IPL Auction 2025 Live

Manipur Govt Trouble: బీజేపీకి తొలిసారి ఎదురుదెబ్బ, సంక్షోభంలో మణిపూర్ సర్కార్, ప్రతిపక్ష కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు

ఈశాన్య భారతంలో సంకీర్ణ ప్రభుత్వంతో పాగా వేసిన బీజేపీ సర్కారు (BJP-led govt in Manipur) ఇప్పుడు పతన అంచుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఈశాన్య భారతంలోని మ‌ణిపూర్‌లో బీజేపీ (BJP)నేతృత్వంలోని సంకీర్ణ‌ స‌ర్కారు ఇప్పుడు సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఇతర రాష్ట్రాల్లో ఏ మాత్రం అవ‌కాశం ఉన్నా ప్రభుత్వాలను ప‌డ‌దోసి అధికారంలోకి వ‌స్తున్న భారతీయ జ‌నతాపార్టీకి‌ మణిపూర్‌లో ఎదురుదెబ్బ తగిలింది.

BJP-led govt in Manipur (Photo-ANI)

Imphal, June 18: దేశంలో బీజేపీకి తొలిసారిగా ఎదురుదెబ్బ తగిలింది. ఈశాన్య భారతంలో సంకీర్ణ ప్రభుత్వంతో పాగా వేసిన బీజేపీ సర్కారు (BJP-led govt in Manipur) ఇప్పుడు పతన అంచుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఈశాన్య భారతంలోని మ‌ణిపూర్‌లో బీజేపీ (BJP)నేతృత్వంలోని సంకీర్ణ‌ స‌ర్కారు ఇప్పుడు సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఇతర రాష్ట్రాల్లో ఏ మాత్రం అవ‌కాశం ఉన్నా ప్రభుత్వాలను ప‌డ‌దోసి అధికారంలోకి వ‌స్తున్న భారతీయ జ‌నతాపార్టీకి‌ మణిపూర్‌లో ఎదురుదెబ్బ తగిలింది. దేశంలో వేగంగా విస్తరిస్తోన్న కరోనా, గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 12,881 కొత్త కేసులు, నాలుగు లక్షలకు చేరువలో కోవిడ్-19 కేసులు

అక్కడ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతిస్తున్న నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ) బీజేపీ ప్రభుత్వానికి త‌న‌ మద్దతు ఉపసంహరించుకుంటున్న‌ట్లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ (Chief Minister N. Biren Singh) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో (Manipur Government) తమ పార్టీకి చెందిన నలుగురు మంత్రుల చేత ఎన్‌పీపీ రాజీనామా చేయించింది. వీరిలో డిప్యూటీ సీఎం జోయ్‌కుమార్‌ సింగ్‌ కూడా ఉన్నారు. మరోవైపు బీజేపీ సర్కార్‌కు మద్దతిస్తున్న మరో నలుగురు ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేలు కూడా ప్ర‌భుత్వానికి గుడ్‌బై చెప్పారు.

అధికార బీజేపీ నుంచి కూడా ముగ్గురు ఎమ్మెల్యేలే త‌మ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మ‌ణిపూర్‌లో బీరేన్‌ ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఇక ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేంతా ప్రతిపక్ష కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించడం అక్కడ ఊహించని పరిణామం. ఈ క్రమంలోనే అసెంబ్లీలో బలనిరూపణ చేపట్టాలని కోరుతూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ పక్షనేత ఇబోబీ సింగ్‌ గవర్నర్‌తో భేటీకి సిద్ద‌మ‌య్యారు.

దేశంలో రాజ్యసభ ఎన్నికల సమీపిస్తున్నతరుణంలొ ఇది బీజేపీకిఊహించని ఈ పరిణామం. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 60 స్థానాలకుగాను 28 సీట్లలో కాంగ్రెస్‌ విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే కేవలం 21 స్థానాలు గెలిచిన బీజేపీ ఇతరులను తమవైపుకు తిప్పుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు సీన్ రివ‌ర్స్ కావ‌డంతో ఇతరుల మద్దతుతో కాంగ్రెస్‌ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం ఉంది.