Raipur, May 9: చత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా (Chhattisgarh) బాధ్యతలు నిర్వర్తించిన సీనియర్ నేత అజిత్ ప్రమోద్ కుమార్ జోగి (Ajit Jogi Dies at 74) ఇవాళ కన్నుమూశారు. ఆయన వయసు 74 ఏళ్లు. గుండెపోటు రావడంతో జోగిని రాయ్‌పూర్‌లోని ప్రైవేటు హాస్పిటల్‌లో చేర్పించారు. మే 9వ తేదీన ఆయనకు తొలిసారి గుండెపోటు వచ్చింది. ఆ తర్వాత అప్పటి నుంచి ఆయన హాస్పిటల్‌లో వెంటిలేటర్‌పై ఉన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాయ్‌పూర్‌లో శుక్రవారం తుదిశ్వాస విడిశారు. కరోనా భయంతో కరువైన మానవత్వం, ఢిల్లీలో నడిరోడ్డుపై వృద్ధుడు పడిపోతే పట్టించుకోని వైనం, దేశ రాజధానిలో దడపుట్టిస్తున్న కరోనావైరస్
అజిత్ జోగి (Ajit Jogi) రాజకీయాల్లోకి రాకముందు కలెక్టర్‌గా కూడా పనిచేశారు.1986-1998 మధ్యకాలంలో అజిత్ రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు.భోపాల్‌లోని మౌలానా ఆజాద్ టెక్నాలజీ కాలేజీలో జోగి మెకానికల్ ఇంజినీరింగ్ చేశారు. 1968లో ఆయన యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధించారు. రాయ్‌పూర్‌లోని నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కొన్నాళ్ల పాటు లెక్చరర్‌గా పనిచేశారు. ఐపీఎస్, ఐఏఎస్‌గా కూడా ఈయన సెలక్ట్ అయ్యారు. భోపాల్ కలెక్టర్‌గా 1981 నుంచి 1985 వరకు పనిచేశారు.
2000 నవంబర్ నుంచి 2003 నవంబర్ వరకు ఆయన చత్తీస్‌ఘడ్ సీఎంగా పనిచేశారు. 2016లో కాంగ్రెస్ పార్టీ నుంచి అజిత్ జోగి విడిపోయారు. ఓ ఉప ఎన్నిక విషయంలో ఆ పార్టీకి ఆయన గుడ్‌బై చెప్పాల్సి వచ్చింది. కాంగ్రెస్‌ను వీడిన తర్వాత ఆయన జనతా కాంగ్రెస్ పార్టీని స్థాపించారు.
గతంలో జరిగిన ఓరోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో చక్రాల కుర్చీ నుంచే రాజకీయాలను నడిపారు. 1998 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌గఢ్ నియోజకవర్గం నుంచి, 2004లో మహసముండ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అలాగే 1998 నుంచి 2004 మధ్య కాలంలో ఏఐసీసీ అధికార ప్రతినిధిగా కొనసాగారు. 2008లో మర్వాహి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీతో విభేదించి.. 2016 జూన్ 23న కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జే) పార్టీని స్థాపించారు. జోగి మృతిపట్ల కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
.