Viral Baby: రెండు ముఖాలు, నాలుగు కాళ్లతో జన్మించిన శిశువు, ఉత్తరప్రదేశ్ లో వింతశిశువును చూసేందకు ప్రజల క్యూ, మీరూ చూసేయండి (వీడియో)
నవజాత శిశువుకు రెండు ముఖాలు, నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్నాయి. (Baby With 2 Faces, 4 Legs, 4 Arms) వింతగా పుట్టిన ఆ శిశువును చూసి డాక్టర్లు షాక్ అయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Lucknow, July 22: ఒక మహిళ అరుదైన శిశువుకు జన్మనిచ్చింది. నవజాత శిశువుకు రెండు ముఖాలు, నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్నాయి. (Baby With 2 Faces, 4 Legs, 4 Arms) వింతగా పుట్టిన ఆ శిశువును చూసి డాక్టర్లు షాక్ అయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కిరాతాపూర్ గ్రామానికి చెందిన 40 ఏళ్ల రమాదేవి నిండు గర్భిణి. ఆదివారం అర్ధరాత్రి ఆమెకు ప్రసవ నొప్పులు వచ్చాయి. దీంతో రేవన్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు అసాధారణ శిశువుకు రమాదేవి జన్మనిచ్చింది. ఆ బాబుకు రెండు ముఖాలు, నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్నాయి. వింతగా పుట్టిన ఆ శిశువును చూసి వైద్యులు, నర్సులు షాక్ అయ్యారు. అయితే ఆ శిశువు శరీరం మరో శిశువు శరీరానికి అతుక్కుపోయిందని డాక్టర్లు తెలిపారు. ఒక శరీరం అభివృద్ధి చెందగా మరో శరీరం అభివృద్ధి చెందలేదని చెప్పారు. దీంతో ఆ బాబుకు రెండు ముఖాలు, నాలుగు కాళ్ళు, నాలుగు చేతులు ఉన్నాయని అన్నారు.
మరోవైపు వింతగా పుట్టిన శిశువును చూసేందుకు గ్రామస్తులు ఆసుపత్రికి వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అయితే పుట్టిన ఐదు గంటల తర్వాత ఆ పసి బాబు మరణించాడు. దీంతో శిశువు తల్లిదండ్రులు ఆవేదన చెందారు. కాగా, వింత శిశువు వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.