PM Modi Independence Day 2024 Speech: 2047 నాటికి వికసిత భారత్‌ మనందరి లక్ష్యం, ప్రపంచానికే అన్నం పెట్టే స్థాయికి భారత ఎదగాలని ఆకాంక్షించిన ప్రధాని మోదీ

78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేశారు.

PM Modi Independence Day 2024 Speech

New Delhi, August 15:  78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం జాతీయ జెండాకు వందనం చేశారు. వరుసగా 11వ సారి ఎర్రకోటపై ప్రధాని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి ప్రధాని మాట్లాడారు.. వికసిత్ భారత్ థీమ్‌తో హర్ ఘర్ తిరంగా పేరుతో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు జరుగుతున్నాయని అన్నారు.

దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుందామని, దేశం కోసం జీవితాలనే పణంగా పెట్టిన మహనీయులు ఎందరో ఉన్నారని, భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. భారత దేశ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుందామని పిలుపునిచ్చారు. ప్రపంచానికే అన్నం పెట్టే స్థాయికి భారత దేశం ఎదగాలని, దేశాభివృద్ధికి పాలనా సంస్కరణలు అవసరమని, అలాగే న్యాయ వ్యవస్థలో సంస్కరణలు అవసరమని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. అంతరిక్షంలో భారత్‌ స్పేస్ స్టేషన్‌ త్వరలో సాకారం కావాలన్నారు. ఎర్రకోటపై ఎగిరిన మువ్వన్నెల జెండా, 11వ సారి జాతీయజెండా ఎగురవేసిన ప్రధాని మోడీ, 2047 వికసిత్ భారత్ లక్ష్యమన్న ప్రధాని,ఎర్రకోటపై హెలికాప్టర్లతో పూలవర్షం

దేశం కోసం జీవితాలను పణంగా పెట్టిన మహనీయులు ఎందరో ఉన్నారని.. ప్రాణాలర్పించిన మహనీయులకు దేశం రుణపడి ఉందననారు. భారత్‌ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని.. శతాబ్దాల తరబడి దేశం బానిసత్వంలో మగ్గిందన్నారు. స్వాతంత్య్రం కోసం ఆనాడు 40కోట్లమంది ప్రజలు పోరాడారని.. ఇప్పడు దేశ జనాభా 140 కోట్లకు పెరిగిందని చెప్పారు. ఈ 140కోట్ల జనం కలలను సాకారం చేయాల్సి ఉందన్నారు. ఇందుకు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగాలన్నారు. కొన్నేళ్లుగా విపత్తులు దేశాన్ని ఇబ్బందిపెట్టాయని.. విపత్తు బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలిపారు. మీ బంధుమిత్రులకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేయాలంటే...ఈ ఫోటో గ్రీటింగ్స్ ఉపయోగించుకోండిలా..

2047 నాటికి వికసిత భారత్‌ మనందరి లక్ష్యమని ప్రధాని తెలిపారు. భారత్‌ను ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మార్చాలని.. తయారీరంగంలో గ్లోబల్‌ హబ్‌గా భారత్‌ని తీర్చిదిద్దాలన్నారు. ప్రపంచానికే అన్నంపెట్టే స్థాయికి భారత్‌ ఎదగాలని.. దేశాభివృద్ధికి పాలనా సంస్కరణలు అవసరమన్నారు. న్యాయవ్యవస్థలో సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. అంతరిక్షంలో భారత స్పేస్‌స్టేషన్‌ త్వరలో సాకారం కావాలన్నారు. మనం అనుకుంటే 2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని చెప్పారు. వికసిత భారత్‌ 2047 నినాదం 140కోట్ల మంది కలల తీర్మానమని.. దళితులు, పీడితులు, ఆదివాసీలు గౌరవంగా బతకాలన్నారు. వోకల్‌ ఫర్‌ లోకల్‌ అనేది ప్రభుత్వ వ్యూహమని.. వోకల్‌ ఫర్‌ లోకల్‌ నినాదం ఆర్థిక వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చిందని చెప్పారు.

సర్జికల్‌ స్ట్రయిక్స్‌ను దేశ ప్రజలు సగర్వంగా స్మరించుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి బ్లూప్రింట్‌గా సంస్కరణలు తీసుకువస్తున్నామని.. నేషన్‌ ఫస్ట్‌.. రాష్ట్ర్‌ హిత్‌ సుప్రీం సంకల్పంతో ముందుకెళ్తున్నామన్నారు. బ్యాంకింగ్‌ రంగంలో ఎన్నో సంస్కరణలు అమలు చేశామని తెలిపారు. భారత బ్యాకింగ్‌ వ్యవస్థ ప్రపంచంలోనే బలమైందని.. జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా 15కోట్ల మందికి లబ్ధి చేకూరిందన్నారు. భారత్‌ చిరుధాన్యాలు ప్రపంచంలోని అందరికీ చేరాలని.. భారీ సంస్కరణలు తెచ్చేందుకు ప్రభుత్వం సంకల్పం తీసుకుందన్నారు. దేశాభివృద్ధికి నూతన ఆర్థిక విధానాలు అమలు చేస్తున్నామని.. ఉపాధి కల్పనలో గణనీయమైన ప్రగతి సాధించామన్నారు. యువతకు నూతన ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయన్నారు.

ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ కామెంట్ చేశారు. బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు చాలా బాధాకరమని, బంగ్లాలో శాంతి నెలకొల్పేందుకు కృషిచేస్తానని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. బంగ్లా అల్లర్లతో అల్పసంఖ్యాక వర్గాలకు ఇబ్బందులు కలుగుతున్నాయని, వారికి ఏం కాదని భరోసా ఇస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.భారత్‌ పొరుగు దేశాల్లో శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని భారత్‌ కోరుకుంటుందని.. అక్కడ పరిస్థితులు త్వరలోనే సాధారణ స్థితికి వస్తాయని ఆశిస్తున్నామన్నారు. అలాగే అక్కడి హిందువులు, మైనారిటీలకు భద్రత కల్పించాలని.. మన పొరుగు దేశం సుఖశాంతుల బాటలో నడవాలని ఆకాంక్షిస్తున్నారు.

మానవ జాతి సంక్షేమం కోసమే భారత్ ఆలోచిస్తుందన్న ఆయన.. భారత్‌ తన వికాస్ యాత్రలో రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్‌‌కు అండగా ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ప్రధానిగా షేక్‌ హసీనా రాజీనామా హింసాత్మక దాడులు మరింత ఎక్కువయ్యాయి. రాజీనామా అనంతరం ఆమె భారత్‌కు చేరుకున్నారు. హిందువులతో పాటు మైనారిటీలపై దాడులు విపరీతంగా పెరిగాయి. ఆలయాలపై సైతం దాడులకు తెగబడుతూ దోచుకుంటున్నారు. ఈ క్రమంలో అక్కడి పరిస్థితులపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.

శంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆందోళన వ్యక్తం చేశారు.మహిళలపై జరుగుతున్న నేరాలపై (crimes against women) ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల భద్రతకు భరోసా ఇవ్వాలన్నారు. ఈ ఘటనల్లో త్వరితగతిన విచారణ జరిపి నిందితుల్ని శిక్షించాల్సిన (strictest punishment) అవసరం ఉందన్నారు.

‘ఈరోజు ఎర్రకోట నుంచి నా బాధను మరోసారి చెప్పాలనుకుంటున్నాను. సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి మనం తీవ్రంగా ఆలోచించాలి. మన తల్లులు, సోదరీమణులపై జరుగుతున్న దాడులపై ప్రజల్లో ఆందోళన ఉంది. దానిని నేను అర్థం చేసుకోగలను. దీన్ని దేశం, సమాజం, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా పరిగణించాలి. మహిళలపై దాడుల కేసులను వేగంగా దర్యాప్తు చేయాలి. నిందితులకు కఠిన శిక్షలు విధించాలి. ఇలా చేయడం సమాజంలో నమ్మకాన్ని పెంచుతుంది’ అని మోదీ పేర్కొన్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now