Basavaraj Bommai Sworn in: కర్నాటక కొత్త సీఎంగా బసవరాజ్ బొమ్మై ప్రమాణ స్వీకారం, 19 నెలల పాటు ముఖ్యమంత్రిగా పనిచేయనున్న కొత్త సీఎం, 2023 మేలోపు కర్ణాటక అసెంబ్లీకి తదుపరి ఎన్నికలు

రాష్ట్ర గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌.. బొమ్మైచే ప్రమాణం స్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం ముందు మాజీ సీఎం యడియూరప్ప (BS Yediyurappa) బసవరాజ్ బొమ్మయ్‌ ఆశీర్వాదం తీసుకున్నారు.

Basavaraj Bommai takes oath as Karnataka CM (Photo Credits: ANI)

Bengaluru, July 28: కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై పదవి ప్రమాణ స్వీకారం (Basavaraj Bommai Takes Oath as Chief Minister) చేశారు. రాష్ట్ర గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌.. బొమ్మైచే ప్రమాణం స్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం ముందు మాజీ సీఎం యడియూరప్ప (BS Yediyurappa) బసవరాజ్ బొమ్మయ్‌ ఆశీర్వాదం తీసుకున్నారు.

ఇక మంగళవారం కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మైను బీజేపీ శాసన సభాపక్షం ఎన్నుకున్న విషయం తెలిసిందే. దీంతో లింగాయత్‌ సామాజిక వర్గానికి మరోసారి ముఖ్యమంత్రి (Basavaraj Bommai Swearing In) పీఠం దక్కింది. మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఆర్‌ బొమ్మై కుమారుడే బసవరాజు. యడియూరప్ప వారసుడిగా ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్న బసవరాజు వైపే బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు మొగ్గు చూపిన సంగతి తెలిసిందే.

బసవరాజ బొమ్మై ఎంపికలో మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కీలకపాత్ర పోషించారు. అప్ప అత్యంత ఆప్తుల్లో ఒకరైన బసవరాజ బొమ్మై నాయకత్వాన్ని దాదాపు అందరూ ఆమోదించారు. శాసనసభాపక్ష సమావేశంలో ఆయన పేరును యడియూరప్ప ప్రతిపాదించగా మాజీ ఉపముఖ్యమంత్రి గోవింద కారజోళ ఆమోదం తెలిపారు. మంగళవారం వరకు దాదాపు పది మంది ఆశావహుల పేర్లు పరిశీలనలో ఉన్నా చివరకు ఈ పేరును అధిష్ఠానం ఖరారుచేసింది. ఇదే సందర్భంగా ముగ్గురు ఉపముఖ్యమంత్రులను నియమించారు. ఆర్‌.అశోక్‌, బి.శ్రీరాములు, గోవింద కారజోళ ఈ పదవులకు ఎంపికయ్యారు. బసవరాజు తండ్రి సోమప్ప రాయప్ప బొమ్మై కూడా 1988-89 మధ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు.

తరువాత ముఖ్యమంత్రి ఎవరని నేను చెప్పను, నాపై ఎవరూ ఒత్తిడి చేయలేదు, మరొకరికి అవకాశం కల్పించేందుకు రాజీనామా చేశా, వ‌చ్చే సీఎంకు 100 శాతం స‌హ‌కారం అందిస్తానని బీఎస్ యడియూరప్ప వెల్లడి

కర్ణాటక సీఎంలుగా పనిచేసిన వారిలో 50 శాతానికి పైగా రెండేళ్లలోపే పదవిలో ఉన్నారు. బుధవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న బసవరాజ బొమ్మైకి మరో 19 నెలల పదవీకాలం మాత్రమే మిగిలి ఉంది. 2023 మేలోపు కర్ణాటక అసెంబ్లీకి తదుపరి ఎన్నికలు జరగనున్నాయి.