Coronavirus Outbreak in AP | PTI Photo

New Delhi, June 18: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు (2020 Coronavirus Pandemic in India) మరింత వేగంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 12,881 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కొత్త కేసులతో (Coronavirus Cases in India) కలిపి ఇప్పటి వరకు నమోదైన కొవిడ్-19 కేసుల సంఖ్య 3,66,946కి చేరినట్టు తెలిపింది. ప్రస్తుతం 1,60,384 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. ఇప్పటి వరకు 1,94,325 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు గత 24 గంటల్లో మరో 334 మంది కరోనా (Coronavirus Pandemic) మహమ్మారికి బలయ్యారు. దీంతో మృతుల సంఖ్య 12,237కు పెరిగింది. ఇకపై లాక్‌డౌన్‌ ఉండదు, స్పష్టం చేసిన ప్రధాని మోదీ, అన్‌లాక్‌-2 ఎలా అమలు చేయాలన్న దానిపై చర్చించాలని సీఎంలకు ప్రధాని సూచన

కాగా, బుధవారం ఒక్కరోజే 2003మంది మృత్యువాత పడ్డారు. మహారాష్ట్ర, ఢిల్లీలో ఇటీవలే సంభవించిన కొన్ని మరణాలకు కరోనా వైరస్‌ కారణమని తేలడంతో వాటిని కూడా ఈ జాబితాలో చేర్చారు. దేశ వ్యాప్తంగా జూన్‌ 17వ తారీఖు వరకు మొత్తం 62.4 లక్షల శాంపిల్స్‌ను‌ టెస్ట్‌ చేసినట్లు ఐసీఎమ్‌ఆర్‌ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 1,65,412 శాంపిల్స్‌ టెస్ట్‌ చేసినట్లు వెల్లడించింది.

తమిళనాడులో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో అక్కడ 2,174 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 50,193కి చేరింది. బుధవారం ఒక్కరోజే అక్కడ 48 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 576కి చేరింది. తాజాగా కేసుల్లో ఒక్క చెన్నైలోనే 1276 నమోదయ్యాయి. కోవిడ్‌ బారినపడి ఇప్పటికే డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందిలో ఒకరు కరోనాతో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. సీఎం పళనిస్వామి వద్ద పీఏగా పనిచేస్తున్న దామోదరన్‌ రెండు రోజుల క్రితం కరోనా లక్షణాలతో చెన్నైలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆయన బుధవారం మృతి చెందారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.