'No Alliance with Congress': కాంగ్రెస్ పార్టీకి డబుల్ షాక్, ఒంటరిగానే బరిలోకి దిగుతామని తేల్చి చెప్పిన మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ, ఇండియా కూటమికీ బీటలు
పార్లమెంట్ ఎన్నికల్లో బెంగాల్ నుంచి తమ పార్టీ ఒంటరిగా పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్‌తో ఎలాంటి సంబంధాలు లేవని.. ఆ పార్టీతో తాము పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు.
New Delhi, Jan 24: ప్రతిపక్ష ఇండియా కూటమికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ భారీ షాక్ ఇచ్చారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ నుంచి తమ పార్టీ ఒంటరిగా పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్‌తో కాని ఇండియా కూటమితో కాని ఎలాంటి సంబంధాలు లేవని.. ఆ పార్టీతో తాము పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు.
ఇండియా కూటమిలో భాగంగా.. కాంగ్రెస్‌తో జరిపిన సీట్ల పంపకం చర్చలు విఫలమయ్యాయని దీదీ తెలిపారు. ‘మేము వారికి ఏ ప్రతిపాదన ఇచ్చినా, వారు అన్నింటినీ తిరస్కరించారు. ఇక మాకు కాంగ్రెస్‌తో ఎలాంటి సంబంధాలు లేవు... బెంగాల్‌లో ఒంటరిగానే పోరాడతాం. ఎన్నికల తర్వాత అఖిల భారత స్థాయిలో నిర్ణయం తీసుకుంటాం’ అని అన్నారు. రోడ్డు ప్రమాదంలో సీఎం మమతా బెనర్జీ తలకు గాయం, ప్రస్తుతం నిలకడగా దీదీ ఆరోగ్యం
ఇదిలా ఉంటే పంజాబ్‌లో లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ సొంతంగానే పోటీ చేస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తెలిపారు. రాష్ట్రంలో తమకు కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తు లేదని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోరాడాలని ఆప్ పంజాబ్ వర్గం చేసిన ప్రతిపాదనకు కేజ్రీవాల్ ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు ఇప్పటికే తెలిపాయి. రాష్ట్రంలో మొత్తం 13 లోక్‌సభ స్థానాల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మమతా బెనర్జీ నిర్ణయంపై తాజాగా కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ మాట్లాడుతూ.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లేని ఇండియా కూటమిని ఊహించలేమని అన్నారు, ఈ మేరకు బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కూటమికి టీఎంసీ బలమైన పిల్లర్‌గా అభివర్ణించారు. భవిష్యత్తులో టీఎంసీతో సీట్ల పంపకాల చర్చలు ఫలప్రదంగా ఉంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.
బీజేపీని ఓడించాలని మమతా బెనర్జీ అన్నారు. ఓడించేందుకు మేము ఏమైనా చేస్తాం. మమతా బెనర్జీ, టీఎంసీ పార్టీ భారత కూటమికి బలమైన మూల స్తంభాలని రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారు. దిది లేని భారత కూటమిని మనం ఊహించలేం. ఈ కూటమి పశ్చిమ బెంగాల్‌లో కూటమిలా పోరాడుతుంది. రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్రలో భాగమయ్యేందుకు ఇండియా కూటమిలోని అన్ని పార్టీలను ఆహ్వానిస్తన్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చాలాసార్లు కోరారు’ అని తెలిపారు.
సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయన్న జైరాం రమేష్.. పశ్చిమ బెంగాల్‌లో భారత కూటమి ఏకమై ఎన్నికల్లో పోటీ చేస్తుందని, దానిపై తమకు పూర్తి విశ్వాసముంది. బీజేపీని ఓడించేందుకు తాము ఏ అవకాశాన్ని వదలదని ఆయన అన్నారు. అదే ఆలోచనతో ప్రస్తుతం అస్సాంలో ఉన్న భారత్ జోడో న్యాయ్ యాత్ర పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశిస్తుందని అన్నారు