Hyderabad: లక్షకు మరో లక్ష వడ్డీ ఇస్తా! ఇండ్లలో పనిచేసే మహిళలే టార్గెట్‌గా ఘరానా మోసం, రూ. 14 కోట్లు వసూలు చేసి పరారైన కిలాడీ లేడీ

హైదరాబాద్ వనస్థలిపురంలో ఘరానా మోసం (Cheating) వెలుగుచూసింది. అధిక వడ్డీ, రియల్ ఎస్టేట్ పేరుతో పలువురిని అడ్డంగా మోసగించింది స్వర్ణలత అనే మహిళ. లక్ష రూపాయలకు లక్ష రూపాయలు (Name Of High Interest) ఇస్తానని నమ్మించింది. ఆశ పెట్టింది. అలా సుమారు 50మంది నుంచి రూ.14కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత డబ్బుతో పరార్ అయ్యింది. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటున్నారు.

Cyberbad Cyber Crime Police (Photo-Video Grab)

Hyderabad, April 07: హైదరాబాద్ వనస్థలిపురంలో ఘరానా మోసం (Cheating) వెలుగుచూసింది. అధిక వడ్డీ, రియల్ ఎస్టేట్ పేరుతో పలువురిని అడ్డంగా మోసగించింది స్వర్ణలత అనే మహిళ. లక్ష రూపాయలకు లక్ష రూపాయలు (Name Of High Interest) ఇస్తానని నమ్మించింది. ఆశ పెట్టింది. అలా సుమారు 50మంది నుంచి రూ.14కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత డబ్బుతో పరార్ అయ్యింది. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటున్నారు. న్యాయం చేయండి అంటూ పోలీసులను ఆశ్రయించారు. ఎల్బీనగర్ డీసీపీ వద్దకు వెళ్లి బాధితులు మొరపెట్టుకున్నారు. కాగా, గతంలోనూ స్వర్ణలతపై వనస్థలిపురం (Vanasthalipuram) పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది. ”వెంచర్ లో పెట్టుబడి పెడితే డబుల్ అమౌంట్ వస్తుందని చెప్పింది. రూ.5లక్షలు ఇస్తే రూ.7లక్షలు ఇస్తా అంది. అందరి దగ్గర అప్పులు చేయించింది. ఇప్పుడు మేము బతకలేని పరిస్థితి. డబ్బంతా ఎవరి దగ్గర పెట్టావో చెప్పు అంటే.. అది నా పర్సనల్ వ్యవహారం. నీకు అనవసరం అని గొడవకు దిగింది. మేము చచ్చిపోయే పరిస్థితి ఉంది” అని ఓ బాధితురాలు కన్నీటిపర్యంతమైంది.

Kiran Kumar Reddy Joins BJP: బీజేపీలో చేరిన కిరణ్‌కుమార్‌రెడ్డి, పార్టీ ముఖ్యనేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి 

రియల్ ఎస్టేట్ (Real Estate), అధిక వడ్డీ పేరుతో అమాయక మహిళలను స్వర్ణలత అడ్డంగా మోసగించింది. బాధితులు వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇవాళ ఉదయం ఎల్బీనగర్ డీసీపీని (DCP) కలిసి మరోసారి స్వర్ణలతపై బాధితులు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. లక్ష రూపాయలు కడితే అధిక వడ్డీ ఇస్తామని స్వర్ణలత నమ్మించింది. ఇలా 50 మంది నుంచి సుమారు 14 కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ 50మంది బాధితులు చాలామంది దగ్గర డబ్బు తీసుకుని స్వర్ణలతకు ఇచ్చినట్లు తెలుస్తోంది. పెద్ద మొత్తంలో డబ్బు వసూలయ్యాక స్వర్ణలత (Swarnalatha) ఒక్కసారిగా బోర్డు తిప్పేసింది. సడెన్ గా కనిపించకుండా పోయింది. దాంతో డబ్బు  కట్టిన వాళ్లు ఆందోళనకు గురయ్యారు.

Jagananne Maa Bhavishyathu: జగనన్నే మా భవిష్యత్తు ప్రారంభం, ఈ నెల 20వ తేదీ వరకూ 175 నియోజకవర్గాల్లో కొనసాగనున్న కార్యక్రమం, ఐదు కోట్ల మంది ప్రజలతో మమేకం 

తాము మోసపోయామని తెలుసుకుని కన్నీటిపర్యంతం అవుతున్నారు. తమ డబ్బు తమకు వెనక్కి ఇప్పించాలని పోలీసులను వేడుకున్నారు. తామంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, పోలీసులే తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. స్వర్ణలత వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటుంది. ప్రస్తుతం ఆమె ఇంటికి తాళం వేసి ఉంది. స్వర్ణలత అందుబాటులో లేదు. స్వర్ణలతకు సంబంధించిన వివరాలన్నీ సేకరిస్తున్నామని, త్వరలోనే ఆమెను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు బాధితులకు ఒక భరోసా ఇచ్చారు.

Madhya Pradesh: దారి దోపిడీ దొంగకోసం పోలీస్‌ స్టేషన్‌పై మూకుమ్మడి దాడి, నలుగురు పోలీసులను కొట్టి దొంగను విడిపించుకొని వెళ్లిన 60 మంది ముఠా 

తాము కట్టిన డబ్బు తిరిగి ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులను వేడుకుంటున్నారు. లేదంటే తమకు చావు తప్ప మరో దారి లేదంటున్నారు. అమాయక మహిళలు, ఇళ్లల్లో పని చేసుకునే వారినే ఎక్కువగా స్వర్ణలత టార్గెట్ చేసింది. అధిక వడ్డీ ఆశ చూపి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసింది. లక్ష రూపాయలు కడితే చాలు అదనంగా మరో లక్ష రూపాయలు ఇస్తానని ఆశ పెట్టింది. పలు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తున్నామని, డబ్బు కడితే డబుల్ మనీ గ్యారంటీ అని నమ్మించి మోసం చేసింది. ఎక్కువగా మహిళలు అందునా ఇళ్లల్లో పని చేసుకునే వారిని స్వర్ణలత టార్గెట్ చేసింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now