Electoral Trusts Donations: బీజేపీకి భారీగా డొనేషన్లు, ఏడాదిలో కమలం పార్టీకి రూ.212 కోట్లు విరాళాలు, మిగిలిన పార్టీలు అంతంతమాత్రమే

ఒక్క ఏడాది అత్యధిక డొనేషన్లు (Donations) పొందిన రాజకీయ పార్టీగా బీజేపీ (BJP) కొత్త రికార్డు సృష్టించింది. గత ఏడాది రాజకీయ పార్టీలకు అందిన విరాళాల లెక్కలు చూస్తే దేశవ్యాప్తంగా 12 ప్రధాన పార్టీలకు మొత్తం రూ.258 కోట్ల వరకు విరాళాలు అందగా.. అందులో ఒక్క బీజేపీకే రూ.212 కోట్లు డొనేషన్లు (Donations) రాబట్టింది.

The BJP Symbol (Representational Image/ Photo Credits: ANI)

New Delhi, April 22:  భారతీయ జనతా పార్టీ మరో రికార్డు నెలకొల్పింది. ఒక్క ఏడాది అత్యధిక డొనేషన్లు (Donations) పొందిన రాజకీయ పార్టీగా బీజేపీ (BJP) కొత్త రికార్డు సృష్టించింది. గత ఏడాది రాజకీయ పార్టీలకు అందిన విరాళాల లెక్కలు చూస్తే దేశవ్యాప్తంగా 12 ప్రధాన పార్టీలకు మొత్తం రూ.258 కోట్ల వరకు విరాళాలు అందగా.. అందులో ఒక్క బీజేపీకే రూ.212 కోట్లు డొనేషన్లు (Donations) రాబట్టింది. మొత్తం రాజకీయ పార్టీలకు అందిన విరాళాలలో ఒక్క బీజేపీకే 82 శాతం వాటా దక్కింది.  ఇక బీజేపీ (BJP) తర్వాత రూ.27 కోట్లు విరాళాల‌తో బీజేపీ మిత్రపక్షమైన జేడీయూ (JDU) రెండో స్థానంలో నిలిచింది. ఇది 10.45 శాతానికి సమానం.

BJP Prajagraha Sabha: 2024లో ఏపీలో బీజేపీదే అధికారం, ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న నేతలు త్వరలోనే జైలుకు వెళతారు, విజయవాడ ప్రజాగ్రహ సభలో బీజేపీ నేతల సంచలన వ్యాఖ్యలు

కాగా, దేశంలో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ (Congress), దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీతో సహా ఎన్పీపీ (NCP), ఏఐఏడీఎంకే, డీఎంకే, ఆర్జేడీ, ఆప్ (AAP), ఎల్పేజీ, సీపీఎం, సీపీఐ, ఎల్జేపీలకు కలిపి మొత్తం రూ.19 కోట్లే విరాళంగా అందాయి. ఈ మేరకు ఎలక్టోరల్ ట్రస్టులు ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించాయని ‘అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రీఫార్మ్ (ADR) వెల్లడించింది.

The Great Khali Joins BJP: కాషాయపు కండువా కప్పుకున్న డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌ స్టార్ గ్రేట్ ఖలీ, ప్రధాని మోదీ విధానాల పట్ల ఆకర్షితుడై రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటన

దేశంలో మొత్తం 23 ఎలక్టోరల్ ట్రస్టులు ఉండగా.. వాటిలో 16 ట్రస్టులు ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించాయి. ఈ రిపోర్ట్స్ చూస్తే గత మూడేళ్లుగా బీజేపీ విరాళాల సేకరణతో పాటు ధనిక పార్టీగా అవతరించింది. అధికారంలో ఉన్న బీజేపీ ఏడాదికి ఏడాది ఆర్థికంగా కూడా అత్యధిక బలం కల్గిన పార్టీగా అవతరిస్తుంది. ఇప్పటికే ఆస్తుల విషయంలో మరే జాతీయ పార్టీకి సాధ్యం కాని రీతిలో సత్తా చాటిన బీజేపీ విరాళాలతో ఏటా తన ఆర్థిక బలాన్ని పెంచుకుంటోందని తాజా నివేదిక స్పష్టం చేస్తుంది.