Amit Shah-Booth Karyakarta Sammelan: ఢిల్లీలో కాషాయపు జెండా ఎగరేస్తాం, గురుద్వారా దాడిపై కాంగ్రెస్ మౌనమెందుకు..?, సీఏఏపై ప్రభుత్వాన్ని ఆప్ తప్పుదారి పట్టిస్తోంది..?,ఢిల్లీలో నిప్పులు చెరిగిన హోమంత్రి అమిత్ షా
ప్రధాని మోడీ నాయకత్వంలో ఢిల్లీలో కాషాయపు జెండా ఎగరవేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు,(BJP President) కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Home Minister Amit Shah) అన్నారు. ఆదివారం రోజున న్యూఢిల్లీలో జరిగిన 'బూత్ కార్యకర్త సమ్మేళన్'కు(Booth Karyakarta Sammelan) హాజరైన అమిత్ షా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. కాంగ్రెస్,(Congress) ఆమ్ ఆద్మీ పార్టీలు(AAP) దళిత వ్యతిరేక పార్టీలని విమర్శించారు.
New Delhi, January 05: ప్రధాని మోడీ నాయకత్వంలో ఢిల్లీలో కాషాయపు జెండా ఎగరవేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు,(BJP President) కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Home Minister Amit Shah) అన్నారు. ఆదివారం రోజున న్యూఢిల్లీలో జరిగిన 'బూత్ కార్యకర్త సమ్మేళన్'కు(Booth Karyakarta Sammelan) హాజరైన అమిత్ షా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. కాంగ్రెస్,(Congress) ఆమ్ ఆద్మీ పార్టీలు(AAP) దళిత వ్యతిరేక పార్టీలని విమర్శించారు.
ఢిల్లీ ప్రజలను ముఖ్యమంత్రి కేజ్రీవాల్(Arvind Kejriwal) ఎంతోకాలం మభ్యపెట్టి.. మోసగించలేరన్నారు. రాబోయే ఎన్నికల్లో నరేంద్రమోడీ(PM Modi) నాయకత్వంలో ఇక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతామని అన్నారు.
కాగా పాక్‌లోని గురుద్వారాపై దాడి(Nankana Sahib Gurdwara attack) విషయంలో కాంగ్రెస్ వైఖరి ఏంటో చెప్పాలని ఈ సందర్భంగా ఆయన నిలదీశారు. సిక్కులపై దాడులు జరుగుతుంటే కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు.
Here's ANI Tweet
సీఏఏకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారికి నాన్‌కనా సాహెబ్ గురుద్వారాపై జరిగిన దాడే సమాధానమన్నారు. ఆ దాడిలో గాయపడిన సిక్కులు ఎక్కడకు వెళ్తారని అమిత్ షా ప్రశ్నించారు.
పౌరసత్వ సవరణ చట్టంపై దేశాన్ని కాంగ్రెస్, ఆప్ తప్పుదారి పట్టిస్తున్నాయంటూ మండిపడ్డారు. సీఏఏకు వ్యతిరకేంగా రాహుల్, ప్రియాంక హింసను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. సీఏఏపై తమ పార్టీ ఇంటింటికి వెళ్లి ప్రచారం సాగిస్తుందని, ప్రజలకు వాస్తవాలు వివరిస్తుందని హామీ ఇచ్చారు. సీఏఏ విషయంలో ప్రభుత్వం వెనుకడుగు వేయబోదని హోంమంత్రి, బీజేపీ చీఫ్ అమిత్ షా స్పష్టం చేశారు.
Here's ANI Tweet
ప్రతిపక్షాలు సీఏఏపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. మూడు కోట్ల మంది ప్రజలకు చేరేలా 500 ర్యాలీలను నిర్వహిస్తామన్నారు. సీఏఏపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు నేటి నుంచి ఇంటింటి ప్రచారం చేపట్టనున్నట్లు బీజేపీ తెలిపింది.
Here's ANI Tweet
ఇదిలా ఉంటే పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) పై బిజెపి టోల్ ఫ్రీ నంబర్ 8866288662 ను జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలు దీని గురించి బిజెపిని ఎగతాళి చేస్తున్నాయి. ఈ సంఖ్య నెట్ఫ్లిక్స్ నుండి వచ్చినట్లు చెబుతోంది. దీనికి సమాధానం చెప్పడానికి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా ముందుకు వచ్చారు. బిజెపి టోల్ ఫ్రీ నంబర్ ఏ నెట్‌ఫ్లిక్స్ నుంచి వచ్చినది కాదని, ఇది బిజెపి నంబర్ అని అన్నారు.
Here's ANI Tweet
పౌరసత్వ చట్టానికి మద్దతుగా జారీ చేసిన టోల్ ఫ్రీ నంబర్‌ను ఎగతాళి చేయవద్దని, దాని గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేయరాదని సంబిత్ పత్రా అన్నారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఈ నంబర్‌కు సంబంధించి వివరణ ఇచ్చారని, ఇది పౌరసత్వ చట్టం గురించి మాత్రమే అని అన్నారు.
Here's ANI Tweet
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ప్రకాష్ కారత్ కూడా పౌరసత్వ చట్టానికి మద్దతు ఇచ్చారని, బిజెపి తన చట్టపరమైన రూపాన్ని ఇచ్చినప్పుడు దానిని వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు.
Here's ANI Tweet
ఢిల్లీలోని కార్యకార్త సమ్మెలన్‌ను ఉద్దేశించి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ..ఢిల్లీలో అల్లర్లు నిర్వహించే ప్రభుత్వం మీకు కావాలా? ”అని ఆయన అన్నారు, పాకిస్తాన్‌లో మైనారిటీలను హింసించడం లేదని ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయి. నంకనా సాహిబ్ వంటి పవిత్ర స్థలంపై దాడి చేసి సిక్కు సోదరులను భయపెట్టే పని పాకిస్తాన్ చేసిందని కేజ్రీవాల్, రాహుల్, సోనియా గాంధీ దానిని బహిరంగంగా చూస్తున్నారే కాని వారి సమాధానం చెప్పడం లేదని మండిపడ్డారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)