New Delhi, Mar 2: ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగినట్లుగానే ఈశాన్య రాష్ట్రాల్లోని (Northeast Elections) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కనిపించాయి. ఈశాన్యంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (Northeast Assembly Election Results 2023) భారతీయ జనతా పార్టీ మరోసారి సత్తా చాటింది. త్రిపుర, నాగాలాండ్‌లో (Tripura, Nagaland) మెజార్టీతో మరోసారి అధికారంలోకి రానుంది.
త్రిపురలో 60 స్థానాలకు గానూ 33 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ 31ని అందుకోవడంతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. కాంగ్రెస్, లెప్ట్ కూటమి 14 స్థానాల్లో విజయం సాధించాయి.
కమ్యూనిస్టుల కంచుకోటను పెకిలించి 2018లో త్రిపురలో (Tripura) అధికారంలోకి వచ్చిన బీజేపీకి.. ఈసారి మాత్రం గట్టి పోటీనే ఎదురయ్యింది. మాణిక్య రాజవంశానికి చెందిన ప్రద్యోత్ బిక్రమ్ వర్మ సారథ్యంలో ఏర్పడ్డ తిప్రా మోథా (Tipra Motha).. కాషాయ పార్టీకి భారీ షాక్ ఇచ్చింది. కొత్త పార్టీ టిప్రా మోథా 13 స్థానాల్లో జయభేరి మోగించింది. ఈ నేపథ్యంలో తమకు తిప్రా మోథా మద్దతు ప్రకటిస్తే ఒక్క ప్రత్యేక రాష్ట్రం మినహా ఆ పార్టీ చేస్తున్న అన్నీ డిమాండ్లను అంగీకరిస్తామని బీజేపీ ప్రకటించింది.
అదానీ-హిండెన్‌బర్గ్ వివాదం, అవకతవకలపై దర్యాప్తు చేపట్టాలని సెబీకి ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు
నాగాలాండ్‌లో బీజేపీ, ఎన్డీపీపీ కూటమి భారీ విజయాన్ని అందుకుంది. 60 స్థానాలకు గానూ బీజేపీ కూటమి 37 స్థానాల్లో జయకేతనం ఎగురవేయగా.. ఎన్‌పీఎఫ్ రెండు స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేకపోయింది. ఇతరులు 21 చోట్ల విజయం సాధించడం గమనార్హం.ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 31ని క్రాస్ చేయడంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.
మరో రాష్ట్రం మేఘాలయలో హంగ్ (Trailing in Meghalaya) వచ్చింది. సీఎం కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ 25 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ 31ని అందుకోలేకపోయింది. కాంగ్రెస్ ఐదు, బీజేపీ 4 సీట్లతో సరిపెట్టుకున్నాయి. ఇతరులు 25 స్థానాల్లో గెలుపొందారు. అయితే కాన్రాడ్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధమని బీజేపీ ప్రకటించింది.
ఒకవేళ ఈ రెండు పార్టీలు కలిస్తే మేఘాలయ ప్రభుత్వంలో కూడా బీజేపీ భాగం కానుంది. ఫలితంగా మూడు రాష్ట్రాల్లో అధికారంలో బీజేపీ ఉన్నట్లే.. అన్నింటికంటే ఆశ్చర్యపరిచే పరిణామం ఏంటంటే..ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ భారీ ఓటమిని చవిచూసింది. రెండు రాష్ట్రాల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. ఇక నాగాలాండ్‌లో అసలు ఖాతా తెరవలేకపోయింది.
తమిళనాడులోని ఈరోడ్ ఉపఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఈవీకేఎస్ ఎలన్‌గోవన్ ఘన విజయం సాధించారు. ఈ ఉప ఎన్నికల్లో అధికార డీఎంకే కాంగ్రెస్‌కు మద్దతిచ్చింది.