ED Raids in BRS MLA Residence: పటాన్‌ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు.. నిజాంపేటలోని ఆయన బంధువుల ఇండ్లల్లో కూడా.. ఎందుకంటే?

అధికారాన్ని కోల్పోయిన తర్వాత కేసులతో, ఈడీ, ఐటీ అధికారుల దాడులతో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ED Raids in BRS MLA Mahipal Reddy Residence

Hyderabad, June 20: అధికారాన్ని కోల్పోయిన తర్వాత కేసులతో, ఈడీ (ED), ఐటీ (IT) అధికారుల దాడులతో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొన్నటికి మొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చిన అధికారులు నోటీసులు జారీ చేయగా.. తాజాగా పటాన్‌ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి ఇంటిపై ఎన్  ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ED Raids) దాడులు నిర్వహిస్తున్నది. గురువారం ఉదయం 5 గంటల నుంచి పటాన్‌ చెరులోని ఆయన నివాసంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన సోదరుడు మధుసూదన్‌ రెడ్డి ఇంట్లోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పటాన్‌ చెరులోని మూడు ప్రాంతాలతోపాటు నిజాంపేటలోని ఎమ్మెల్యే బంధువుల నివాసాల్లో కూడా సోదాలు కొనసాగుతున్నట్టు సమాచారం.

డిప్యూటీ సీఎంగా తొలిరోజే తన మార్క్ చూయించిన పవన్ కళ్యాన్.. దాదాపు 10 గంటల పాటు సుదీర్ఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన జనసేనాని.. అధికారులకు 3 మాసాల టార్గెట్ ఫిక్స్!

సోదాలు ఇందుకే..

లక్డారం గనుల వ్యవహారంలో ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్‌ రెడ్డిపై గతంలో పటాన్‌ చెరు పోలీస్‌ స్టేషన్‌ లో కేసు నమోదయింది. అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో ఈ కేసు ముందుకు సాగలేదు. తాజాగా ప్రభుత్వం మారడంతో కేసులో కదలిక వచ్చింది. ఈ క్రమంలోనే ఈడీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో భారీగా ఐఏఎస్ ల బ‌దిలీలు, అంతా అనుకున్న‌ట్లుగానే శ్రీ‌ల‌క్ష్మికి షాక్, గ‌త ప్ర‌భుత్వంలో కీల‌కంగా ఉన్న చాలా మందికి స్థాన‌చ‌లనం



సంబంధిత వార్తలు