Work From Home: డిసెంబర్ 31 వరకు ఇంటి నుంచే పని, ఐటీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్రం, దేశంలో కొనసాగుతున్న కరోనావైరస్ కల్లోలం
ఈ నేపథ్యంలో కంపెనీలు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’కు (Work From Home) అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇప్పటికే చాలా వరకు ఐటీ కంపెనీలు ( IT Companies) ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేయడానికి వెసులుబాటు కల్పించాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం (Union Govt) మరోసారి ఐటీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఐటీ, బీపీవో కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని డిసెంబర్ 31 వరకు పొడిగించింది. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో మరికొన్ని నెలల పాటు 'వర్క్ ఫ్రం హోం' సౌకర్యాన్ని కేంద్రం పొడిగించింది.
New Delhi, July 22: కరోనావైరస్ దేశంలో పెను కల్లోలాన్ని రేపుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీలు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’కు (Work From Home) అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇప్పటికే చాలా వరకు ఐటీ కంపెనీలు ( IT Companies) ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేయడానికి వెసులుబాటు కల్పించాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం (Union Govt) మరోసారి ఐటీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఐటీ, బీపీవో కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని డిసెంబర్ 31 వరకు పొడిగించింది. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో మరికొన్ని నెలల పాటు 'వర్క్ ఫ్రం హోం' సౌకర్యాన్ని కేంద్రం పొడిగించింది. ఎన్–95 మాస్కులతో కరోనా వస్తోంది, హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం, గుడ్డతో తయారు చేసిన మాస్కులు వాడటమే ఉత్తమమంటూ సూచన
కాగా గతంలో విధించిన గడువు జూలై 31తో ముగుస్తున్నది. కోవిడ్-19 కారణంగా ప్రజల్లో నెలకొన్న భయాందోళనను దృష్టిలో ఉంచుకొని ఇంటి నుంచి పనిచేసే విధానాన్ని 2020 డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ సర్వీసు ప్రొవైడర్లకు నిబంధనలు, షరతులలో డాట్ సడలింపులు ఇచ్చిందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ట్వీట్ చేసింది. భారత్‌లో ప్రస్తుతం 85శాతం మంది ఐటీ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే అవకాశం కల్పించారు. చాలా కొద్ది మంది మాత్రమే ఆఫీసులకు వెళ్తున్నారు.
Here's what DoT said:
భారత్‌లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 37,724 తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూడటంతో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 11,92,915కు ఎగబాకింది. మహమ్మారి బారినపడి కోలుకున్న వారి సంఖ్య 7,53,050కి పెరగడం ఊరట ఇస్తోంది. దేశంలో మొత్తం 4,11,133 యాక్టివ్ కేసులున్నాయి. ప్రాణాంతక వైరస్‌తో గడిచిన 24 గంటల్లో 648 మంది మరణించడంతో కరోనా మరణాల సంఖ్య 28,732కి చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈనెల 21 వరకూ 1,47,24,546 శాంపిళ్లను పరీక్షించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.