No Fresh Lockdowns: ఇకపై లాక్‌డౌన్‌ ఉండదు, స్పష్టం చేసిన ప్రధాని మోదీ, అన్‌లాక్‌-2 ఎలా అమలు చేయాలన్న దానిపై చర్చించాలని సీఎంలకు ప్రధాని సూచన
Coronavirus lockdown India goes into lockdown as coronavirus spreads till now 8 states and 80 districts lockdown (photo-PTI)

New Delhi, June 18: కోవిడ్-19పై జరుగుతున్న పోరాటంలో సమిష్టి కృషి, నిబద్ధతతోనే విజయం వరిస్తుందని ప్రధాని నరేంద్ర∙మోదీ (Prime Minister Narendra Modi) పేర్కొన్నారు. కరోనావైరస్‌కు వ్యతిరేకంగా పోరాడుతూనే తగిన జాగ్రత్తలతో ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కరోనా నివారణ చర్యలపై సమీక్షలో భాగంగా ఆయన బుధవారం 14 రాష్ట్రాల సీఎంలు (chief ministers), కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, జమ్మూకశ్మీర్‌ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. శాంతిని కోరుకుంటున్నాం, సరైన సమయంలో ప్రతి దాడి తప్పదు, చైనాకు ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరిక, అమర వీరులకు నివాళి అర్పించిన ప్రధాని

కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిలతో తన వీడియో కాన్ఫరెన్స్‌లో దేశంలో తాజా లాక్‌డౌన్ (No Fresh Lockdowns) విధించబోమని ప్రధాని అన్నారని గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ అన్నారు. అంతకుముందు బుధవారం ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన తర్వాత పటేల్ (Gujarat deputy chief minister Nitin Patel) విలేకరులతో మాట్లాడారు. "పెరుగుతున్న (కరోనావైరస్) కేసులతో తాజా లాక్డౌన్ విధించబడుతుందని పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయని వాటిని నమ్మవద్దని ప్రధాని స్పష్టంగా చెప్పారు. అలాంటి చర్య ఏదీ ప్రణాళిక చేయబడలేదు మరియు తాజా లాక్డౌన్లు ఉండవు" అని మోడి చెప్పారని పటేల్ గుర్తు చేశారు.

మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారన్న వదంతులను ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తోసిపుచ్చారు. దేశంలో మరోమారు లాక్‌డౌన్‌ ఉండబోదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అన్‌లాక్‌-2 ఎలా అమలు చేయాలన్నదానిపై చర్చించాలని ముఖ్యమంత్రులకు సూచించారు. ఇండియా ఇప్పుడు అన్‌లాకింగ్‌(అన్‌లాక్‌ 1.0) దశలో ఉందని గుర్తుచేశారు.లాక్‌డౌన్‌ నిబంధనల్లో సడలింపుల వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయన్నారు. ద్రవ్యోల్బణం కూడా నియంత్రణలోనే ఉందని తెలిపారు. మృతదేహాలకు కోవిడ్-19 పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వానికి ఊరట, హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీంకోర్టు, ప్రతివాదులకు నోటీసులు జారీ

ఇప్పుడు మనం అన్‌లాక్‌ 2.0 గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. అన్‌లాక్‌ 1.0 తదనంతర పరిస్థితులు, కోవిడ్‌–19 మహమ్మారి కట్టడి ప్రణాళికపై చర్చించేందుకు ప్రధాని మోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చర్చించారు. మౌలిక సదుపాయాల కల్పన, నిర్మాణ సంబంధిత పనుల్లో వేగం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

కరోనా వైరస్‌ నివారణలో సమాచారం అత్యంత కీలక అంశమని, కొవిడ్‌ హెల్ప్‌లైన్‌ నంబర్లు ‘హెల్ప్‌ లెస్‌' నంబర్లుగా మారకూడదని ప్రధాని చెప్పారు. సీనియర్‌ డాక్టర్లు యువ వలంటీర్లతో బృందాలను ఏర్పాటు చేసి టెలిమెడిసన్‌ ద్వారా రోగులకు సూచనలు ఇవ్వాలన్నారు. ప్రజల్లో కొవిడ్‌పై అవగాహన పెంచి వారిలో భయాందోళనలను దూరం చేయాలని సూచించారు. కరోనా వైరస్‌ సోకిన బాధితులు చాలామంది చికిత్సతో పూర్తిగా కోలుకుంటున్నారని, వారి సంఖ్యను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎంలకు మోదీ సూచించారు.

తద్వారా కరోనా వల్ల నెలకొన్న భయాందోళనల నుంచి ప్రజలను బయటకు తీసుకురావాలని చెప్పారు. పోరాటంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని వెల్లడించారు. తమ రాష్ట్రాల్లో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రులు ఈ సందర్భంగా మోదీకి వివరించారు. కొన్ని చోట్ల కేసులు బాగా పెరుగుతున్నప్పటికి ప్రజల సంయమనం, అధికారుల ముందుచూపు వల్ల కరోనా నియంత్రణలోనే ఉన్నదని తెలిపారు. ఆరోగ్య సేతు యాప్‌ను పెద్ద సంఖ్యలో డౌన్‌లోడ్‌ చేసిన రాష్ట్రాల్లో సానుకూల ఫలితాలు వస్తున్నాయని మోదీ గుర్తుచేశారు.

కరోనా బారినపడి కోలుకుంటున్నవారి సంఖ్య భారీగా పెరుగుతుండడం మంచి పరిణామమన్నారు. కొందరు బాధితులకే ఐసీయూ సేవలు అవసరమవుతున్నాయని చెప్పారు. 900కుపైగా కరోనాటెస్టింగ్‌ ల్యాబ్‌లు, లక్షలాది ప్రత్యేక పడకలు, వేల సంఖ్యలో ఐసోలేషన్, క్వారంటైన్‌ సెంటర్లు, సరిపడా టెస్టింగ్‌ కిట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. కోటికిపైగా పీపీఈ కిట్లు, అంతే సంఖ్యలో ఎన్‌095 మాస్కులు ఇప్పటికే రాష్ట్రాలకు పంపిణీ చేశామని తెలిపారు. ఇదిలా ఉంటే వైద్యులకు పూర్తి వేతనాలు చెల్లించేలా రాష్ట్రాలకు ఆదేశాలివ్వాలని కేంద్రానికి సుంప్రీకోర్టు ఆదేశించింది.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తేదీన మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగాన్ని లద్దాఖ్‌లోని లేహ్‌ నుంచి చేయాలని మొదట నిర్ణయించారు. కానీ, కోవిడ్‌ నేపథ్యంలో ఢిల్లీ నుంచే ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 21వ తేదీన ఉదయం 7 గంటలకు మోదీ ప్రసంగం ప్రారంభమవుతుంది. లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద చైనాతో నెలకొన్న ఉద్రిక్తతలు, ఇండియా ప్రతిస్పందనను కూడా మోదీ ప్రస్తావించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జూన్‌ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా 2014 డిసెంబర్‌ 11న ఐరాస ప్రకటించిన సంగతి తెలిసిందే.