Mumbai,November 8: అసెంబ్లీ ఫలితాలు(Maharashtra Assembly Results) వెలువడినప్పటి నుంచి మహారాష్ట్ర రాజకీయాలు (MAHA Politics)వేడిని పుట్టిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి పదవిపై పార్టీలు పట్టు విడవడం లేదు. అత్క్ష్యధిక సీట్లు గెలుచుకున్న బీజేపీ దాని మిత్ర పక్షం శివసేన మధ్య ఇప్పటికీ సయోధ్య కుదరడం లేదు. నేటితో సీఎం పదవీకాలం పూర్తి అయింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి(chief minister of Maharashtra) దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) రాజీనామా చేశారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీని కలసి తన రాజీనామాను సమర్పించారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనా ?
మహారాష్ట్రలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో(Maharashtra Assembly) ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల ముందు బీజేపీ - శివసేన పొత్తు పెట్టుకుని కలసి పోటీ చేయగా, బీజేపీకి 105, శివసేనకు 56 సీట్లు వచ్చాయి.
రెండు పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా సీఎం సీటు విషయంలో రెండు పార్టీలు ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నాయి. రెండున్నరేళ్లు తమకు ముఖ్యమంత్రి పదవి కావాలని శివసేన పట్టుబట్టడంతో మహారాష్ట్ర పంచాయతీ అలాగే కొనసాగుతోంది.
ఫడ్నవిస్ రాజీనామా
Devendra Fadnavis: I have tendered my resignation to the Governor and he has accepted it https://t.co/js247DintG pic.twitter.com/eV0C38Z1Nf
— ANI (@ANI) November 8, 2019
ఇదిలా ఉంటే శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఎన్సీపీ పార్టీని కలవడంతో రాజకీయాలు మరింతగా వేడెక్కాయి. ఎన్సీపీ సపోర్ట్ ఇచ్చేది లేదని చెప్పినప్పటికీ ఆయన మళ్లీ ఎన్సీపీ పార్టీని కలవడంతో అధికార ఏర్పాటు(government formation) ఎవరు చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
శరద్ పవార్ నివాసంలో సంజయ్ రౌత్
Mumbai: Shiv Sena leader Sanjay Raut reaches NCP chief Sharad Pawar's residence. pic.twitter.com/M1WtvFq8n3
— ANI (@ANI) November 8, 2019
శరద్ పవార్(NCP chief Sharad Pawar) నివాసంలో సంజయ్ రౌత్ ఉండంటతో అక్కడ చర్చలు ఏం జరిగాయనే దానిపై ఇంకా అధికారికంగా ప్రకటనలు వెలువడలేదు. ఇదిలా ఉంటే శివసేన పార్టీ తన ఎమ్మెల్యేలను హోటల్ రీట్రీట్ కు తరలించింది. ఈ నెల 15 వరకు అక్కడే ఉండనున్నారు. సెక్యూరిటీ కావాలని ముంబై పోలీస్ కమిషనర్ కు లేఖను కూడా రాశారు.
పార్టీ నేతలను హోటల్ కు తరలించిన శివసేన
Mumbai: Shiv Sena to lodge its MLAs at Hotel Retreat in Madh, Malad West till November 15. Party has written to Mumbai Police Commissioner requesting for security arrangements pic.twitter.com/8SiDHPBgJ9
— ANI (@ANI) November 8, 2019
మొత్తం మీద మహారాష్ట్రలో 15 రోజులుగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ తదుపరి నిర్ణయం ఏంటన్నది ఉత్కంఠగా మారింది. ఇటీవల విడుదలైన ఎన్నికల ఫలితాల్లో అతి పెద్ద పార్టీగా అతవరించిన బీజేపీకి అవకాశం కల్పిస్తారా? లేక రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.