HD Kumaraswamy: ఇది హిందీ ప్రభుత్వమా..భారత ప్రభుత్వమా, హిందీ రాకుంటే దేశం విడిచి వెళ్లాలా? ఆగ్రహం వ్యక్తం చేసిన కుమార స్వామి, సౌత్ ఇండియాలో పెను దుమారం రేపుతున్న వైద్య రాజేష్ కోటేచా వ్యాఖ్యలు

తాజాగా హిందీ రాకుంటే శిక్ష‌ణా కార్య‌క్ర‌మం నుంచి బ‌య‌ట‌కు వెళ్లాలంటూ వ్యాఖ్య‌లు చేసిన రాజేష్ కోటేచాపై క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి ( former Karnataka chief minister HD Kumaraswamy) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హిందీ భాష రానంత మాత్రానా ఇత‌ర భాష‌ల వాళ్లు దేశం విడిచి వెళ్లిపోవాలా అంటూ ఫైర్ అయ్యారు.

HD Kumaraswamy (Photo Credits: PTI)

Bengaluru, August 24: తమిళ వైద్యులకు హిందీ తెలియదని ఆయుష్మాన్‌ భారత్‌ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా (AYUSH Secretary Vaidya Rajesh Kotecha) వ్యవహరించిన తీరు సౌత్ ఇండియాలో ఆగ్రహాన్ని రేపుతోంది. తాజాగా హిందీ రాకుంటే శిక్ష‌ణా కార్య‌క్ర‌మం నుంచి బ‌య‌ట‌కు వెళ్లాలంటూ వ్యాఖ్య‌లు చేసిన రాజేష్ కోటేచాపై క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి ( former Karnataka chief minister HD Kumaraswamy) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హిందీ భాష రానంత మాత్రానా ఇత‌ర భాష‌ల వాళ్లు దేశం విడిచి వెళ్లిపోవాలా అంటూ ఫైర్ అయ్యారు. దేశ ఐక్య‌త స‌మాఖ్య‌వాదంపై ఆధార‌ప‌డి ఉంటుంద‌ని, భార‌త్‌లో అన్ని భాష‌లు స‌మాన‌మేన‌ని అన్నారు.

హిందీ (Hindi Language Row) అర్థం కాకుంటే వెళ్లిపోండి అన‌డం ఏ మాత్రం ఆమోద‌యోగ్యం కాద‌ని, ఇది రాజ్యాంగ వ్య‌తిరేకమ‌ని మండిపడ్డారు. స‌మాఖ్య స్ఫూర్తికి విఘాతం క‌లిగించేలా మాట్లాడిన ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శిపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కుమారస్వామి డిమాండ్ చేస్తూ వ‌రుస ట్వీట్లు చేశారు.

మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షులు, ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ (Kamal Hasan) కూడా ఆయుష్‌ శాఖపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయుష్ శాఖకు తమిళమే అర్థం కానప్పుడు తమిళనాడు మందులు ఏలా అర్థమవుతాయని తమిళ వైద్యలు ఆయుష్ శాఖను ప్రశ్నించకపోవడం వైద్యుల వినయానికి నిదర్శమని కమల్‌ తెలిపారు. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే భాషలో పనిచేయడం ప్రభుత్వ బాధ్యత అని, ఇది హిందీ ప్రభుత్వం కాదని, భారత ప్రభుత్వం అని గట్టిగా కౌంటరిచ్చారు. అమిత్ షా.. బలవంతంగా హిందీని మాపై రుద్దవద్దు, తమిళులు హిందీ అంగీకరించే ప్రసక్తే లేదు, నీ ప్రయత్నం మానుకో, హోం మంత్రి వ్యాఖ్యలకు సూపర్‌స్టార్ రజినీ‌కాంత్ కౌంటర్

ఈ వివాదంపై డీఎంకే ఎంపీ కనిమొళి స్పందిస్తూ.. ఆయుష్‌ శాఖ శిక్షణ తరగతిలో హిందీ తెలియని వారు వెళ్లిపోవచ్చని ఆయుష్‌ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా పేర్కొనడాన్ని కనిమోళి తీవ్రంగా తప్పుబట్టారు. ఆయనపై శాఖాపరమైన క్రమశిక్షణ తసుకోవాలని డిమాండ్‌ చేశారు. హిందీ తెలియకపోతే ఎన్ని రోజులు అవమానిస్తారని ధ్వజమెత్తారు.

కాగా సెంటర్‌ ఫర్‌ డాక్టర్స్‌ నిర్వహించిన ఆన్‌లైన్ సమావేశంలో ఆయుష్ యూనియన్ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా స్పందిస్తూ.. తాను ఇంగ్లీషులో మాట్లాడనని, తాను హిందీలోనే మాట్లాడతానని, హిందీ అర్థం కాని వారు సమావేశం నుంచి వెళ్లిపోవచ్చని తెలిపారు. కాగా ఈ సమావేశానికి తమిళనాడుకు చెందిన 37 మంది ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు. యోగా మాస్టర్ ట్రైనర్స్ కోసం ఆయుష్ శాఖ, మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే చాలా సెషన్లు హిందీలో జరిగాయని కొందరు ఆరోపిస్తున్నారు. ఉద్యమానికి ఆజ్యం పోస్తున్న అమిత్ షా '' హిందీ '' వ్యాఖ్యలు, దక్షిణాది రాష్ట్రాల్లో పెరుగుతున్న వ్యతిరేకత, మరో జల్లికట్టు ఉద్యమం తప్పదన్న కమల్ హాసన్

తమిళ డాక్టర్లను అవమానించేలా ఆయుష్మాన్‌ భారత్‌ కార్యదర్శి రాజేష్‌ కోట్చే వ్యవహరించిన తీరు ప‌ట్ల తమిళ పార్టీలు, సంఘాలు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై సీఎం స్పందించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం హిందీ రాదన్న కారణంగా సీఐఎస్‌ఎఫ్‌ అధికారి డీఎంకే ఎంపీ కనిమొళిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో తమిళ డాక్టర్లను అవమానించేలా ఆయుష్మాన్‌ భారత్‌ కార్యదర్శి రాజేష్‌ కోట్చే వ్యవహరించిన తీరు తమిళనాట ఆగ్రహాన్ని రేపింది.

రాజేష్‌పై తమిళనాడు నేతలు, తమిళాభిమానులు మండి పడుతున్నారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఎండీఎంకే నేత వైగో, ఎంపీ కనిమొళి, తమిళనాడు కాంగ్రెస్‌ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి, తమిళ మానిల కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ఎంపీ జీకే వాసన్, డీఎండీకే అధినేత విజయకాంత్‌ దీనిపై స్పందించారు. ఆంగ్లం రాని వ్యక్తిని కార్యదర్శిగా ఎలా నియమించారని ప్రశ్నించారు. ఇంకెంత కాలం తమిళుల్ని అవమానిస్తారని ధ్వజమెత్తారు. చర్యలకు కేంద్రానికి సిఫారసు చేయాలని పట్టుబట్టారు. డీఎంకే ఎంపీ కనిమొళి, ధర్మపురి ఎంపీ సెంథిల్‌ కుమార్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సినీ రచయిత వైరముత్తు సైతం ఖండించారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకునే చూస్తామని మంత్రి సెల్లూరురాజు అన్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif