YSRCP New District Psresidents: పార్టీని ప్రక్షాళన చేస్తున్న జగన్, పలు జిల్లాలకు కొత్త అధ్యక్షులు, కొత్తగా నియమితులైనది వీరే..

పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.

YSRCP Logo (Photo-YSRCP/X)

Vjy, Sep 26: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాలుగు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా గుడివాడ అమర్‌నాథ్‌, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా బూడి ముత్యాల నాయుడు, అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు, బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మేరుగు నాగార్జున, బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులుగా నందిగం సురేష్, పార్టీ పీఏసీ మెంబర్‌గా ఆదిమూలపు సురేష్, విశాఖపట్నం (వెస్ట్) అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా మళ్ళా విజయప్రసాద్.. పార్టీ పీఏసీ మెంబర్‌గా, రాష్ట్ర ఎస్టీ విభాగం అధ్యక్షురాలిగా కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి నియమితులయ్యారు.

ఇళ్ల మీదకు కిరాయి మనుషుల్ని పంపిస్తే భయపడతామా? పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడిన పేర్ని నాని

కాగా, నిన్న(బుధవారం) మూడు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా అంబటి రాంబాబు, కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా పేర్ని వెంకట్రామయ్య (నాని), ఎన్టీఆర్‌ జిల్లా అధ్య­క్షుడిగా దేవినేని అవినాష్‌ నియమితు­ల­య్యారు. గుంటూరు, నరసరావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గాల పార్టీ పరిశీలకులుగా మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిని నియ­మించారు. వెలంపల్లి శ్రీనివాస­రావును పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సభ్యుడిగా నియమించారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా దొంతిరెడ్డి శంకర్‌రెడ్డి (వేమారెడ్డి), పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కైలే అనిల్‌కుమార్‌ నియమితులయ్యారు.