West Bengal: బెంగాల్‌ గవర్నర్‌ వర్సెస్ సీఎం, మరింత ముదురుతున్న వివాదం, కొత్త చట్టం చేసిన మమతా బెనర్జీ, యూనివర్సిటీ ఛాన్సలర్‌గా దీదీ, అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడతామని ప్రకటన

సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee)అధ్యక్షతన గురువారం సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ కొత్త చట్టాన్ని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది

Mamata-Banerjee (Photo Credits: IANS/File)

Kolkata, May 26: రాష్ట్రంలోని యూనివర్సిటీలకు (state universities) ఛాన్స్‌లర్‌గా (Chancellor) ఇకపై సీఎం వ్యవహరించేలా కొత్త చట్టం రూపొందించింది పశ్చిమ బెంగాల్ (West Bengal ) ప్రభుత్వం. సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee)అధ్యక్షతన గురువారం సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ కొత్త చట్టాన్ని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రాష్ట్రంలోని యూనివర్సిటీలకు గవర్నర్ ఛాన్స్‌లర్‌గా ఉంటున్నారు. కొత్త చట్టం ఆమోదం పొందితే, సీఎం ఛాన్స్‌లర్‌ అవుతారు. కొత్త బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అక్కడ ఆమోదించిన తర్వాత, గవర్నర్ (Governor) కూడా అంగీకారం తెలపాల్సి ఉంటుంది. గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత నుంచి ఈ చట్టం అమల్లోకొస్తుంది.

CM KCR on National Politics: కేంద్రంలో మార్పును ఎవరూ ఆపలేరు, రెండు మూడు నెల‌ల త‌ర్వాత సంచ‌ల‌న వార్త వింటారు, దేవేగౌడతో మీటింగ్ అనంతరం సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు 

పశ్చిమ బెంగాల్‌లోని యూనివర్సిటీల విషయంలో కొంతకాలంగా సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కార్ (Jagadeep Dhankar) మధ్య వివాదం నడుస్తోంది. దీంతో గవర్నర్‌ నుంచి ఛాన్స్‌లర్‌ పదవిని తీసుకోవాలని మమత భావిస్తోంది. దీనికోసమే కొత్త చట్టాన్ని క్యాబినెట్ ఆమోదించింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును సభలో ప్రవేశపెడతామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బ్రత్యా బసు తెలిపారు. దీనిపై రాజ్‌భవన్ వర్గాల నుంచి ఇంకా ఎలాంటి స్పందనా రాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలోని 17 యూనివర్సిటీలకు గవర్నర్ ఎక్స్-అఫీషియో ఛాన్స్‌లర్‌గా కొనసాగుతున్నారు.

Chandrakant Patil: సుప్రీయా సూలే..నీకు రాజకీయాలు ఎందుకు వంట చేసుకోమన్న మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్‌, మండిపడుతున్న ఎన్సీపీ పార్టీ 

కాగా, ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ (BJP) స్పందించింది. ‘‘మమతా బెనర్జీ అధికారం అంతా తన చేతుల్లోనే ఉండాలనుకుంటోంది. తనను ఎవరూ ప్రశ్నించకూదనేది ఆమె ఉద్దేశం. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుంది’’ అని బీజేపీ విమర్శించింది.



సంబంధిత వార్తలు

Cyclone Fengal: ఏపీకి ఫెంగల్ తుఫాను ముప్పు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, తీరం వెంబడి గంటకు 75 కిలో మీటర్ల వేగంతో గాలులు, నేడు తమిళనాడును తాకనున్న సైక్లోన్

Cyclone Fengal: తమిళనాడు వైపు దూసుకొస్తున్న ఫెంగల్ తుఫాను, స్కూళ్లకు సెలవులు ప్రకటించిన స్టాలిన్ సర్కారు, పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ

CM Revanth Reddy: తెలంగాణలో మూడు కొత్త ఎయిర్ పోర్టులపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి, వరంగల్ మానాశ్రయ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరిన తెలంగాణ సీఎం

Constitution Day of India: 75వ రాజ్యాంగ దినోత్సవం, ప్రాథమిక హక్కులు- భారత పౌరులకు అందించిన గొప్ప వరం, ప్రజాస్వామ్యానికి మూలస్తంభంలా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ