2024 భారత దేశం ఎన్నికలు: 58 లోక్ సభ స్థానాలకు మొదలైన 6వ దశ పోలింగ్.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొదలైన ఓటింగ్.. బరిలో 889 మంది అభ్యర్థులు.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్ ప్రక్రియ
సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది.
Newdelhi, May 25: లోక్ సభ ఎన్నికల్లో (Loksabha Elections) భాగంగా ఆరవ దశ పోలింగ్ (Sixth Phase) నేడు ఉదయం 7 గంటలకు మొదలైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. దీని కోసం ఎన్నికల సంఘం (Election Commission) విస్తృత ఏర్పాట్లు చేసింది. ఓటింగ్ సజావుగా, ప్రశాంతంగా జరిగేలా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. మొత్తం 889 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 11.13 కోట్ల మంది ఓటర్లు ఆరో దశలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 5.84 కోట్ల మంది పురుషులు, 5.29 కోట్ల మంది మహిళలు, 5,120 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. దాదాపు 11.4 లక్షల మంది పోలింగ్ సిబ్బంది సేవలు అందిస్తున్నారు. జూన్ 1తో ఏడవ దశ పోలింగ్ పూర్తయితే, మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగియనున్నది. జూన్ 4 ఫలితాలు వెలువడనున్నాయి.
ఏ రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు
బీహార్‌లో 8 సీట్లు, హర్యానాలో మొత్తం 10 సీట్లు, జమ్మూకశ్మీర్‌లో 1 సీటు, జార్ఖండ్‌లో 4, ఢిల్లీలోని మొత్తం 7 సీట్లు, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్‌లో 14, పశ్చిమ బెంగాల్‌లో 8 సీట్లకు పోలింగ్ జరుగుతోంది.
వామ్మో.. అనసూయ ఇలా తయ్యారైంది ఏంటి అంటూ అవాక్కవుతున్న నెటిజన్లు, తడిసిన ఒంటితో మొత్తం చూపించేస్తూ..
బరిలో ప్రముఖులు
ఆరో దశలో భాగంగా కర్నాల్ స్థానం నుంచి బీజేపీ సీనియర్ మనోహర్ లాల్ ఖట్టర్, అనంతనాగ్-రాజౌరి నుంచి పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ ఉన్నారు. ఇక కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ జాబితాలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.