Gurdwara Attack: పాక్‌లో గురుద్వారాపై దాడి, ఇది భారత్ కుట్రే అంటున్న దాయాది దేశం, తీవ్రంగా ఖండించిన భారత్, పాక్ ఎంబసీ ఎదుట సిక్కుల ధర్నా, దాడికి వ్యతిరేకంగా ఏకమైన అన్ని రాజకీయ పార్టీలు, అక్కడ అసలేం జరిగింది ?
ఈ దాడిని అన్ని రాజకీయ పార్టీలు ఏకమై ఖండించాయి. ఇది పిరికిపందల సిగ్గుమాలిన చర్య అంటూ శనివారం ఢిల్లీలో వందలాది మంది ర్యాలీ (Protests) చేపట్టారు. సిక్కులకు, సిక్కుల ప్రార్థనా స్థలాలకు పాక్ ప్రభుత్వం తగు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
New Delhi, January 5: పాకిస్తాన్‌లోని (Pakistan)చారిత్రక నాన్‌కానా సాహిబ్ గురుద్వారాపై (attack on Nankana Sahib Gurdwara) జరిగిన రాళ్ల దాడి దేశంలో ప్రకంపనలే రేపుతోంది. ఈ దాడిని అన్ని రాజకీయ పార్టీలు ఏకమై ఖండించాయి. ఇది పిరికిపందల సిగ్గుమాలిన చర్య అంటూ శనివారం ఢిల్లీలో వందలాది మంది ర్యాలీ (Protests) చేపట్టారు. సిక్కులకు, సిక్కుల ప్రార్థనా స్థలాలకు పాక్ ప్రభుత్వం తగు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
ర్యాలీలో పాల్గొన్న బీజేపీ,(BJP)కాంగ్రెస్,(Congress) అకాలీదళ్ కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు. పాక్ రాయబార కార్యాలయం(High Commission of Pakistan) వైపు దూసుకు వచ్చేందుకు ప్రయత్నించగా చాణక్యపురి పోలీస్‌స్టేషన్ వద్దే వారిని పోలీసులు నిలువరించారు.
Here's the tweet:
భారత స్పందనకు వ్యతిరేకంగా పాకిస్తాన్
ఇదిలా ఉంటే ఈ దాడిపై భారత స్పందనకు వ్యతిరేకంగా పాకిస్తాన్ స్పందించింది. తీవ్రమైన, ముఖ్యమైన అంశాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇది భారత ప్రభుత్వం చేపట్టిన చర్యగా పాకిస్తాన్ ఈ ఘటనను అభివర్ణించింది. ఇది రెండు కుటుంబాల వ్యక్తిగత వివాదమని, కేవలం గంటల్లోనే అది సద్దుమణిగిందని... దీనికి మత రంగు పులిమేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పాకిస్తాన్ చెబుతోంది. భారత ప్రభుత్వం, భారత మీడియా తమ దేశ ప్రజల దృష్టిని సీఏఏ నిరసనల వైపు నుంచి, కశ్మీర్ అంశం నుంచి మరల్చేందుకు ఈ అంశాన్ని ఉపయోగించుకుంటున్నారని దాయాది దేశం వాదిస్తోంది.
Here's the video of mob attacking Gurdwara:
వివాదం ఎలా మొదలైంది?
పోలీసుల వివరాల ప్రకారం గతేదాడి సెప్టెంబర్ లో హసన్ అనే యువకుడు సిక్కు వర్గానికి చెందిన 19 ఏళ్ల జగ్జీత్ కౌర్‌ను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకుని, బలవంతంగా మతమార్పిడి చేశారనే ఆరోపణలతో ఆరుగురు వ్యక్తులపై నాన్‌కానా పోలీస్ స్టేషన్లో గత సెప్టెంబర్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. మత మార్పిడుల కింద కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో హసన్ కుటుంబ సభ్యుల కొంతమంది మద్దతుతో గురుద్వారాకు సమీపంలో నిరసనకు దిగారు. గురుద్వారాను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. అక్కడికి వచ్చిన వారిపై రాళ్లు రువ్వారు. దీంతో ఆ ప్రాంతంలో ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఈ ఘటనపై మీడియాలో కథనాలు రావడంతో భారత ప్రభుత్వం స్పందించింది. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ఇదిలా ఉంటే తన ఇష్టానుసారమే కౌర్ ఇస్లాం మతంలోకి మారారని, ముహమ్మద్ హసన్‌తో ఆమె వివాహం జరిగిందని కౌర్ తరపు న్యాయవాదిని అని చెబుతున్న వ్యక్తి అధికారులతో చెప్పారు. ఆ తర్వాత జగ్జీత్ వాంగ్మూలాన్ని లాహోర్‌లోని న్యాయమూర్తికి సమర్పించారు. దానిలో తన కుటుంబం తనను వేధిస్తోందని ఆమె పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంతో ఆగ్రహం చెందిన సిక్కు వర్గం ప్రభుత్వ జోక్యాన్ని కోరింది. దీంతో, పంజాబ్ గవర్నర్ ముహమ్మద్ సర్వార్ మధ్యవర్తిత్వం జరిపారు. సమస్య సామరస్యంగా పరిష్కారమైందని ఆయన ట్విటర్లో ప్రకటించారు. కానీ, ఇప్పటికీ భద్రతా కారణాలను చూపిస్తూ ఆమెను లాహోర్‌లోని షెల్టర్ హోమ్ లోనే ఉంచారు.
జగ్జీత్‌ను తమకు అప్పగించకపోతే సిక్కులను ఈ ప్రాంతంలో నివసించనీయబోమని గురుద్వారాపై రాళ్లు రువ్విన గుంపు హెచ్చరించింది. జగ్జీత్ కౌర్ తాత ఈ గురుద్వారాలో పనిచేస్తుంటారు.హర్మీత్ సింగ్ ఆ సమయంలో గురుద్వారాలో ఉన్నారు. ఇది బాబా నానక్ పుట్టిన ప్రదేశం. మాకిది చాలా పవిత్రమైనంది. వాళ్లు దీనిపై రాళ్లు రువ్వారు. ఇది చాలా బాధగా ఉంది. దీన్ని మేం సహించం" అని హర్మీత్ వ్యాఖ్యానించారు.
గురుద్వారాపై దాడి జరగలేదు: పాక్
గురుద్వారా నాన్‌కానా సాహిబ్‌కు ఎలాంటి నష్టం జరగలేదని పాకిస్థాన్ విదేశీ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. శుక్రవారం లాహోర్‌లో సిక్కులకు, ముస్లింలకు మధ్య స్వల్ప ఘర్షణ జరిగిందని పేర్కొన్నది. ఈ పరిస్థితులు ఇలా ఉంటే కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లాహోర్‌లో గురుద్వారాపై దాడి సమస్యే కాదని, సీఏఏ,(CAA) ఎన్నార్సీల(NRC) నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు మోడీ ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకొచ్చిందని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు.పాక్ చచ్చిన గుర్రంలాంటిదని, జమ్ము కశ్మీర్ పోలీసులను పంపినా పాక్‌ను ఓడిస్తారన్నారు. పాక్ మనపై దాడి చేస్తుందనడం అవమానకరమని, మనం అంత బలహీనులమా అని ప్రశ్నించారు. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే పాక్ గురించి ప్రస్తావిస్తున్నారని ఆరోపించారు.
ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు
ఈ ఘటనపై ఇండియాలో తీవ్ర ఆగ్రహ జ్వాలలు రేగుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడే రోడ్డుకిరువైపులా నిలబడి పాక్‌కు, ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సిక్కు నేతలు పాక్ రాయబారికి వినతిపత్రం అందజేశారు. తాజా పరిస్థితిని పరిశీలించేందుకు శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ(ఎస్‌జీపీసీ) శనివారం నలుగురితో బృందాన్ని లాహోర్‌కు పంపింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్‌జీపీసీ చీఫ్ గోవింద్ సింగ్ లాంగోవాల్ పాక్ ప్రభుత్వాన్ని కోరారు. గురుద్వారాపై దాడి అంశాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
పాక్, అఫ్గాన్, బంగ్లాదేశ్‌ల్లో మత వివక్షను ఎదుర్కొంటూ భారత్‌కు ఆశ్రయం కోరి వచ్చిన వారికి పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకురావడం సబబేనని ఈ ఘటన మరోసారి రుజువు చేసిందని పలువురు కేంద్ర మంత్రులు బీజేపీ, విశ్వహిందూ పరిషత్ పేర్కొన్నాయి. ఈ ఘటనను భారత్ విదేశాంగశాఖ తీవ్రంగా ఖండించింది. సిక్కు సామాజిక వర్గం సంక్షేమం భద్రతకు తక్షణం చర్యలు తీసుకోవాలని పాక్‌ను కోరింది.
బీజేపీ నేత, న్యూఢిల్లీ ఎంపీ మీనాక్షి లేఖి
పాకిస్తాన్‌లో సిక్కులపై రాళ్ల దాడిని బీజేపీ నేత, న్యూఢిల్లీ ఎంపీ మీనాక్షి లేఖి ఖండించారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఇలాంటి ఘటన జరిగిన తర్వాత కూడా నవజ్యోత్ సింగ్ ఐఎస్‌ఐ చీఫ్‌ను ఆలింగనం చేసుకుంటారా? ఈ విషయం గురించి కాంగ్రెస్ ఎందుకు స్పందించడం లేదు.
సిద్ధు అన్నయ్య ఎక్కడ
సిద్ధు అన్నయ్య ఎక్కడికి పారిపోయారో తెలియడం లేదు’ అని విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. కాగా గతేడాది పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ పదవీ స్వీకార ప్రమాణం చేసిన సమయంలో నవజ్యోత్ అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడే ఉన్న పాక్ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న దాయాది దేశపు ఆర్మీ చీఫ్‌ను ఎలా కౌగిలించుకుంటారంటూ సిద్ధుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.ఈ ఘటనపై బీజేపీ నేత మీనాక్షి లేఖి, పాక్ మంత్రి ఫవాద్ ట్విట్టర్‌లో విమర్శలు చేసుకున్నారు.
అరవింద్ కేజ్రీవాల్
లాహోర్‌లో సిక్కుల మందిరాన్ని ధ్వంసం చేయడాన్ని సిగ్గు చేటు చర్యగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అభివర్ణించారు. దుండగుల దాడిని ఖండించిన కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ నిందితులను శిక్షించాలని సూచించారు.
రాహుల్ గాంధీ
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. గురుద్వారా దాడిని ఖండించారు. ఇది ప్రమాదకరమైందన్నారు. ఇది కాలకూట విషమని, దీనికి హద్దులు లేవన్నారు. మరో వైపు దాడిని ఖండిస్తూ ఢిల్లీలో సిక్కులు ధర్నా చేపట్టారు. అకాలీదళ్, గురుద్వారా వర్గీయులు భారీ ప్రదర్శన నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కూడా దాడిని ఖండించారు.
Here's Rahul Gandhi Tweet
నగర కీర్తన రద్దు
ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో నగర కీర్తన రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఉద్రిక్తత నేపథ్యంలో నగర కీర్తన నిర్వహించరాదు అని పాక్ ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి. జగ్జీత్ కౌర్ అనే యువతికి బలవంతంగా మత మార్పిడి చేయించి మహ్మద్ హసన్‌తో పెండ్లి చేశారని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో ఆగ్రహించిన ముస్లింలు శుక్రవారం ప్రార్ధనలు ముగిసిన తర్వాత గురుద్వారా వద్దకు చేరుకుని రాళ్లు రువ్వారు.
ఇలాంటి దాడులు జరక్కుండా పాక్ ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ కోరారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ నోరు ఎందుకు తెరవడం లేదని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఎద్దేవా చేశారు. మైనారిటీల పట్ల పాక్ నిజ స్వరూపం బయట పడిందని కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ అన్నారు.
Here's ANI Tweet
కేంద్రం జోక్యం చేసుకోవాలి: మాయావతి
సిక్కుమత వ్యవస్థాపకుడు గురునానక్ జన్మస్థానమైన నంకానా సాహిబ్ వద్ద సిక్కులపై రాళ్ల దాడిని బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు...‘ గురునానక్ దేవ్ జీ జన్మస్థానం వద్ద శుక్రవారం జరిగిన మూకదాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి ఘటనల గురించి మన దేశం సహజంగానే స్పందిస్తుంది. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలి. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి’ అని ట్విటర్ వేదికగా విఙ్ఞప్తి చేశారు.
ఇమ్రాన్ సైన్యం చేతిలో తోలుబొమ్మ : గౌతమ్ గంభీర్
లోక్‌సభ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పాకిస్తాన్‌లో బాలిక బలవంత మత మార్పిడికి మద్దతునిచ్చిన వారిపై విరుచుకుపడ్డారు. నంకనా సాహిబ్ గురుద్వారలో జరిగిన ఘటనను వ్యతిరేకిస్తూ శనివారం ఆయన ట్వీట్ చేశారు. బాలికను బెదిరించి బలవంతంగా మత మార్పిడి చేయించారని, అడ్డువచ్చిన పర్యాటకులను రాళ్లతో కొట్టారని మండిపడ్డారు. అదేవిధంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ఫేక్ ట్వీట్‌పై స్పందిస్తూ ‘సైన్యం చేతిలో తోలుబొమ్మ’ అంటూ ఎద్దేవా చేశారు. ‘బలవంత మతమార్పిడికి మద్దతుగా.. అమాయక పర్యాటకులను రాళ్లతో కొట్టడమే పాకిస్తాన్ అంటే. ఇండియా పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతునిస్తుంటే, పాకిస్తాన్ సైన్యం తోలు బొమ్మ మాత్రం నకిలీ వీడియోలను ట్వీట్ చేసి తనని తానుగా మూర్ఖుడిగా నిరూపించుకోవడంలో బిజీగా ఉన్నాడు’ అంటూ గంభీర్ ట్విటర్‌లో పేర్కొన్నారు.
Here's Gautam Gambhir Tweet
ఇమ్రాన్ ఖాన్ ఫేక్ ట్వీట్ వీడియో
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఓ వీడియోను షేర్ చేసి.. ‘భారత్‌లోని ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలపై పోలీసుల దౌర్జన్యం’ అనే క్యాప్షన్‌తో ట్విటర్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఆ వీడియో 2013 బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరిగిన ఘటనకు సంబంధించిందని నెటిజన్లు వెల్లడించి, ట్రోల్ చేయడంతో తన తప్పును తెలుసుకుని ఇమ్రాన్ తన ట్వీట్‌ను తొలగించారు.