AP Assembly Session: ఉన్నాది ముఖ్యమంత్రి అయితే ఇలానే ఉంటుందన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు, దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అయిదవ రోజు రచ్చరచ్చగా మారిన అసెంబ్లీ సమావేశాలు

కాగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య (TDP vs YSRCP) మాటల తూటాలు పేలుతున్నాయి. సభ ప్రారంభంలోనే అధికార, విపక్ష సభ్యుల మధ్య నిన్న అసెంబ్లీ ముందు జరిగిన ఘటనపై తీవ్ర వాగ్వాదం జరిగింది. అధికార పార్టీ తరఫున పేర్ని నాని, బుగ్గన రాజేంద్రనాథ్ తదితరులు మాట్లాడుతూ, మార్షల్స్ తో అనుచితంగా ప్రవర్తించిన చంద్రబాబు (Chandra babu)క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టారు.

ap-assembly-sessions-speaker-fires-tdp-members-over-their-behaviour | Photo Credits : PTI

Amaravathi, December 13: ఏపీ అసెంబ్లీ సమావేశాలు(Ap Assembly session) నేడు ఐదో రోజుకు చేరుకున్నాయి. కాగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య (TDP vs YSRCP) మాటల తూటాలు పేలుతున్నాయి. సభ ప్రారంభంలోనే అధికార, విపక్ష సభ్యుల మధ్య నిన్న అసెంబ్లీ ముందు జరిగిన ఘటనపై తీవ్ర వాగ్వాదం జరిగింది. అధికార పార్టీ తరఫున పేర్ని నాని, బుగ్గన రాజేంద్రనాథ్ తదితరులు మాట్లాడుతూ, మార్షల్స్ తో అనుచితంగా ప్రవర్తించిన చంద్రబాబు (Chandra babu)క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. ఈ వ్యవహారాన్ని తాను పరిశీలించానని, ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేస్తున్నానని స్పీకర్ తమ్మినేని ప్రకటించారు. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గత అసెంబ్లీలో జరిగిన కొన్ని ఘటనలను ప్రస్తావించారు.

 

చంద్రబాబుకు మానవత్వం లేదు: సీఎం జగన్‌

ఉన్మాది ముఖ్యమంత్రి అయితే ఇలాగే ఉంటుందంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు క్షమాపణ అడుగుతారని ఆశించడం లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) అన్నారు. చంద్రబాబుకు మానవత్వం లేదని.. క్షమాపణ చెప్పడాన్ని ఆయన విఙ్ఞతకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు. అవాస్తవ కథనాలపై చర్యలు తీసుకునేందుకు తీసుకువచ్చిన జీవోలో ఎటువంటి తప్పులేకపోయినా టీడీపీ రాద్ధాంతం చేసిందని మండిపడ్డారు. జీవోలో ఎటువంటి తప్పులేకపోయినా టీడీపీ రాద్ధాంతం చేసి.. సభా సమయాన్ని వృథా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆపై నిన్నటి నిరసనలు, అసెంబ్లీ గేటు (Assembly Gate) బయట జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను హౌస్ లో ప్రదర్శించారు. ఈ వీడియోలో మార్షల్స్ ను బాస్టర్డ్, యూజ్ లెస్ ఫెలో అని తిట్టడంతో పాటు, చీఫ్ మార్షల్ కాలర్ ను లోకేశ్ పట్టుకున్నట్టు కనిపిస్తోంది. వారి మధ్య జరిగిన వాగ్వాదాన్ని చూపించిన తరవాత జగన్ మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఇక చంద్రబాబు ఉన్మాది అన్న పదాన్ని తొలగించాలని దానికి ప్రతిపక్ష నేత వెంటనే క్షమాపణ చెప్పాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వ ఉద్యోగస్తుడిని, డీఎస్పీ స్థాయి అధికారిని బాస్టర్డ్ అని తిట్టినందుకు చంద్రబాబు సిగ్గు పడాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఉద్యోగులను అనరాని మాటలన్నారని, ఓ ప్రతిపక్ష నేతగా తమవారిని అదుపు చేయాల్సిన చంద్రబాబు, తన స్థాయిని దిగజార్చుకున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేత వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని మండిపడ్డారు. సభ్యులు కాని వారిని మాత్రమే మార్షల్స్ అడ్డుకున్నారని స్పష్టం చేసిన జగన్, చంద్రబాబు లోపలికి వచ్చేందుకు ప్రత్యేకమైన గేటు ఉన్నప్పటికీ, పార్టీ కార్యకర్తలను వెంటేసుకుని, ఊరేగింపుగా అసెంబ్లీలోకి మరో గేటు నుంచి రావడానికి ప్రయత్నించారని ఆరోపించారు.