క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి బీఎస్ యడ్యూర‌ప్ప రాజీనామాకు ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ తావ‌ర్‌చంద్ గెహ్లాట్ ఆమోదం తెలిపారు. అయితే, త‌దుప‌రి ముఖ్య‌మంత్రి ప్ర‌మాణ స్వీకారం చేసేవ‌ర‌కు రాష్ట్రానికి కేర్ టేక‌ర్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించాల‌ని ఆయన సూచించారు. క‌ర్ణాట‌కకు నాలుగోసార్లు ముఖ్య‌మంత్రిగా పనిచేసిన యడ్యూర‌ప్ప.. నాలుగోసారి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి ఇవాళ్టికి స‌రిగ్గా రెండు సంవ‌త్స‌రాలు పూర్త‌య్యింది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఈ ఉద‌యం గ‌వ‌ర్న‌ర్ తావ‌ర్‌చంద్ గెహ్లాట్‌ను క‌లిసి త‌న రాజీనామా లేఖ‌ను అంద‌జేశారు.కాగా, బీజేపీ జాతీయ‌ నాయ‌క‌త్వం, రాష్ట్ర నాయ‌క‌త్వం చ‌ర్చించి కొత్త ముఖ్య‌మంత్రిని ఖ‌రారు చేసే అవ‌కాశం ఉన్న‌ద‌ని ఆ పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం బీజేపీ అధిష్ఠానం త్వ‌ర‌లోనే కర్ణాట‌క‌కు ప‌రిశీల‌కుల‌ను పంప‌నున్నార‌ని తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)