Border Row: చైనా భారత్‌లోకి ప్రవేశించినట్లే మేము కర్ణాటకలోకి అడుగుపెడతాం, సరిహద్దు సమస్యపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంజయ్ రౌత్, ముదురుతున్న కర్ణాటక-మహారాష్ట్ర బార్డర్ వివాదం
ఈ విషయంలో తనకు ఎవరి ‘అనుమతి’ అవసరం లేదని శివసేన పార్టీ సీనియర్ నేత చెప్పారు.
Mumbai, Dec 21: సరిహద్దు సమస్యపై కర్ణాటక-మహారాష్ట్ర మధ్య ఉద్రిక్త పరిస్థితులు (Karnataka-Maharashtra border dispute) నెలకొన్న నేపథ్యంలో శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) నాయకుడు సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన చైనా దేశంలోకి ప్రవేశించినట్లే కర్ణాటకలో అడుగుపెడతాం ("Like China, we will enter Karnataka) అంటూ సరికొత్త వివాదానికి తెర లేపారు. ఈ విషయంలో తనకు ఎవరి ‘అనుమతి’ అవసరం లేదని శివసేన పార్టీ సీనియర్ నేత చెప్పారు.
“చైనా భారత్‌లోకి ప్రవేశించినట్లే మేం (కర్ణాటక)లోకి ప్రవేశిస్తాం.. మాకు ఎవరి అనుమతి అవసరం లేదు.. చర్చ ద్వారా పరిష్కరించుకోవాలనుకుంటున్నాం కానీ కర్ణాటక సీఎం నిప్పులు చెరుగుతున్నారు.మహారాష్ట్రలో బలహీనమైన ప్రభుత్వం ఉంది. అయినా దానిపై ఎలాంటి స్టాండ్ తీసుకోవడం లేదని సంజయ్ రౌత్ (MP Sanjay Raut) చెప్పారు.దశాబ్దాల నాటి సరిహద్దు వివాదంపై మహారాష్ట్ర-కర్ణాటక మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొని ఉన్న సమయంలో సంజయ్ రౌత్ నుంచి ఈ ప్రకటన వచ్చింది. ఈ సమస్యపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది.
ఇదిలా ఉంటే ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం ఈ అంశంపై విమర్శలను ఎదుర్కొంటోంది. మహారాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలలో ప్రతిపక్షాలనుంచి విమర్శలను ఎదుర్కొంటోంది. ప్రతిపక్ష నేత అజిత్ పవార్ అంతకుముందు అసెంబ్లీలో సరిహద్దు వివాదం అంశాన్ని లేవనెత్తారు. "మహారాష్ట్ర నుండి ఒక లోక్‌సభ సభ్యుడిని బెల్గాంలోకి రాకుండా అడ్డుకున్నారు. హోం మంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో ఎవరినీ అడ్డుకోవద్దని నిర్ణయించారు. అక్కడికి వెళితే అక్కడి కలెక్టర్ ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని మండిపడ్డారు.
Here's ANI Tweet
పవార్ లేవనెత్తిన అంశంపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పందిస్తూ, “సరిహద్దు వివాదంపై మొదటిసారిగా దేశ హోంమంత్రి మధ్యవర్తిత్వం వహించారు, ఆయన ఈ సమస్యను సీరియస్‌గా తీసుకున్నారు, మేము సరిహద్దు వాసుల పక్షాన్ని ఆయనకు సమర్పించాము. సరిహద్దు వివాదంపై షా తన అభిప్రాయాన్ని మా ముందు ఉంచారు, ఇప్పుడు సరిహద్దు వివాదంలో రాజకీయాలు ఉండకూడదు, సరిహద్దు నివాసితులతో కలిసి నిలబడాలని తెలిపారు.
సిఎం షిండే వ్యాఖ్యలతో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఏకీభవించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు. తమను బెలగావిలోకి అనుమతించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర ఏకికరణ్ సమితి (ఎంఈఎస్), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సోమవారం నిరసన ప్రదర్శన చేయడంతో మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దులోని బెలగావి సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
తిలకవాడిలోని వ్యాక్సిన్ డిపో గ్రౌండ్‌లో MES మహా మేళా నిర్వహించడానికి బెలగావి పోలీసులు అనుమతి నిరాకరించారు. తిలకవాడి పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత ఉత్తర్వులను బిగించారు.కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలిరోజైన ఈరోజు ఎంఈఎస్ సదస్సు జరగాల్సిన ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. భారీ భద్రతను మోహరించారు.
కాగా మహారాష్ట్ర- కర్నాటక మధ్య సరిహద్దు వివాదం 1956 రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం మార్చాలని మహారాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం కర్ణాటకతో సరిహద్దును సరిచేయాలని డిమాండ్ చేసింది. దీంతో ఇరు రాష్ట్రాలు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశాయి. ప్రధానంగా కన్నడ మాట్లాడే 260 గ్రామాలను బదిలీ చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. దీనికి ప్రతిగా కర్ణాటకలో ఉన్న బెళగావితోపాటు మరాఠా భాష మాట్లాడే ప్రజలు అధికంగా ఉన్న 814 గ్రామాలు మాకివ్వాలని వాదిస్తోంది. అయితే ఆ ప్రతిపాదనను కర్ణాటక తిరస్కరించింది.ఆ తర్వాత రెండు ప్రభుత్వాలు ఈ కేసును వేగవంతం చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాయి