Haryana Violence: హర్యానా మత ఘర్షణల్లో ఆరు మంది మృతి, 116 మందిని అరెస్ట్ చేశామని తెలిసిన సీఎం ఖట్టర్, పరిస్థితి అదుపులో ఉందని వెల్లడి
ఈ మత ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు, ఓ ఉన్నతాధికారి సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
హర్యానాలో మతపరపరమైన ఊరేగింపు సందర్భంగా జరిగిన హింసలో ఇప్పటి వరకు పోలీసులు 116 మందిని అరెస్ట్ (Six Dead, 116 People Arrested) చేశారు.మంగళవారం నాటికి మొత్తం 26 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఈ మత ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు, ఓ ఉన్నతాధికారి సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మంది క్షతగాత్రులు కాగా.. వీరిలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు సహా పది మంది పోలీసులు ఉన్నారు.
ఈ ఘటనలో ఇద్దరు హోంగార్డులు, నలుగురు పౌరులతో సహా ఆరుగురు మరణించారు. ఇప్పటి వరకు 116 మందిని అరెస్టు చేశారు. వారిని రిమాండ్‌కు తరలించారు. దోషులుగా తేలిన వారిని వదిలిపెట్టరు. ప్రజల భద్రతకు కట్టుబడి ఉన్నామని ఖట్టర్ (CM Manohar Lal Khattar) ఈరోజు చెప్పారు. "రాష్ట్రంలో మొత్తం పరిస్థితి సాధారణంగా ఉంది. శాంతి, ప్రశాంతత, సోదరభావాన్ని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి" అని హర్యానా ముఖ్యమంత్రి అన్నారు.
రాష్ట్రంలో మొత్తం 20 పారామిలటరీ బలగాలు, 30 హర్యానా పోలీసు విభాగాలను మోహరించినట్లు ఆయన తెలిపారు. “14 యూనిట్లు నుహ్‌కు, ,మూడు పాల్వాల్‌కు, రెండు ఫరీదాబాద్‌కు , ఒకటి గురుగ్రామ్ కు పంపబడ్డాయి. ప్రస్తుతం, నుహ్ , పరిసర ప్రాంతాల్లో పరిస్థితి సాధారణంగా ఉంది, భద్రతా ఏజెన్సీలు అప్రమత్తంగా ఉంచబడ్డాయని సిఎం చెప్పారు.జూలై 31న రెండు గ్రూపుల మధ్య చెలరేగిన హింసాకాండ నేపథ్యంలో నూహ్‌కు ఆనుకుని ఉన్న జిల్లాల్లో భద్రతను పటిష్టం చేశారు.
Here's CM Statement
మంగళవారం, హర్యానాలోని అనేక ఇతర జిల్లాలలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. గురుగ్రామ్ లోని బాద్‌షాపూర్ ,రియు సోహ్నా రోడ్డులో హింసాత్మక సంఘటనలు జరిగాయి. నూహ్‌లో సోమవారం అర్ధరాత్రి నుండి 48 గంటల పాటు 144 సెక్షన్ విధించబడింది. జిల్లాలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు.
గురుగ్రామ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వరుణ్ దహియా (క్రైమ్) ఈరోజు మాట్లాడుతూ, "అన్ని పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు సాధారణంగా పనిచేస్తున్నాయి. ట్రాఫిక్ కదలికలపై ఎటువంటి ఆంక్షలు లేవు. ఇంటర్నెట్ కూడా పనిచేస్తోంది. నేను అందరినీ సోషల్ మీడియాలో పుకార్లు పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైనా ఏదైనా సమాచారాన్ని నివేదించాలనుకుంటే, వారు హెల్ప్‌లైన్ నంబర్ '112'ని సంప్రదించగలరని తెలిపారు.