Jaswant Singh Dies At 82: బీజేపీ సీనియర్ నేత జశ్వంత్ సింగ్ కన్నుమూత, సంతాపం తెలిపిన ప్రధాని మోదీ, పలువురు బీజేపీ నేతలు, 2014లో బీజేపీ పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన జశ్వంత్ సింగ్
కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ బీజేపీ నేత జశ్వంత్ సింగ్ (Jaswant Singh Dies) కన్నుమూశారు. ఆయన వయసు 82 ఏళ్లు. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి ప్రభుత్వంలో కీలక మంత్రి పదవులు నిర్వహించారు. రక్షణ మంత్రిగా, విదేశీ వ్యవహారాలశాఖ మంత్రిగా జశ్వంత్ సింగ్ తనదైన ముద్ర వేశారు. దేశానికి ఎంతో కీలకమైన ఆర్ధికశాఖకు సైతం సీనియర్ నేత తనదైన మార్కు సేవలందించారు. జశ్వంత్ సింగ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన సేవలను కొనియాడుతూ ప్రధాని ట్వీట్ చేశారు. పలువురు బీజేపీ నేతలు జశ్వంత్ సింగ్ మృతిపట్ల సంతాపం తెలిపారు.
New Delhi, September 27: కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ బీజేపీ నేత జశ్వంత్ సింగ్ (Jaswant Singh Dies) కన్నుమూశారు. ఆయన వయసు 82 ఏళ్లు. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి ప్రభుత్వంలో కీలక మంత్రి పదవులు నిర్వహించారు. రక్షణ మంత్రిగా, విదేశీ వ్యవహారాలశాఖ మంత్రిగా జశ్వంత్ సింగ్ తనదైన ముద్ర వేశారు. దేశానికి ఎంతో కీలకమైన ఆర్ధికశాఖకు సైతం సీనియర్ నేత తనదైన మార్కు సేవలందించారు. జశ్వంత్ సింగ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన సేవలను కొనియాడుతూ ప్రధాని ట్వీట్ చేశారు. పలువురు బీజేపీ నేతలు జశ్వంత్ సింగ్ మృతిపట్ల సంతాపం తెలిపారు.
1938 జనవరి3 న జన్మించిన జస్వంత్, ఆరెస్సెస్ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి కాదు. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో జశ్వంత్ సింగ్ ఒకరిగా చెప్పుకోవచ్చు. పార్లమెంటు సభ్యుడిగా అత్యధిక కాలం పనిచేసిన నేతగా ఆయనకు పేరుంది. ఇక వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో జశ్వంత్ సింగ్ కీలక శాఖలు చేపట్టారు. ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాల్లాంటి కీలక శాఖలన్నింటినీ నిర్వహించిన అతి కొద్దిమందిలో ఆయన ఒకరు. ఇక 1999 డిసెంబరులో భారతీయ విమానం హైజాక్‌కు గురైనప్పుడు హైజాకర్లతో పాటు జశ్వంత్ కూడా కాందహార్ వెళ్లారు.
ఇక 2014లో పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన జశ్వంత్ సింగ్‌పై బీజేపీ వేటు వేసింది. అప్పటి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. అలాగే 2018 రాజస్తాన్ ఎన్నికల సందర్భంగా జశ్వంత్‌సింగ్ కుమారుడు మన్వేంద్ర సింగ్ కూడా భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు.
ఆయన పాకిస్తాన్ నేత మహమ్మద్ ఆలీ జిన్నా గురించి రాసిన జిన్నా: ఇండియా, పార్టిషన్, ఇండిపెండెన్స్ పుస్తకం సంచలనం సృష్టించడమే కాదు. ఏకంగా ఆయనను పార్టీనుండి బయటకు పంపేవరకూ వెళ్లింది. దేశవిభజనకు ఖ్వాదీ ఆజం, మహమ్మద్ అలీ జిన్నాల కంటే కూడా కాంగ్రెస్, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్‌వల్లభాయ్ పటేల్‌లే మరింత కారణమని వ్యాఖ్యానించారు. జిన్నా వ్యక్తిత్వం నన్నెంతో ఆకట్టుకుంది. అదే నా పుస్తకంలో ప్రతిఫలించింది. ఆ వ్యక్తిత్వమే నన్ను గనుక ఆకట్టుకో కుంటే, నేనసలు ఈ పుస్తకమే రాసేవాడిని కాదు. స్వతంత్ర భారతదేశం కోసం ఆయన బ్రిటిష్ వారితో పోరాడడమే కాకుండా భారతదేశంలోని ముస్లింల ప్రయోజనాల కోసం ఎంతో శ్రమించారు అన్నారు.
భారతీయ ముస్లింలు నేడు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావిస్తూ ‘భారత్‌లో నివసిస్తున్న ముస్లింల కళ్ళ లోకి చూడండి. తాము ఏ దేశానికి చెందారో అక్కడే వారు పరజాతీయుల్లా బతుకుతున్నారు’ అంటూ వ్యాఖ్యా నించారు. 2006 జూలైలో ఆయన ‘'ఎ కాల్ టు హానర్: ఇన్ సర్వీస్ ఆఫ్ ఎమర్జెంట్ ఇండియా'’ పుస్తకంలో ప్రధానమంత్రిగా పీవీ నరసింహారావు ఉన్న సమయంలో, ప్రధానమంత్రి కార్యాలయంలో సీఐఏ ఏజెంటు ఒకరు ఉన్నారని జస్వంత్ ఆ పుస్తకంలో పేర్కొన్నారు. 1999 డిసెంబరులో భారతీయ విమానం హైజాక్‌కు గురైనప్పుడు హైజాకర్లతో పాటు ఆయన కాందహార్ వెళ్ళారు.
ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో ఆయన తీసుకున్న నిర్ణయాల్లో ప్రధానమైంది యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా పునర్‌నిర్మాణం.1998లో భారత అణుపరీక్ష అనంతరం, అమెరికాతో దెబ్బ తిన్న సంబంధాలను పూర్వస్థితికి తీసుకువచ్చేందుకు ఆయన ఎంతో కృషి చేశారు. చర్చల్లో, దౌత్యకార్యాల్లో ఆయన నైపుణ్యాలను ఎంతోమంది ప్రశంసించారు. భారత పార్లమెంట్‌పై దాడి జరిగిన అనంతరం దెబ్బ తిన్న భారత్-పాక్ సంబంధాలను పూర్వస్థితికి తేవడంలో కూడా ఆయన కీలక పాత్ర వహించారు.
సైనికాధికారిగా పనిచేసిన అనుభవం ఉండడంతో, సైనిక అంశాలపై ఆయన ఎంతో మక్కువ చూపేవారు. రాజస్థాన్‌కు చెందిన జస్వంత్, పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ నుంచి కూడా ఎన్నికయ్యారు. అప్పట్లో ఆయన విజయానికి గూర్ఖాజన ముక్తి మోర్చా అందించిన తోడ్పాటు కూడా కారణమైంది. కేంద్రంలో బీజేపీ 13 రోజుల పాలనలో ఆయన ఆర్థికశాఖ మంత్రి పదవి చేపట్టారు. ఆధునిక భావాలు కలిగిన ఉదార ప్రజాస్వామ్య వాదిగా జస్వంత్ పేరొందారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)