Ahmedabad, February 23: ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాగా వేశారు. ఆదివారం జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో (Gujarat Civic Polls) బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా ఆప్ (AAP) నిలిచింది. ఈ ఎన్నికల్లో సూరత్ కార్పొరేషన్‌లో రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీని వెనక్కి నెట్టేసింది. దీంతో ఆప్‌కు పంజాబ్, గోవా తర్వాత గుజరాత్‌లో బలపడే అవకాశం లభించింది. సూరత్ కార్పొరేషన్‌లో మొత్తం వార్డులు 120 ఉండగా బీజేపీ 93 గెలవగా ఆమ్ ఆద్మీ పార్టీ 27 స్థానాలు సొంతం చేసుకుంది. ఈ కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌కు ఒక్కటి కూడా రాలేదు.
ఈ ఫలితాలపై ఆమ్‌ఆద్మీ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఢిల్లీ పాలనను గుజరాత్‌కు అవసరమని పేర్కొంది. గుజరాత్ ప్రజలకు కేజ్రీవాల్ మంగళవారం ఓ ట్వీట్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో నూతన రాజకీయాల శకానికి నాంది పలికారని అభినందించారు. సూరత్ కార్పొరేషన్ ఫలితాలతో (Gujarat municipal corporations) ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 26వ తేదీన సూరత్‌లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ప్రజలకు ధన్యవాదాలు చెప్పేందుకు ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ నెల 26న గుజరాత్‌లో పర్యటించబోతున్నారు.
Here's AAP Gujarat Tweet
આમ આદમી પાર્ટી સુરત શહેરના જંગી લીડ સાથે જીતેલા ઉમેદવારોનું સુરત મુખ્ય કાર્યાલય ખાતે અભિવાદન સમારોહ.
સુરતની જનતાનો ખૂબ ખૂબ આભાર.#GujaratElections pic.twitter.com/4n6ku1dLpN
— AAP Gujarat (@AAPGujarat) February 23, 2021
అయితే ఆరు కార్పొరేషన్‌లలో ఒక్క సూరత్ తప్పా మిగతా చోట ఆప్ బోణీ చేయకపోవడం గమనార్హం. మిగతా కార్పొరేషన్‌లలో బీజేపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. ఆ తర్వాత కాంగ్రెస్ నిలిచింది. అవి కూడా చాలా తక్కువ సీట్లే. అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్, భావ్‌నగర్, జామ్‌నగర్ కార్పొరేషన్‌లో 547 స్థానాల్లో 576 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో బీజేపీ 484స్థానాలు సొంతం చేసుకోగా, కాంగ్రెస్ 54, ఆమ్‌ఆద్మీ పార్టీ 27, ఇతరులు 8 స్థానాలు సొంతం చేసుకున్నారు.ఆదివారం జరిగిన ఎన్నికల్లో 46 శాతం ఓటింగ్ పోలైంది. అహ్మాదాబాద్, సూరత్, రాజ్‌కోట్, వడోదర, భావనగర్, జామ్‌నగర్ పట్టణాల్లో ఉన్న 144 వార్డులకు పోలింగ్ జరిగింది.
మహారాష్ట్ర, బిహార్.. ఇలా మెల్లగా దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో అడుగు పెడుతున్న ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీ తాజాగా గుజరాత్‌లోనూ అడుగు పెట్టింది. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నాలుగు స్థానాలు కైవలం చేసుకుని గుజరాత్ ప్రవేశాన్ని ఖాయం చేసుకుంది. అహ్మాదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాలుగు స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులు గెలిచారు. నగరంలోని జమల్‌పూర్ ఏరియాలో ఉన్న ఈ నాలుగు స్థానాలను ఎంఐఎం గెలుచుకోవడం ద్వారా.. గుజరాత్‌లో మొట్టమొదటి సారి ఎంఐఎం జెండాను ఎగురవేయగలిగింది.