Bihar Politics: ఈ సారి బీహార్‌ రాజకీయాల్లో కలవరం, 4గురు ఎంఐఎం ఎమ్మెల్యేల చేరికతో అతి పెద్ద పార్టీగా ఆర్జేడీ, బీజేపీ ప్రభుత్వానికి పట్టుకున్న గుబులు, అధికార ఏర్పాటుపై తేజస్వీయాదవ్ గురి

మహారాష్ట్ర రాజకీయాల ఉత్కంఠకు తెరపడని తర్వాత ఇప్పుడు బీహార్ రాజకీయాలు హీటెక్కించబోతున్నాయి. తాజాగా ఏఐఎంఐఎంకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బుధవారం ఆర్జేడీలో (Tejashwi Yadav's RJD) చేరారు. దీంతో ఆర్జేడీ ఎమ్మెల్యే సంఖ్య తాజాగా 80కి పెరిగింది.

RJD leader Tejashwi Yadav at the joint press conference | (Photo Credits: ANI)

Patna, June 30: మహారాష్ట్ర రాజకీయాల ఉత్కంఠకు తెరపడని తర్వాత ఇప్పుడు బీహార్ రాజకీయాలు హీటెక్కించబోతున్నాయి. తాజాగా ఏఐఎంఐఎంకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బుధవారం ఆర్జేడీలో (Tejashwi Yadav's RJD) చేరారు. దీంతో ఆర్జేడీ ఎమ్మెల్యే సంఖ్య తాజాగా 80కి పెరిగింది. బీహార్‌లో అధికారంలో ఉన్న బీజేపీ కంటే ముగ్గురు ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు. దీంతో బీహార్‌లో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) ఆ రాష్ట్రంలో అతి పెద్ద పార్టీగా (Bihar's Biggest Party Now) అవతరించింది. దీంతో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ఆ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పవచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జేడీ(యూ) చీఫ్‌ నితీశ్‌ కుమార్‌ సీఎంగా ఆ పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీలో గుబులు పట్టుకుంది.

2020లో జరిగిన బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాలకుగాను ఆర్జేడీ 75 స్థానాల్లో గెలిచింది. అత్యధిక ఎమ్మెల్యేలున్న సింగిల్‌ పార్టీగా రాణించింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసే సంఖ్యా బలం ఆర్జేడీకి లేకపోవడంతో బీజేపీ చక్రం తప్పింది. 74 సీట్లు గెలిచిన బీజేపీ 43 స్థానాలు గెలిచిన జేడీ(యూ) చీఫ్‌ నితీశ్‌ కుమార్‌ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా నితీష్ కుమార్ పగ్గాలు చేపట్టారు. మరోవైపు ఆర్జేడీ కూటమితో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్‌ పార్టీ కేవలం 19 సీట్లు మాత్రమే గెలుచుకుంది.

కింగ్ మేకర్ అవుతాడనుకుంటే ఏకంగా సీఎం అయ్యాడు, మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ శంభాజీ షిండే ప్రమాణ స్వీకారం, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్

ఇక కొన్ని నెలల కిందట తొలగించిన మంత్రి ముఖేష్ సాహ్నికి చెందిన వికాశీల్ ఇన్సాన్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 77కు పెరిగింది. అయితే ఇటీవల జరిగి ఉప ఎన్నికల్లో ఆర్జేడీ మరో అసెంబ్లీ స్థానాన్ని కైవశం చేసుకుంది. తాజాగా ఏఐఎంఐఎంకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీలో (Tejashwi Yadav's RJD Adds 4) చేరారు. దీంతో ఆర్జేడీ ఎమ్మెల్యే సంఖ్య తాజాగా 80కి పెరిగింది.

వేయ్ చిందేయ్.. గోవాలో శివసేన రెబల్ ఎమ్మెల్యేల డ్యాన్స్ వీడియో వైరల్, సీఎంగా రెబల్ ఎమ్మెల్యే ఏకనాథ్ షిండే నేడు ప్రమాణ స్వీకారం

మరోవైపు ప్రస్తుతం 45 మంది ఎమ్మెల్యేలున్న జేడీ(యూ)- బీజేపీ సర్కార్‌లో విభేదాలు బయటపడుతున్నాయి. ఈ తరుణంలో బీహార్‌లో అతి పెద్ద పార్టీగా రాణించిన ఆర్జేడీ, ప్రభుత్వం ఏర్పాటుపై దృష్టి పెట్టినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ‘అన్ని లౌకిక శక్తులు ఏకతాటిపైకి వచ్చి బలపడాలని మేం కోరుకుంటున్నాం’ అని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ తాజాగా పిలుపునిచ్చారు. మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడతామన్న ఆయన వ్యాఖ్యలతో బీహార్‌లోని అధికార బీజేపీలో గుబులు పట్టుకుంది.

బీహార్ రాజకీయ ముఖ చిత్రం ఇప్పుడు

మొత్తం సీట్లు 243

అధికార ఏర్పాటుకు 122

RJD : 80

BJP : 77

Congress : 19

Others : 23

ఆర్జేడీ కాంగ్రెస్ కలిస్తే 99. అధికార ఏర్పాటుకు 23 సీట్లు అవసరం అవుతాయి. మరి RJD ఎలా చక్రం తిప్పుతుందో వేచి చూడాలి

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now