Ajit Pawar Is Back As Dy CM : రెండోసారి డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్, మహారాష్ట్రలో కొలువుతీరిన పూర్తి స్థాయి ప్రభుత్వం, మంత్రి పదవులు దక్కించుకున్న ఆదిత్య ఠాక్రే, మాజీ సీఎం అశోక్ చవాన్

ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా (Chief Minister of Maharashtra) ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల తర్వాత ‘మహా’లో పూర్తి స్థాయి ప్రభుత్వం ( Uddhav Thackeray-led cabinet) కొలువు తీరింది. శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే ( Uddhav Thackeray) నేతృత్వంలోని కేబినెట్‌లో కొత్తగా 36 మంది మంత్రులకు చోటుదక్కింది.

Ajit Pawar (Photo Credits: PTI)

Mumbai, December 30: మహారాష్ట్రలో (Maharashtra) పూర్తి స్థాయి ప్రభుత్వం కొలువు తీరింది. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా (Chief Minister of Maharashtra) ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల తర్వాత ‘మహా’లో పూర్తి స్థాయి ప్రభుత్వం ( Uddhav Thackeray-led cabinet) కొలువు తీరింది. శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే ( Uddhav Thackeray) నేతృత్వంలోని కేబినెట్‌లో కొత్తగా 36 మంది మంత్రులకు చోటుదక్కింది. ఆ రాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ సోమవారం వీరిచేత ప్రమాణ స్వీకారం చేయించారు. అందరూ ఊహించినట్టుగానే ఎన్సీపీ సీనియర్‌ నేత అజిత్‌ పవార్‌కు డిప్యూటీ సీఎం పదవి దక్కింది.

మహా’ సర్కారు కీలక నిర్ణయం, రూ.2లక్షల వరకు రైతు రుణమాఫీ

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి కేంద్రబిందువుగా మారిన అజిత్‌ పవార్ (Ajit Pawar) రెండు నెలల్లో రెండోసారి డిప్యూటీ సీఎంగా(Deputy Chief Minister) ప్రమాణం చేయడం ఆసక్తికర అంశంగా చెప్పుకోవచ్చు. గతంలో దేవేంద్ర ఫడ్నవిస్‌తో (Devendra Fadnavis) చేతులు కలిపి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఎన్సీపీ నేతల పిలుపు మేరకు రాజీనామా చేసి సొంత గూటికి చేరుకున్నారు.

Here's ANI Tweet

ఇక తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదిత్య ఠాక్రే సైతం తండ్రి ప్రభుత్వంలో చోటు దక్కించున్నారు. దీంతో ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారి ఎన్నికల్లో పోటీచేసి మంత్రిగా ఎన్నికైన వ్యక్తిగా ఆదిత్య ఠాక్రే (Aaditya Thackeray)నిలిచారు.

Here's ANI Tweet

ఆదిత్య ఠాక్రేతో పాటుగా కాంగ్రెస్‌ నుంచి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌ మంత్రిగా (former CM Ashok Chavan) ప్రమాణం చేశారు. త్వరలోనే వీరికి శాఖలు అప్పగించనున్నారు.

మూడు రోజుల ముచ్చటైన సీఎం, డిప్యూటీ సీఎం పదవులు, సీఎం పదవికి ఫడ్నవిస్ రాజీనామా

కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేతగా గుర్తింపు పొందిన అశోక్‌ చవాన్‌ గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర 16వ ముఖ్యమంత్రిగా 2008 డిసెంబర్‌ 8 నుంచి 2010 నవంబర్‌ 9 వరకు ఆయన పదవిలో ఉన్నారు. సీఎంగా ఉన్న సమయంలో ఆదర్శ కుంభకోణం వ్యవహారంలో ఆయన పేరు తెర మీదకు రావడంతో పార్టీ ఆధిష్టానం ఒత్తిడి మేరకు సీఎం పదవికి ఆయన రాజీనామా చేశారు.

Here's ANI Tweet

తరువాతి అసెం‍బ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ దారుణ ఓటమిని చవిచూసింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో నాందేడ్‌ స్థానం నుంచి చౌహాన్ గెలుపొందారు. 2015లో పార్టీ రాష్ట్ర చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ పీసీసీ పదవికి రాజీనామా చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన కూడా ఓటమి చెందారు. తాజాగా ఉద్ధవ్‌ ప్రభుత్వంలో మంత్రిగా చోటు దక్కించున్నారు.



సంబంధిత వార్తలు

Union Budget 2025-26: వేత‌న‌జీవుల‌కు త్వ‌ర‌లోనే గుడ్ న్యూస్, రూ. 15 ల‌క్ష‌ల వ‌ర‌కు ట్యాక్స్ మిన‌హాయింపు ఇచ్చే యోచ‌న‌లో కేంద్రం, ఈ బడ్జెట్ లో బొనాంజా ప్ర‌కటించే ఛాన్స్

K Annamalai on Sandhya Theatre Incident: తెలంగాణ‌లో అన్నీ వదిలేసి సినిమావాళ్ల వెంట‌ప‌డుతున్నారు! సీఎం రేవంత్ రెడ్డిపై త‌మిళ‌నాడు బీజేపీ చీఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Heavy Rain Alert For Telugu States: బంగాళాఖాతంలో కొన‌సాగుతున్న అల్ప‌పీడ‌నం, తెలుగు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం

ICC Champions Trophy 2025: ఫిబ్రవరి 23న దుబాయ్‌లో భారత్-పాకిస్తాన్ హైవోల్టేజ్ మ్యాచ్, ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ పూర్తి షెడ్యూల్‌ ఇదిగో..