New Delhi, January 18: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా(BJP Working Chief JP Nadda) విమర్శలు గుప్పించారు. సీఏఏకి( CAA) మద్దతుగా ఢిల్లీలో బౌద్ధ మత సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. నడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పౌరసత్వ సవరణ చట్టంపై దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేలా రాహుల్ ( Rahul Gandhi)వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలో కొందరు ఎలాంటి అవగాహన లేకుండా తమ పరిజ్ఞానాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారని, తద్వారా ప్రజానీకాన్ని దారి మళ్లిస్తున్నారని మండిపడ్డారు. ఇది దురదృష్టకర పరిణామని వ్యాఖ్యానించారు. రాహుల్‌కు దమ్ముంటే సీఏఏపై(Citizenship Amendment Act) కనీసం 10 వాక్యాలు(Speak 10 Lines) మాట్లాడాలని సవాల్ చేశారు. సీఏఏతో రాహుల్‌కు ఉన్న ఇబ్బందేంటో కనీసం రెండు వాక్యాలైయినా చెప్పాలన్నారు. ఓ పార్టీకి నాయకత్వం వహిస్తూ ఇలా దేశాన్ని పక్కదారి పట్టించడం సబబు కాదని హితవు పలికారు.
జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు ముహూర్తం ఖరారు
బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా ప్రారంభమైన సంస్థాగత ఎన్నికల ప్రక్రియ మరి కొద్ది రోజుల్లో పూర్తికానుంది. ఇప్పటికే బూత్ కమిటీలు.. మండల కమిటీలు... జిల్లా కమిటీలు, రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక పూర్తి చేసుకొని... జాతీయ అధ్యక్ష ఎన్నిక వరకు వచ్చింది.
కేరళ తర్వాత పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేసిన పంజాబ్
ఈ క్రమంలో పార్టీ ఎన్నికల నిర్వహణ ఇన్ చార్జి రాధామోహన్ సింగ్ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. తొలుత 75 శాతం బూత్, 50 శాతం మండల, 60 శాతం జిల్లాల, 21 రాష్ట్రాల అధ్యక్షుల ఎంపిక ఉంటుంది. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ చేపడతారు.
ప్రతిపక్షాలపై విరుచుకుపడిన అమిత్ షా
ఈ నెల 20న జాతీయ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ దాఖలు ప్రక్రియ ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేస్తారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30 గంటల వరకు నామినేషన్ల పరిశీలన చేపడతారు. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 2.30 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. ఒకటికి మించి నామినేషన్లు దాఖలైతే ఈ నెల 21న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నిక నిర్వహిస్తారు. 22న అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారు.
ఢిల్లీలో కాషాయపు జెండా ఎగరేస్తాం, గురుద్వారా దాడిపై కాంగ్రెస్ మౌనమెందుకు..?
ఇదిలా ఉంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నట్లు సమాచారం. ఈనెల 22న ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపడతారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు.