Jagat Prakash Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఏకగ్రీవ ఎన్నిక, వివాదరహితుడుగా పేరుగాంచిన జేపీ నడ్డా, ఒక వ్యక్తికి ఒకే పదవి అనే సంప్రదాయాన్ని పాటించిన బీజేపీ

సుదీర్ఘ చరిత్ర కలిగిన జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)(Bharatiya Janata Party (BJP) కొత్త అధ్యక్షుడిగా జగత్ ప్రకాశ్ నడ్డా (Jagat Prakash Nadda)ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జేపీ నడ్డా ఎన్నిక లాంఛనమేనని తెలిసినా, పార్టీ రాజ్యాంగం ప్రకారం ఎన్నికల ప్రక్రియ నిర్వహించి నామినేషన్ల స్వీకరణ జరిపారు. ఈ మధ్యాహ్నంతో నామినేషన్ల ఉపసంహరణ, పరిశీలన గడువు ముగియడంతో, నడ్డా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు అధికారికంగా ప్రకటించారు.

JP Nadda Elected New BJP President, Succeeds Amit Shah Ahead of Delhi Assembly Elections 2020

New Delhi, January 20:సుదీర్ఘ చరిత్ర కలిగిన జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)(Bharatiya Janata Party (BJP) కొత్త అధ్యక్షుడిగా జగత్ ప్రకాశ్ నడ్డా (Jagat Prakash Nadda)ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జేపీ నడ్డా ఎన్నిక లాంఛనమేనని తెలిసినా, పార్టీ రాజ్యాంగం ప్రకారం ఎన్నికల ప్రక్రియ నిర్వహించి నామినేషన్ల స్వీకరణ జరిపారు. ఈ మధ్యాహ్నంతో నామినేషన్ల ఉపసంహరణ, పరిశీలన గడువు ముగియడంతో, నడ్డా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు అధికారికంగా ప్రకటించారు.

నడ్డా పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు బీజేపీ ఎన్నికల ఇంచార్జి రాధా మోహన్‌సింగ్‌ ఈ సందర్భంగా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నడ్డాకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా(Amit Shah) అభినందనలు తెలిపారు.

ఇప్పటివరకు నడ్డా బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరించారు.గత మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) ఎన్నికల ఇన్‌చార్జ్‌గా నడ్డా వ్యవహరించారు.

Here's ANI Tweet

బీజేపీ అధ్యక్షుడిగా ఐదున్నరేళ్లకు పైగా పనిచేసిన అమిత్‌ షా పార్టీని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు. అమిత్‌ షా హయంలోనే బీజేపీ(BJP) కేంద్రంలో రెండు సార్లు, పలు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి వచ్చింది. ప్రధాని మోడీ(PM Modi) తాజా ప్రభుత్వంలో అమిత్‌ షాకు కీలకమైన హోంమంత్రి పదవి దక్కింది.

Here's ANI Tweet

దీంతో ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ అనే సంప్రదాయం ప్రకారం పార్టీ అధ్యక్ష పదవి కోసం మరొకరిని ఎన్నుకోవడం అనివార్యమైంది. విద్యార్థి దశ నుంచే జేపీ నడ్డా పార్టీ కోసం పనిచేశారు. కీలక పదవులను సమర్ధవంతంగా నిర్వహించిన తీరు, ఆరెస్సెస్‌తో(RSS) అనుబంధం, వివాద రహితుడిగా ఉన్న పేరు.. మొదలైనవి జేపీ నడ్డాకు అనుకూలంగా మారాయి.

Jagat Prakash Nadda met his brother at the party HQ

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీయేతర పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఓ సమావేశంలో మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసి తీరుతాం. 28, 30 ఏళ్ల క్రితం భారతదేశానికి వచ్చిన మైనార్టీలు దుర్బర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.

వారికి భారత పౌరసత్వం లేనందున ఇల్లు కట్టుకోలేరు. పాఠశాలల్లో వారి పిల్లలను చేర్చలేరు. ఇలాంటివేవీ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీలకు పట్టవు. వారికి కావాల్సిందల్లా రాజకీయమే’ అంటూ ధ్వజమెత్తారు. పౌరసత్వ చట్టం తర్వాత సమీప భవిష్యత్తులో ఎన్నార్సీ కూడా ఉంటుందని నడ్డా స్పష్టం చేశారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Amit Shah-Babu-Pawan: విశాఖ ఉక్కు తెలుగు ప్రజల సెంటిమెంట్.. అందరం కలిసి దాన్ని లాభాల్లోకి తీసుకొద్దాం.. ఉండవల్లిలో బాబు, పవన్ తో జరిగిన భేటీలో అమిత్ షా

CM Revanth Reddy: ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపేందుకు తెలంగాణ నుండి మద్దతిస్తాం...మరో రెండు హామీలను ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌తోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమని వెల్లడి

Amit Shah AP Tour Details: ఆంధ్రప్రదేశ్‌కు హోంమంత్రి అమిత్ షా.. ఎన్డీఆర్ఎఫ్, ఎస్బీడీఎం ప్రాంగణాలను ప్రారంభించనున్న షా, చంద్రబాబు నివాసంలో అమిత్‌ షాకు విందు

Meta Apologises to Indian Government: మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ కామెంట్లపై భార‌త్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన మెటా సంస్థ, మాకు ఇండియా చాలా కీల‌క‌మైన దేశ‌మ‌ని వెల్లడి

Share Now