Bengaluru, July 26: కొద్ది రోజులుగా సస్పెన్స్ రేపుతూ వస్తున్న కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు అంశంపై ఎట్టకేలకు తెరపడింది. బి.ఎస్.యడ్యూరప్ప (BS Yediyurappa To Resign As Karnataka CM) ముఖ్యమంత్రి పదవికి రాజీనామా (BS Yediyurappa announces his resignation) చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి ఆయన రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. నేను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.
కాగా మొన్నటి మీడియా సమావేశంలో పదవి ఉన్నా లేకున్నా మరో 10–15 ఏళ్ల పాటు బీజేపీ కోసం రాత్రింబవళ్లూ కష్టపడి పని చేస్తానని, ఈ విషయంలో సందేహాలు అవసరం లేదని వ్యాఖ్యానించారు. రెండు నెలల క్రితమే సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యానని గుర్తుచేశారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే నడుచుకుంటానని, పదవి నుంచి దిగిపోవాలని ఆదేశిస్తే దిగిపోతా, కొనసాగాలని సూచిస్తే కొనసాగుతా అని పునరుద్ఘాటించారు.
సోమవారం ఉదయం 11 గంటలకు జరిగే కార్యక్రమంలో రెండేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి మాట్లాడతానని, ఆ తరువాత జరిగే పరిణామాలు మీరే తెలుసుకుంటారని మీడియా ప్రతినిధులను ఉద్దేశించి అన్నారు. ఒకవేళ బీజేపీ నాయకత్వం నుంచి సందేశం రాకపోతే ఏం చేస్తారని ప్రశ్నించగా.. అప్పటి నిర్ణయం అప్పుడే తీసుకుంటానని బదులిచ్చారు.
Here's ANI Update
After announcing to step down, Karnataka CM BS Yediyurappa reaches Raj Bhavan in Bengaluru pic.twitter.com/5uU8qu7IBo
— ANI (@ANI) July 26, 2021
Here's BS Yediyurappa Tweet
Thank you @AmitShah ji and @JPNadda Ji, for your warm wishes and your trust in my leadership. Will definitely make this vision a reality by ensuring abled governance in the state of Karnataka, under the guidance of PM @narendramodi Ji.
— BS Yediyurappa (@Yediyurappa) July 26, 2019
కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఆదివారం ధార్వాడ్ నుంచి బెంగళూరుకు చేరుకోవడం, ఢిల్లీకి వెళ్లేందుకు బుక్ చేసుకున్న విమాన టికెట్‌ను రద్దు చేసుకోవడం గమనార్హం. అలాగే సీఎం పదవి రేసులో ఉన్న గనుల మంత్రి మురుగేష్ నిరానీ ఆదివారం ఢిల్లీకి వెళ్లారు. సీఎం రేసులో రాష్ట్ర హోంమంత్రి బస్వరాజ్ బొమ్మయ్, అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర హెగ్డేల పేర్లు కూడా ప్రముఖంగా వినపడుతున్నాయి.
పార్టీ గీసిన గీతను దాటే ప్రసక్తే లేదని, క్రమశిక్షణ మీరబోనని బి.ఎస్.యడ్యూరప్ప చెప్పారు. పార్టీ పెద్దలు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. ‘‘పార్టీలో నాకు ఎన్నో పెద్ద పదవులు దక్కాయి. కర్ణాటక బీజేపీలో ఈ స్థాయిలో పదవులు పొందినవారు ఎవరూ లేరు. నాకు అవకాశాలు కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డాకు కృతజ్ఞతలు’’అని యడియూరప్ప పేర్కొన్నారు. కర్ణాటకలో 2023లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని అన్నారు.
మరోవైపు బీజేపీ నాయకత్వం మిశ్రమ సంకేతాలను ఇచ్చింది. బి.ఎస్.యడ్యూరప్పపై జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా ప్రశంసల వర్షం కురిపించారు. ఆదివారం గోవాలోని పనాజీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. యడియూరప్ప ముఖ్యమంత్రిగా చక్కగా బాధ్యతలు నిర్వర్తించారని చెప్పారు. కర్ణాటక సర్కారు ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ముందుకు సాగుతోందన్నారు.
బి.ఎస్.యడ్యూరప్పకు సొంత సామాజికవర్గం వీరశైవ లింగాయత్‌ల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. యడ్డిని సీఎంగా కొనసాగించాల్సిందేనని 500 మందికిపైగా వీరశైవ–లింగాయత్ మఠాధిపతులు డిమాండ్ చేశారు. బాలెహోసూరు మఠాధిపతి దింగలేశ్వర స్వామి, తిప్తూరు మఠాధిపతి రుద్రముని స్వామి, చిత్రదుర్గ మఠాధిపతి బసవకుమార్ స్వామి పిలుపు మేరకు బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశానికి పెద్ద సంఖ్యలో వీరశైవ–లింగాయత్ మఠాధిపతులు హాజరయ్యారు. బి.ఎస్.యడ్యూరప్పను సీఎం పదవిలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు.