Uddhav Thackeray On Ram Mandir: ఇది కేంద్రం ఘనత కానేకాదు, రామ మందిర నిర్మాణానికి చట్టం చేయాలని ఎప్పుడో కోరాం, ప్రభుత్వమే నిరాకరించింది, సుప్రీం తాజా తీర్పుతో ఏకీభవిస్తున్నామన్న ఉద్ధవ్‌ ఠాక్రే

అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు వెల్లడించిన తీర్పును కేంద్ర ప్రభుత్వం తన ఘనతగా చాటుకోలేదని శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు.

Ayodhya Case Final Judgment NDA govt cannot take credit for Ayodhya verdict: Shiv Sena chief Uddhav Thackeray (Photo-Twitter)

Mumbai, November 9: అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మీద శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే (Shiv Sena Chief Uddhav Thackeray) స్పందించారు. అయోధ్య వివాదం పై సుప్రీం కోర్టు వెల్లడించిన తీర్పును కేంద్ర ప్రభుత్వం తన ఘనతగా చాటుకోలేదని శివసేన (Shiv Sena) చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. అయోధ్యలో రామ మందిర(Ram mandir In Ayodhya) నిర్మాణానికి చట్టం చేయాలని తాము ప్రభుత్వాన్ని కోరితే అందుకు నిరాకరించిందని, సుప్రీం తాజా తీర్పు(Ayodhya Final Judgment)ను ప్రభుత్వం ఇప్పుడు తమ ఘనతగా చెప్పుకోరాదని ఠాక్రే ఆక్షేపించారు.

అయోధ్య( Ayodhya)లో వివాదాస్పద స్థలాన్ని మందిర నిర్మాణానికి ఏర్పాటు చేసే ట్రస్ట్‌కు అప్పగించాలని, మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయోధ్యలో రామ‌మందిర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ, శివసేనల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. సీఎం పదవిని చెరి రెండున్నరేళ్లు పంచుకోవాలన్న సేన ప్రతిపాదనను బీజేపీ వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి పదవికి ఫడ్నవీస్ రాజీనామా చేసారు. ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా

ఇక, రాష్ట్రపతి పాలన దిశగా మహారాష్ట్ర వెళ్తోంది. ఇదే సమయంలో అయోధ్య తీర్పు (Ayodhya verdict)పైన ఉద్దవ్ స్పందన ఆసక్తి కరంగా మారింది. శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. అయోధ్య కేసుపై చారిత్రాత్మక తీర్పు, అయోధ్య ట్రస్టుకు వివాదాస్పద భూమిని కేటాయించాలి

ఇది కేంద్ర ప్రభుత్వం తన ఘనతగా చాటుకోలేదని వ్యాఖ్యానించారు. అదే సమయంలో అయోధ్య అంశంలో తాము గతంలో చేసిన ప్రతిపాదనలను గుర్తు చేసారు. సుప్రీం తాజా తీర్పును అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి చట్టం చేయాలని తాము ప్రభుత్వాన్ని కోరితే అందుకు నిరాకరించిందని, సుప్రీం తాజా తీర్పును ప్రభుత్వం ఇప్పుడు తమ ఘనతగా చెప్పుకోరాదని ఠాక్రే ఆక్షేపించారు.