Zika Virus: జికా వైరస్ లక్షణాలు ఇవే, దోమలతో చాలా జాగ్రత్తగా ఉండాలి, తెలంగాణలో కలకలం పుట్టిస్తున్న జికా వైరస్, దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జికావైరస్ కేసులు, అప్రమత్తతపై హెచ్చరిస్తున్న వైద్యులు

దేశంలో కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ.. ప్రజలను జికా వైరస్‌ (Zika virus spreads) టెన్షన్‌కు గురి చేస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో జికా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) హెచ్చరించింది.

Zika Virus (Photo Credits: Flicr)

Hyd, July 6: దేశంలో కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ.. ప్రజలను జికా వైరస్‌ (Zika virus spreads) టెన్షన్‌కు గురి చేస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో జికా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్రంలో జికా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఐసిఎంఆర్ మరియు ఎన్ఐవి, పూణే నిర్వహించిన అధ్యయనం ప్రకారం, జికా వైరస్ తెలంగాణతో సహా చాలా భారతీయ రాష్ట్రాలకు వ్యాపించిందని తెలిపింది. ముఖ్యంగా తెలంగాణా రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులతో పాటు జికా వైరస్ టెర్రర్ సృష్టిస్తుంది.

ఈ అధ్యయనం ఫ్రాంటియర్స్ ఇన్ మైక్రోబయాలజీ జర్నల్‌లో ఇటీవలే ప్రచురించబడింది. వీరి అధ్యయనంలో భాగంగా 1,475 నమూనాలను పరీక్షించగా.. మొత్తం 188 నమూనాలలో 64 నమునాలు జికా వైరస్ పాజిటివ్‌గా తేలినట్టు చెప్పింది. ఇక, ఢిల్లీ, జార్ఖండ్, రాజస్థాన్, పంజాబ్, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో జికా వైరస్ (Zika virus spread) ఉనికిని కనుగొన్నట్టుగా అధ్యయనం పేర్కొంది. ఫ్రాంటియర్స్ ఇన్ మైక్రోబయాలజీ జర్నల్‌లో ప్రచురించబడిన జికా వైరస్ పై చేసిన ఈ అధ్యయనం భారతదేశంలోని అనేక రాష్ట్రాలకు జికా వైరస్ వ్యాప్తి చెందుతుందని మరియు దాని నిఘాను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తుంది.

దేశంలో ఇంకో కొత్త వైరస్, కేరళని వణికిస్తున్న జికా వైరస్, రెండు రోజుల్లోనే 14 కేసులు వెలుగులోకి, జికా వైరస్‌ లక్షణాలు ఏంటి, శరీరంలో జికా వేటిపై ప్రభావం చూపుతుంది, Zika Virus ఎలా వ్యాపిస్తుంది, పూర్తి సమాచారం మీకోసం

జికా వైరస్ అనేది దోమల ద్వారా సంక్రమించే వ్యాధి. దీని లక్షణాలు జ్వరం, తలనొప్పి, దద్దుర్లు మరియు కీళ్ల మరియు కండరాల నొప్పి. జికా వైరస్ కు సంబంధించి గతేడాది కేరళలో 66 వైరస్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు తెలంగాణాలోనూ జికా వైరస్ వ్యాప్తి కనిపిస్తుంది. తాము చేపట్టిన ZIKV (జికా వైరస్) కోసం రెట్రోస్పెక్టివ్ నిఘా భారతదేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు ఈ వైరస్ యొక్క నిశ్శబ్ద వ్యాప్తిని ప్రదర్శిస్తుంది అని అధ్యయనం పేర్కొంది. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని సూచించింది.

ఢిల్లీ, జార్ఖండ్, రాజస్థాన్, పంజాబ్, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర మరియు ఉత్తరప్రదేశ్‌లలో వైరస్ ఉనికిని అధ్యయనం కనుగొంది. దేశంలోని మొత్తం 13 రాష్ట్రాల్లో మే నుండి అక్టోబర్ 2021 వరకు ప్రైవేటు మరియు ప్రభుత్వ ఆసుపత్రి మైక్రోబయాలజీ విభాగం నుండి నమూనాలను సేకరించి పరిశీలించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ, ఢిల్లీ, జార్ఖండ్, రాజస్థాన్, మరియు పంజాబ్ లో జికా వైరస్ నిశ్శబ్ద వ్యాప్తి కొనసాగుతుందని, ఈ రాష్ట్రాలలో లోకల్ ట్రాన్స్మిషన్ సూచించబడుతుంది అని అధ్యయనం పేర్కొంది.

ఉత్తరప్రదేశ్‌ను వణికిస్తున్న జికా వైరస్, కొత్తగా మరో 25 జికా కేసులు నమోదు

ఇదిలా ఉంటే శాస్త్రవేత్తలు ఇప్పుడు జికా వైరస్‌ను గుర్తించడం ప్రారంభించినట్లు హైదరాబాద్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎపిడెమియాలజిస్ట్ మరియు ప్రొఫెసర్ షామన్న అన్నారు. ఇంతకుముందు, జికా అంటే ఏమిటో తమకు తెలియదని, కానీ ఇటీవల వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు. ప్రజలు, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు.

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రొఫెసర్, ఎపిడెమాలజిస్ట్ డాక్టర్ బీఆర్‌ శమ్మన్నా దీనిపై స్పందించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు జీకా వైరస్‌ను గుర్తించడంపై దృష్టిపెట్టడం మొదలుపెట్టారని అధ్యయనంలో తేలిందని అన్నారు. జికా వైరస్‌పై అవగాహన పెరుగుతోందని చెప్పారు. ఇంతకు ముందు జికా వైరస్‌ గురించి అంతగా పట్టించుకోలేదన్నారు. ఇక, జీకా వైరస్ దోమలద్వారా వ్యాపించే వ్యాధి. ఈ వైరస్‌ కారణంగా జ్వరం, తలనొప్పి, శరీరంపై దద్దుర్లు, కీళ్లు, కండరాల నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయి. కాగా, డెంగ్యూలాగే ఈ వైరస్ కూడా చాలా ప్రమాదకరని వైద్యులు హెచ్చిరిస్తున్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement