Assembly Elections 2021: అయిదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు, కేంద్ర ఎన్నికల సంఘం నేడు కీలక సమావేశం, అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం, పశ్చిమ బెంగాల్ ఎన్నికల మీదనే అందరి కన్ను
ఐదు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ (Assembly Elections 2021) బుధవారం విడుదల కానుంది. నాలుగు రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా రాబోతోంది. అసోం, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు (Assembly Elections of 5 States) జరగనున్నాయి. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.
New Delhi, Feb 24: దేశంలో మరో ఎన్నికలకు వెళయింది. ఐదు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ (Assembly Elections 2021) బుధవారం విడుదల కానుంది. నాలుగు రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా రాబోతోంది. అసోం, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు (Assembly Elections of 5 States) జరగనున్నాయి. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.
ఇటీవల సీఈసీ సభ్యులు ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు వెళ్లి అక్కడి అధికారులతో ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో ఐదు అసెంబ్లీ నగరా కూడా మోగనుంది. ఒకవేళ ఎన్నికల షెడ్యూల్ మార్చిలో విడుదల అయితే ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం కీలక సమావేశం నిర్వహించనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా (Election Commissioner Sunil Arora) అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో బలగాల మోహరింపు, ఏర్పాట్లపై చర్చించనున్నారు.
కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో బెంగాల్‌లో ఏడు నుంచి ఎనిమిది దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అలాగే కేంద్రపాలిత ప్రాంతం పాండిచ్చేరిలో ఎన్నికల నిర్వహణపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటీవల అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వరుసగా పదవులకు రాజీనామా చేశారు. దీంతో నారాయణస్వామి నేతృత్వంలోని ప్రభుత్వం మైనారిటీలో పడగా.. రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నాలుగు రాష్ట్రాలతో పాటు ఈ కేంద్ర పాలిత ప్రాంతానికి సైతం ఎన్నికలు నిర్వహించే యోచనలో ఈసీ ఉన్నట్లు సమాచారం.
2016లో ఏప్రిల్ 4 నుంచి మే 5 వరకు ఆరు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల కమిషన్ గణాంకాల ప్రకారం, బెంగాల్‌లో సుమారు 6,400 పోలింగ్ బూత్‌లను సున్నితమైనవిగా గుర్తించారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఇవే అత్యధికం. బెంగాల్‌లో పోలింగ్ కేంద్రాల సంఖ్యను 78,903 నుంచి 1,01,790కు పెంచారు. ఫిబ్రవరి 25 నాటికి ఎన్నికల ప్రచారంలో శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకొని 125 కంపెనీలు రాష్ట్రానికి తరలించనున్నారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్)కు చెందిన 60 కంపెనీలు, శాస్త్రా సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ)కు 30 కంపెనీలు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) 25 కంపెనీలు మోహరించనున్నట్లు ఈసీ వర్గాలు తెలిపాయి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) బలగాలను సైతం మోహరించనున్నారు.
ఇదిలా ఉంటే బెంగాల్‌లో శాంతిభద్రత పరిస్థితులపై ఈసీ నిఘా పెట్టింది. సమావేశానికి సవివరమైన నివేదికలతో రావాలని అధికారులను ఆదేశించింది. డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ (పశ్చిమ బెంగాల్ ఇన్‌చార్జి) సుదీప్ జైన్ బెంగాల్ ఈసీ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.బెంగాల్ ఎన్నికలకు ముందు, అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ.. ఆరోపణలు చేసుకుంటున్నారు. డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ సుదీప్ జైన్ గురువారం బెంగాల్‌లో పర్యటించనున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని ఈసీ వర్గాలు తెలిపాయి. గత ఆరు నెలలుగా రాష్ట్రంలో పర్యటిస్తున్న సుదీప్ జైన్.. మరోసారి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల అధికారులు ఈసీకి నివేదిక అందించనున్నారు.
సోమవారం, అస్సాంలోని ధేమాజీ జిల్లాలోని సిలాపాథర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ, “చివరిసారిగా 2016 లో అసెంబ్లీ ఎన్నికల తేదీలను మార్చి 4 న ప్రకటించారు. ఈ సంవత్సరం, ఈసీ అదే తేదిని ప్రకటిస్తుందని అనుకుంటున్నాను. మార్చి 7 లోగా అసెంబ్లీ ఎన్నికలకు తేదీలు ప్రకటించడం వారి చేతుల్లోనే ఉంది. అయితే ప్రకటన వచ్చేవరకు నేను అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళలను నేను వీలైనంతవరకు సందర్శిస్తానని తెలిపారు.
రాబోయే ఎన్నికల సమయంలో కరోనావైరస్ మహమ్మారి మధ్య అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి గత ఏడాది తీసుకున్న బీహార్ నమూనాను ఇసిఐ అనుసరిస్తుంది తెలుస్తోంది. పోలింగ్‌తో సంబంధం ఉన్న అధికారులకు ఇసిఐ ఇప్పటికే టీకాలు వేయడం ప్రారంభించింది మరియు ఎన్నికలు ప్రారంభమయ్యే ముందు మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది. ఎన్నికల అభ్యర్థులు ప్రోటోకాల్‌లను కూడా అనుసరించాల్సి ఉంటుంది, అయితే పోలింగ్ బూత్‌లలోని అధికారులు మాస్కులు, ముఖ కవచాలు మరియు చేతి తొడుగులు ధరిస్తారు మరియు ప్రాంగణంలో శానిటైజర్‌ను ఉపయోగిస్తారు.
పోలింగ్ స్టేషన్లలోకి ఒకసారి, ఓటర్లు వారి శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేస్తారు. 100.4 డిగ్రీల ఫారెన్‌హీట్ యొక్క పరిమితికి మించి ఉష్ణోగ్రత ఉన్నట్లు వ్యక్తి గుర్తించినట్లయితే ఓటరు యొక్క శరీర ఉష్ణోగ్రత రెండవ సారి తనిఖీ చేయబడుతుంది. వ్యక్తి యొక్క శరీర ఉష్ణోగ్రత రెండవ సారి కూడా ఎక్కువగా కనబడితే, ఓటరు రోజు చివరి గంటలో (సాయంత్రం 5 గం. 6 గం) ఓటు వేయడానికి తిరిగి రావాలని కోరతారు. అనుమానాస్పద కోవిడ్ -19 రోగులు ఇతరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాతే ఓటు వేయడానికి అనుమతించబడతారు. ఓటర్లకు ఒక వైపు పునర్వినియోగపరచలేని చేతి తొడుగులు అందించబడతాయి, అవి సంతకం చేయడానికి మరియు EVM యొక్క బటన్‌ను నొక్కడానికి ఉపయోగిస్తాయి.