Tirupati Laddu Dispute: చంద్రబాబు నిజంగా శ్రీవారి భక్తుడేనా ? కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు, ఆయన పాపాలు కడిగేందుకే పూజలు చేస్తున్నామని పేర్ని నాని ప్రకటన
తిరుపతి లడ్డు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. దీనిపై పార్టీ నేతలు కొడాలినాని, వల్లభనేనివంశీతో కలిసి తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం(సెప్టెంబర్25) పేర్నినాని మీడియాతో మాట్లాడారు.
Vjy, Sep 25: తిరుపతి లడ్డు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. దీనిపై పార్టీ నేతలు కొడాలినాని, వల్లభనేనివంశీతో కలిసి తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం(సెప్టెంబర్25) పేర్నినాని మీడియాతో మాట్లాడారు. రాజకీయాల కోసం చంద్రబాబు దైవాన్ని కూడా వదల్లేదని మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. తిరుమలలో నెయ్యిని వెనక్కి పంపామని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. చంద్రబాబు, లోకేశ్ మాత్రం అబద్ధాలు చెబుతున్నారు.లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. తన కుట్ర రాజకీయాల కోసం కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీశారు.
లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు మాట్లాడారు.అలాంటిదేమీ లేదని ఈవో శ్యామలరావు చెప్తుంటే చంద్రబాబు అడ్డమైన ఆరోపణలు చేశారు.లోకేష్ అయితే ఏకంగా పందికొవ్వు కలిసిందన్నారు. పవన్ కళ్యాణ్ కూడా అదే దారిలో ఆరోపణలు చేశారు.ఈ కూటమి పాపాన్ని ప్రక్షాళన చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ భావించింది. వారి పాపాలను క్షమించి వదిలేయమని శనివారం(సెప్టెంబర్28) రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజలు చేయాలని పిలుపునిస్తున్నాం.
శరీరం, ఆత్మ వేరైనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒకటే.అందుకే చంద్రబాబు మాట్లాడిన మలినపు మాటలకు పవన్ కూడా వత్తాసు పలికారు.ఎన్నికలకు ముందు చంద్రబాబు అనేక హామీలు ఇస్తే వాటికి పవన్ కూడా హామీ ఇచ్చారు.బస్సులో ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అమ్మకు రూ.18 వేలు.. ఇలా అనేక హామీలు ఇచ్చారు అవేమీ అమలు చేయలేదు కాబట్టి వారంతా లోలోపల మదనపడుతున్నారు.
Jagan Meeting with YSRCP Leaders
అందుకే పాపపరిహార్ధం ప్రాయశ్చిత్త శిక్ష వేసుకున్నారు.తాను బాప్టిజం తీసుకున్నట్టు పవన్ చెప్పారు.జనం ఏదీ మర్చిపోరు.నెయ్యి వెయ్యి రూపాయలు ఉందని చంద్రబాబు అంటున్నారు.మరి ఆయన హయాంలో ఏనాడైనా వెయ్యి రూపాయలకు కొన్నారా?జగన్ ప్రభుత్వం కంటే తక్కువ ధరకే చంద్రబాబు హయాంలో కొనుగోలు చేశారు.హెరిటేజ్ లో ఆవునెయ్యి నాలుగు వందలకు ఎలా ఇస్తున్నారు’అని పేర్ని నాని ప్రశ్నించారు.
చంద్రబాబు నిజంగా శ్రీవారి భక్తుడేనా: కొడాలి నాని
అసలు చంద్రబాబు నిజంగా శ్రీవారి భక్తుడేనా అని కొడాలి నాని ప్రశ్నించారు. స్వామివారి ప్రతిష్టను మంటకలిపేలా చంద్రబాబు ఆరోపణలు చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో 18 సార్లు కల్తీ ట్యాంకర్లను వెనక్కు పంపాం.ప్రతి ట్యాంకర్‌ను నిబంధనలకు అనుగుణంగా టెస్టులు చేశాం.వందల ఏళ్లుగా ఇలాంటి ఆనవాయితీ కొనసాగుతోంది.జులై 17 న ఒక ట్యాంకర్‌లో నెయ్యి సరిగా లేదని వెనక్కి పంపారు.ఆ నెయ్యిని లడ్డూలో వాడలేదు.కానీ చంద్రబాబు మాత్రం అడ్డమైన ఆరోపణలు చేశారని మండిపడ్డారు.
అపవిత్రమైన లడ్డూలను భక్తులు తిన్నారని చంద్రబాబు అన్నారు.జగన్‌ని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని ఇలాంటి దుర్మార్గపు ఆరోపణలు చేశారు.చంద్రబాబుకు బుద్ది రావాలని వెంకటేశ్వర స్వామి ని కోరుకుంటున్నాం.వెంకటేశ్వరస్వామిని కూడా రాజకీయాలకు వాడుకున్న దుర్మార్గుడు చంద్రబాబు.ఏ ల్యాబ్ కూడా కల్తీలు జరిగినట్టు రిపోర్టు ఇవ్వలేదు
కల్తీ జరిగే అవకాశం ఉందని మాత్రమే చెప్పాయి.దాన్ని పట్టుకుని చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయం చేశారు.చంద్రబాబు అసలు వెంకటేశ్వర స్వామి భక్తుడేనా?.నిజమైన భక్తుడే ఐతే ఎన్నిసార్లు తలీలాలు అర్పించారో చెప్పాలి.
Here's Videos
సుప్రీంకోర్టు న్యాయమూర్తికి కూడా జగన్ లేఖ రాశారు.విచారణ జరపాలని కోరాం.సిట్ అంటే కూర్చునే, స్టాండ్ అంటే నిలపడే అధికారులతో సిట్ వేస్తే ఏం లాభం?.టీడీపీ ఆఫీసులో లోకేష్ చెప్పినట్టు రిపోర్ట్ రాసే వారు ఇంకేం విచారణ చేస్తారు?చంద్రబాబు చేసిన పాపానికి ఆయనకే శిక్ష వేయాలి
రాష్ట్రం సౌభాగ్యంగా ఉండాలని కోరుతూ శనివారం ప్రత్యేక పూజల కార్యక్రమానికి పిలుపునిస్తున్నామన్నారు కొడాలి నాని
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)