Amit Shah In Vaishali: ప్రతిపక్షాలపై విరుచుకుపడిన అమిత్ షా, పౌర ప్రకంపనల వెనుక సూత్రధారులు ప్రతిపక్షాలే, ప్రజలను తప్పుదోవ పట్టించవద్దన్న కేంద్ర హోం మంత్రి, వచ్చే ఎన్నికల్లో బీహార్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్
Union Home Minister Amit Shah (Photo Credits: PTI)

Vaishali, January 17: కేంద్ర ప్రభుత్వం అక్రమ వలసదారులను ఏరివేసేందుకు తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ)(Citizenship Amendment Act) వ్యతిరేకిస్తున్న విపక్షాలపై కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత అమిత్‌ షా(BJP president Amit Shah) మండిపడ్డారు. సీఏఏను(CAA) వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ సహా విపక్షాలు దేశంలో హింసను ప్రేరేపిస్తున్న క్రమంలో వారి ఆగడాలను అడ్డుకునేందుకు బీజేపీ(BJP) దేశవ్యాప్తంగా ప్రజలకు పౌరచట్టంపై అవగాహన కల్పించేందుకు ర్యాలీలు చేపట్టవలసి వచ్చిందని చెప్పారు.

ముస్లిం సోదరులు సీఏఏను పూర్తిగా చదవాలని చెప్పేందుకే తాను ఇక్కడకు వచ్చానని బీహార్‌లోని వైశాలిలో (Bihar's Vaishali district,)గురువారం జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ అమిత్‌ షా పేర్కొన్నారు.

పౌరచట్టంపై ప్రజలను తప్పుదారి పట్టించవద్దని రాహుల్‌ గాంధీ, లాలూ ప్రసాద్‌ యాదవ్‌లను ఆయన కోరారు. మమతా దీదీ, కేజ్రీవాల్‌ కూడా ఈ చట్టంపై దుష్ర్పచారం మానుకోవాలని అమిత్‌ షా హితవు పలికారు. సీఏఏ పట్ల బిహార్‌ ప్రజలు సానుకూలంగా ప్రతిస్పందించారని చెప్పారు.

ANI Tweet:

NRCకి మరియు NPRకి మధ్య ఎలాంటి సంబంధం లేదు

కాగా బీహార్ శాసన సభ ఎన్నికల్లో ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థి నితీశ్ కుమార్ అని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మరోసారి చెప్పారు. ఎన్డీయేకు కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రంలో నితీశ్ కుమార్ నాయకత్వం వహిస్తారని చెప్పారు. కాగా పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు కూడగట్టేందుకు ఈ బహిరంగ సభను నిర్వహించారు. ఇప్పటి వరకు ప్రచారమవుతున్న అన్ని పుకార్లకు తెర దించాలని తాను భావిస్తున్నట్లు అమిత్ షా చెప్పారు.

దేశంలో అక్రమ వలసదారులను ఏరివేస్తాం

బీహార్‌లో జరిగే తదుపరి శాసన సభ ఎన్నికల పోరాటం నితీశ్ కుమార్ నాయకత్వంలో జరుగుతుందని తెలిపారు. 2005 నుంచి 2020 వరకు ఎన్డీయే ప్రభుత్వాలే బీహార్‌ను ఆటవిక పాలన నుంచి ప్రజా పాలనకు నడిపించాయని చెప్పారు.

ఢిల్లీలో కాషాయపు జెండా ఎగరేస్తాం, గురుద్వారా దాడిపై కాంగ్రెస్ మౌనమెందుకు..?

ప్రస్తుత ప్రతిపక్షాలైన ఆర్జేడీ, కాంగ్రెస్‌లపై ఆయన పరోక్షంగా విమర్శలు గుప్పించారు. జేడీయూ-బీజేపీ బంధం తెగ్గొట్టడానికి వీలైనది కాదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అవుదామని కలలు కంటున్న ప్రతిపక్ష నేతల కలలు నెరవేరబోవన్నారు.