New Karnataka CM: డికే శివకుమార్ వైపు మొగ్గు చూపుతున్న సోనియా, సిద్ధరామయ్యకే సై అంటున్న రాహుల్, కర్ణాటక సీఎం ఎవరనేదానిపై కొనసాగుతున్న సస్పెన్స్

కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో సుదీర్ఘకాలం తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చిందనే సంతోషంతో రాష్ట్రమంతటా కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.మొత్తం 224 స్థానాలకు గానూ ఏకంగా 135 సీట్లను గెలుచుకుంది.

DK Shivakumar and Siddaramaiah. (Photo Credits: Facebook)

Bengaluru, May 15: కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో సుదీర్ఘకాలం తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చిందనే సంతోషంతో రాష్ట్రమంతటా కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.మొత్తం 224 స్థానాలకు గానూ ఏకంగా 135 సీట్లను గెలుచుకుంది. దీంతో ఇప్పుడు తదుపరి ముఖ్యమంత్రి (CM) ఎంపికపై హైకమాండ్‌ కసరత్తులు చేస్తోంది. కన్నడనాట పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన మాజీ సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah), కేపీసీసీ చీఫ్ డీకే శివ‌కుమార్ (DK Shivakumar) ఇప్పుడు సీఎం పదవికి పోటీ పడుతున్నారు.

ఈ నేపథ్యంలో తదుపరి సీఎం ఎవరన్నదానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఎవరికి వారు వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించే దాకా సమైక్యంగా ఉన్నామంటూ ప్రకటించిన నేతల వ్యూహాలు తాజాగా మారిపోయాయి. సీఎం పీఠం దక్కించుకునేందుకు ఆదివారం ఉదయం నుంచి ఎవరికివారుగా ప్రయత్నాలు సాగించారు.

సీబీఐ కొత్త డైరెక్టర్‌గా కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ నియామకం, 2 సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతారు..

ఈ నేపథ్యంలో సీఎం పదవి కోసం మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వేగంగా పాములు కదుపుతున్నారు. తనకే సీఎం పదవి దక్కేలా మద్దతు గల ఎమ్మెల్యేలతో రహస్య సమావేశాలకు తెరలేపినట్లు తెలుస్తోంది. బెంగళూరులోని ఓ భవనంలో తనకు మద్దతుగా నిలుస్తున్న ఎమ్మెల్యేలతో సిద్దు భేటీ నిర్వహించినట్లు సమాచారం. ఈ భేటీకి ఎమ్మెల్యేలు ఎంబీ పాటిల్‌, జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌, ఉత్తర కర్ణాటకకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నట్లు టాక్‌ వినిపిస్తోంది.

కర్ణాటక సీఎం ఎవర్నరది పార్టీ హైకమాండ్‌ నిర్ణయిస్తుందని రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ డీకే శివ కుమార్‌ తెలిపారు. కాంగ్రెస్‌ అధిష్టానానికి నిర్ణయాన్ని వదిలేశానని తెలిపారు. తాను చేయాల్సినదంతా చేశానని పేర్కొన్నారు. ఈరోజు(మే 15) తన పుట్టినరోజు అని, అనేక కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉందన్నారు. నేడు ఢిల్లీ పర్యటన విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఢిల్లీ వెళ్తానో లేదో తెలీదని చెప్పారు.

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి చెందిన 11 మంది మంత్రులు దారుణంగా ఓటమి

సోనియా గాంధీ తనకు బర్త్‌డే గిఫ్ట్‌ ఇస్తుందో లేదో తెలియదని శివకుమార్‌ పేర్కొన్నారు. తాను కాంగ్రెస్‌ పార్టీ, సోనియా గాంధీ విధేయుడనని తెలిపారు. తనపై బీజేపీ అక్రమ కేసులు పెట్టి ఇరికించినప్పుడు సోనియా నాతో ఉన్నారని గుర్తు చేసుకున్నారు. తన మీద నమ్మకంతో సోనియా గాంధీ పీసీసీ చీఫ్‌ చేశారని అన్నారు. జనం తనను నమ్మి 130 సీట్లు ఇచ్చారని, ఇంతకంటే బర్త్‌డే గిఫ్ట్‌ ఏముంటుంది? అని పేర్కొన్నారు.

కాగా 135 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల నుంచి విడివిడిగా అభిప్రాయాలు సేకరించారు ఏఐసీసీ పరిశీలకులు. బెంగుళూరు నుంచి ఢిల్లీ బయల్దేరారు. మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకొని ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఏఐసీసీ అధ్యక్షుడికి సుశీల్‌ కుమార్‌ షిండే బృందం తెలియజేయనుంది. రాహుల్, సోనియా గాంధీలను సంప్రదించిన తర్వాత హై కమాండ్ నిర్ణయం తీసుకోనుంది. అయితే మెజార్టీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మరోవైపు హై కమాండ్‌ సీఎం సీటు షేరింగ్ ఫార్ములా సిద్దం చేస్తున్నట్లు సమాచారం.

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం నిర్వహించనున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అదే రోజు కేబినెట్‌ మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నట్లు వారు వెల్లడించారు. మరోవైపు కొత్త సీఎంకు శుభాకాంక్షలు అంటూ డీకే, సిద్ధు నివాసాల ముందు వారి మద్దతుదారులు బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేశారు.

అయితే ఎవరిని సీఎం చేయాలనేది సీఎల్పీ భేటీలో కొలిక్కి రాలేదు. సిద్దరామయ్య, డీకే పట్టువీడకపోవడంతో ఏకాభిప్రాయం సాధ్యం కాదని ఏఐసీసీ పరిశీలకులు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. సీఎల్పీ భేటీలోనే ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకోవాలని సిద్దరామయ్య పట్టుబట్టగా, అధిష్ఠానం నిర్ణయం కూడా తీసుకోవాలని డీకే పేర్కొనడంతో అంశం ఢిల్లీకి చేరింది. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ సూచించే వారే ముఖ్యమంత్రి పీఠం అధిరోహించనున్నారు. సోనియాగాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే కూడా డీకే శివకుమార్‌వైపు మొగ్గు చూపుతారనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే, రాహుల్‌గాంధీ సిద్దరామయ్య పట్ల సానుకూలంగా ఉంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కా