Fungal infection mucormycosis | Representational Image (Photo Credits: Pixabay)

New Delhi, July 26: దేశంలో నిన్న కొత్తగా 39,361 క‌రోనా కేసులు (New COVID-19 Cases) న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,14,11,262కు (COVID in India) చేరింది. అలాగే, నిన్న 35,968 మంది కోలుకున్నారు. మరణాల విషయానికొస్తే... నిన్న‌ 416 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,20,967కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,05,79,106 మంది కోలుకున్నారు. 4,11,189 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 43,51,96,001 వ్యాక్సిన్ డోసులు వేశారు.

క్రియాశీల రేటు 1.31 శాతానికి చేరగా.. రికవరీ రేటు 97.35 శాతంగా ఉంది. అయితే ఇటీవలి కాలంలో రికవరీల కంటే కొత్త కేసులే (Covid in India) ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు కేరళలో కొత్త కేసులు భారీగా వెలుగుచూశాయి. అక్కడ 17,466 మందికి వైరస్ సోకింది. మహారాష్ట్రలో 6,843 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నిన్న దేశవ్యాప్తంగా 18.99లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన టీకా డోసులు 43.51,96,001గా ఉన్నాయి.

ఏపీ కుర్రాడు సాయి ప్రణీత్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు, ఏపీ వెదర్ మ‌న్ పేరుతో రైతులకు సమాచారం అందిస్తూ మంచి పనిచేస్తున్నారని వెల్లడి, మ‌న్ కీ బాత్‌లో మాట్లాడిన ప్రధాని

కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 1.4 లక్షలు దాటింది. గత నెలన్నర రోజులుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ ‌కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. శనివారం నుంచి ఆదివారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 17,466 కరోనా కేసులు, 66 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 32,71,530కు, మొత్తం మరణాల సంఖ్య 16,035కు పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో 15,247 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ ‌అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 31,14,716కు చేరుకున్నదని, ప్రస్తుతం 1,40,276 యాక్టివ్ ‌కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశంలో కరోనా హాట్‌స్పాట్‌గా కేరళ కొనసాగుతున్నది.

ఘోర విషాదం..విరిగిపడిన కొండ చరియలు, తొమ్మిది మంది మృతి, నలుగురికి తీవ్ర గాయాలు, కూలిన బాట్సేరి వంతెన, హిమాచల్‌ప్రదేశ్‌ కిన్నౌర్‌ జిల్లా సంగాల్‌ లోయ వద్ద ప్రమాదం

డెల్టా వేరియంట్‌ కారణంగా బ్రిటన్‌లో విధించిన ఆంక్షలను ఇప్పుడిప్పుడే సడలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రిటన్‌లో మరో కొత్త రకం బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 16 మందిలో B.1.621 రకం వైరస్‌ను గుర్తించినట్లు బ్రిటన్ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కొత్త రకం వైరస్‌ గురించి విచారణ జరుపుతున్నామని ఒక ప్రకటనలో తెలిపారు. 16 కేసుల్లో పది కేసులను లండన్‌లోనే గుర్తించినట్లు వెల్లడించారు. అంతర్జాతీయ ప్రయాణాల వల్లనే ఈ కేసులు బ్రిటన్‌లోకి వచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ వైరస్ ప్రభావం, సామూహిక వ్యాప్తి గురించి స్పష్టమైన సమాచారంలేదని తెలిపారు. ‘‘వైరస్ వ్యాప్తి, ప్రవర్తనను తెలుసుకునేందుకు లేబొరేటరీలో పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇతరులకు వ్యాప్తి చెందకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో దీని ప్రభావం తక్కువగా ఉన్నట్లు గుర్తించాం’’ అని బిట్రన్ ఆరోగ్యశాఖ తెలిపింది.

మళ్లీ కేరళలో కరోనా ప్రమాద ఘంటికలు, పుట్టుకొస్తున్న కొత్త వెరియంట్లతో బూస్టర్‌ డోస్‌ తప్పదంటున్న ఎయిమ్స్‌ చీఫ్‌ రణ్‌దీప్‌ గులేరియా

బ్రిటన్‌లో కొత్త రకం వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ఈ వేరియంట్‌ను తొలిసారిగా జనవరిలో కొలంబియాలో గుర్తించినట్లు తెలిపింది. ఇప్పటి వరకూ అమెరికాలో - 592 కేసులు, పోర్చుగల్‌ - 56, జపాన్ - 47, స్విట్జర్లాండ్‌ - 41 కేసులు గుర్తించినట్లు వెల్లడించారు. గత కొద్ది వారాలుగా బ్రిటన్‌లో డెల్టా వేరియంట్‌ కారణంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. అయినా ఈ వారంలో లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడం ఆందోళన కలిగిస్తోంది. తాజా నివేదికల ప్రకారం బ్రిటన్‌లో ఆర్ రేటు 1.2 నుంచి 1.4 శాతంగా ఉంది. దీని ప్రకారం కరోనా సోకిన వ్యక్తి వైరస్‌ను ఒకరి కంటే ఎక్కువ మందికి వ్యాప్తి చేసే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో బ్రిటన్‌ ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్ జావిద్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘‘వైరస్‌ గురించి భయపడుతూ ఉండటంకంటే..దానితో కలిసి జీవించడం నేర్చుకోవాలి’’ అని జావిద్‌ ట్వీట్ చేశారు. దీంతో ఆయన ట్వీట్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే దీనిపై జావెద్ క్షమాపణలు చెప్పారు. ‘‘ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకుని వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడాలనేది నా ఉద్దేశం. ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. ఇందుకు నేను క్షమాపణలు చెబుతునున్నాను’’ అని జావిద్ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.