Mumbai Wockhardt Hospital: ముంబై ఆస్పత్రిలో కరోనా కల్లోలం, 26 మంది నర్సులకు, డాక్టరుకు కరోనా పాజిటివ్, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు నానా తంటాలు పడుతున్న అధికారులు

Wockhardt హాస్పిటల్ లో ఈ ఘటన సంభవించడంతో పరిస్థితులు అదుపులోకి తెచ్చేందుకు అధికారులు నానా తంటాలు పడుతున్నారు.

COVID 19 Testing (Photo Credits: Pixabay)

Mumbai, April 6: ఇండియాలో కరోనా కేసుల్లో టాప్‌గా ఉన్న మహారాష్ట్రలో (Maharashtra) ఇప్పుడు హాస్పిటల్ కు వెళ్లాలన్నా భయం పట్టుకునేలా ముంబైలోని Wockhardt ఆస్పత్రిలోని 26మంది నర్సులు, ముగ్గురు డాక్టర్లకు కరోనా పాజిటివ్ రావడంతో పేషెంట్లకు గుండెల్లొ రైళ్లు పరిగెడుతున్నాయి. Wockhardt హాస్పిటల్ లో ఈ ఘటన సంభవించడంతో పరిస్థితులు అదుపులోకి తెచ్చేందుకు అధికారులు నానా తంటాలు పడుతున్నారు.

మీరంతా చావు కోసమే చూస్తున్నారు

ఈ నేపథ్యంలోనే బిల్డింగ్ లోకి రాకుండా, ఏ ఒక్కరూ బయటకు వెళ్లకూడదంటూ ఆంక్షలు విధించారు. టెస్టుల్లో రెండు సార్లు నెగెటివ్ వస్తేనే బయటకు పంపాలని నిర్ణయించారు. ఈ క్రమంలో నార్మల్ వార్డుల్లో ఉన్న 270మంది పేషెంట్లు, నర్సులు అందరికీ పరీక్షలు నిర్వహించారు. ఓపీ విభాగంతో పాటు, ఎమర్జెన్సీ సర్వీసులు కూడా నిలిపేశారు. హాస్పిటల్ క్యాంటినే నర్సులు, పేషెంట్లకు ఆహారం ఏర్పాటు చేస్తుంది.

ఇదిలా ఉంటే ముంబైలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. మహారాష్ట్రలో నమోదైన 781 కేసుల్లో 458 ముంబైలోనివే. మహారాష్ట్రలో కొత్తగా 33 COVID-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆసియాలోనే పెద్ద బస్తీ ప్రాంతమైన దారావి ప్రాంతంలో అయిదుగురికి పాజిటివ్ గా తేలింది.

Here's the tweet:

ముంబై నగరంలో ఇప్పటికీ 45మంది ప్రాణాలు కోల్పోయారు. భారతదేశ వ్యాప్తంగా 4వేల మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. కొవిడ్‌-19 కారణంగా దేశంలో 109మంది మరణించగా వీరిలో అత్యధికంగా 45మంది మహారాష్ట్రలోనే చనిపోయారు. కేవలం ఒక్క ముంబయిలోనే 190పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. అటు పూణెలోనూ క‌రోనా తీవ్ర‌త అధికంగానే ఉన్న‌ది.



సంబంధిత వార్తలు