IPL Auction 2025 Live

Arvind Kejriwal vs LG: నేను ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని..మరి నీవెవరు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాపై మండిపడిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీకి చెందిన కొందరు టీచర్లను ఫిన్లాండ్ టూర్ కిపంపించాలనే ఢిల్లీ ప్రభుత్వ (AAP Govt) నిర్ణయాన్ని సక్సేనా అడ్డుకోవడంపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో సీఎం (Delhi CM Kejriwal) మాట్లాడుతూ..తమ నిర్ణయాన్ని అడ్డుకోవడానికి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరని ప్రశ్నించారు.

Delhi CM arvind Kejriwal (Photo-ANI)

New Delhi, Jan 17: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఢిల్లీకి చెందిన కొందరు టీచర్లను ఫిన్లాండ్ టూర్ కిపంపించాలనే ఢిల్లీ ప్రభుత్వ (AAP Govt) నిర్ణయాన్ని సక్సేనా అడ్డుకోవడంపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో సీఎం (Delhi CM Kejriwal) మాట్లాడుతూ..తమ నిర్ణయాన్ని అడ్డుకోవడానికి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరని ప్రశ్నించారు. మన నెత్తిమీద కూర్చున్న ఈ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరని (who is LG) కేజ్రీ మండిపడ్డారు.

మన పిల్లలు ఏం చదవాలి, ఎలా చదవాలి? అని చెప్పడానికి మీరెవరు.. మన పిల్లలు చదువుకోకూడదనేది మీ ఆలోచన అని విమర్శించారు. తమను, తమ నిర్ణయాలను ఆపే అధికారం ఎల్జీకి లేదని అన్నారు. జీవితంలో ఏదీ కూడా శాశ్వతం కాదని, రేపొద్దున కేంద్రంలో తాము ఉండొచ్చని చెప్పారు. అప్పుడు ఇదే లెఫ్టినెంట్ గవర్నర్ తమతో ఉండొచ్చేమోనని అన్నారు.

భారత్‌తో యుద్దాలు చేసి చాలా నష్టపోయాం, పాక్ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ సంచలన వ్యాఖ్యలు, శాంతి కోసం ప్ర‌ధాని మోదీతో చ‌ర్చ‌లకు సిద్ధంగా ఉన్నామ‌ని వెల్లడి

తన హోం వర్క్ ని తమ టీచర్లు ఎప్పుడూ చెక్ చేయలేదని... కానీ ఈ లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రం తన హోంవర్క్ లోని స్పెల్లింగులు, హ్యాండ్ రైటింగ్ అన్నీ చెక్ చేయడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఈయన (Lieutenant Governor V K Saxena) తనకు హెడ్ మాస్టర్ కాదని ఎద్దేవా చేశారు. తనను ప్రజలు ఎన్నుకున్నారని, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి (People elected me as CM) తానని కేజ్రీవాల్ చెప్పారు. మీరు ఎవరని ఎల్జీని ప్రశ్నించారు.

అండర్‌వరల్డ్ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం మళ్లీ పెళ్ళి చేసుకున్నాడు, విడాకుల వార్తలు అబద్దం, NIAకు దర్యాప్తులో సంచలన నిజాలు వెల్లడించిన దావూద్ మేనల్లుడు అలీషా పార్కర్

తనను రాష్ట్రపతి ఎన్నుకున్నారని లెఫ్టినెంట్ గవర్నర్ చెపుతున్నారని.. బ్రిటిష్ కాలంలో వైస్రాయ్ ని ఎన్నుకున్నట్టా? అని ఎద్దేవా చేశారు. ఎల్జీకి పాలించడం చేతకాదని విమర్శించారు. బ్లడీ ఇండియన్స్ మీకు పాలించడం చేతకాదని బ్రిటిష్ వైస్రాయ్ లు అనేవారని . . ఇప్పుడు బ్లడీ ఢిల్లీ వాలాస్ మీకు పాలించడం చేతకాదని ఎల్జీ అంటున్నాడని సీఎం కేజ్రీవాల్ దుయ్యబట్టారు. ఢిల్లీ పోలీస్, ల్యాండ్, పబ్లిక్ ఆర్డర్ లపై ఎల్జీకి ఎలాంటి అధికారం లేదని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందని చెప్పారు.

ప్రభుత్వ కార్యకలాపాలకు ఎల్జీ పడుతున్నాడని మొదటిరోజైన సోమవారం కేజ్రివాల్‌ పేర్కొనగానే అసెంబ్లీలో బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. సభలో గందరగోళం చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం కూడా కేజ్రివాల్‌ తాను చెప్పదలుచుకున్నది గట్టిగానే చెప్పారు. ఎల్జీ సక్సేనాను బ్రిటిష్‌ వైస్రాయ్‌తో పోల్చారు. బ్రిటిష్‌ పాలకుల నియంతృత్వానికి వ్యతిరేకంగానే ఆనాడు దేశ ప్రజలు స్వాతంత్య్రం కోసం పోరాడాల్సి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.

ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల టీచర్‌లను శిక్షణ కోసం ఫిన్‌లాండ్‌కు పంపించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని, కానీ ఎల్జీ అందుకు అడ్డుపడుతున్నారని విమర్శించారు.ఢిల్లీలో రెండు కోట్ల జనాభా ఉన్నదని, వారిలో లక్షల మంది చిన్నారులు ఉన్నారని, వాళ్లంతా నా కొడుకు, బిడ్డలాంటి వాళ్లేనని, వాళ్లందరికీ మంచి విద్యను అందించాలన్నదే (good education for poor children) తమ ప్రభుత్వ లక్ష్యమని, అందుకు ఎల్జీ అడ్డుపడాల్సిన అవసరం ఏమున్నదని కేజ్రివాల్‌ ప్రశ్నించారు. టీచర్లకు ఫిన్‌లాండ్‌లో శిక్షణకు సంబంధించిన ఫైల్‌ను ఎల్జీ దగ్గరకు పంపిస్తే ఆయన తిరస్కరించారని సభకు చెప్పారు.