. బీజేపీని ఓడించాలనుకునే వారు టీఎంసీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.