Kerala Assembly Elections 2021: గెలిపించండి, రూ.60కే పెట్రోల్ అందిస్తాం, కేరళలో బీజేపీ సంచలన ప్రకటన, కేరళ బీజేపీ సీఎం అభ్యర్థిగా మెట్రో శ్రీధరన్, శ్రీధరన్‌కున్న క్లీన్ ఇమేజ్ పైనే బీజేపీ ఆశలు

కేరళలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తన ముఖ్యమంత్రి అభ్యర్థిని గురువారం ప్రకటించింది. మెట్రో శ్రీధరన్‌ తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. సురేంద్రన్ అధికారికంగా ప్రకటించారు. టెక్నోక్రాట్, మెట్రో‌మ్యాన్ శ్రీధరన్ ఇటీవలే బీజేపీలో అధికారికంగా చేరారు. బీజేపీలో చేరక మునుపే తనకు సీఎం అభ్యర్థిగా (E Sreedharan Announced BJP CM Candidate) బరిలోకి దిగడం సమ్మతమేనని ప్రకటించారు.

File image of Elattuvalapil Sreedharan (Photo Credits: PTI)

Thiruvananthapuram , March 4: కేరళలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తన ముఖ్యమంత్రి అభ్యర్థిని గురువారం ప్రకటించింది. మెట్రో శ్రీధరన్‌ తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. సురేంద్రన్ అధికారికంగా ప్రకటించారు. టెక్నోక్రాట్, మెట్రో‌మ్యాన్ శ్రీధరన్ ఇటీవలే బీజేపీలో అధికారికంగా చేరారు. బీజేపీలో చేరక మునుపే తనకు సీఎం అభ్యర్థిగా (E Sreedharan Announced BJP CM Candidate) బరిలోకి దిగడం సమ్మతమేనని ప్రకటించారు.

మరోవైపు గురువారంతో తాను పదవీ విరమణ చేస్తానని, ఆ తర్వాతే ఎన్నికల (Kerala assembly Elections) ప్రచారంలో పాల్గొంటానని ఆయన ప్రకటించారు. శ్రీధరన్‌కున్న క్లీన్ ఇమేజ్ బాగా కలిసొస్తుందని బీజేపీ భావిస్తోంది. ‘ఈ వేషధారణలో ఉండడం ఇదే చివరి రోజు. ఇది ఢిల్లీ మెట్రో రైల్ యూనిఫాం. ఇదో విలక్షణమైన యూనిఫాం.’’ అని శ్రీధరన్ తెలిపారు.

ఇదిలా ఉంటే కేరళలో ఎన్నికల సమయంలో (Kerala Assembly Elections 2021) బీజేపీ సంచలన ప్రకటన చేసింది. రాష్ట్రంలో తమను గెలిపిస్తే.. లీటర్‌ పెట్రోల్‌ 60 రూపాయలకే అందిస్తామని కేరళ బీజేపీ లీడర్ కుమ్మనం రాజశేఖరన్ ప్రచారం చేస్తున్నారు. అందులోనే జీఎస్టీ లాంటి ట్యాక్సులన్నీ లోబడే ఉంటాయని అంటున్నారు. పెట్రోల్, డీజిల్‌ను కూడా జీఎస్టీలోకి చేరుస్తామని హామీ ఇచ్చేశారు. ఎన్నికల సందర్భంగా కొచ్చిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజశేఖరన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీలో బీజేపీకి ఘోర పరాభవం, ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ వార్డుల్లో నాలుగు ఆప్ కైవసం, ఒకటి కాంగ్రెస్ ఖాతాలోకి, 15 ఏళ్లుగా ఎంసీడీని పాలించిన బీజేపీకి ఒక్క సీటు కూడా రాని వైనం

అంతేకాకుండా ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌ని జీఎస్టీ ఫ్రేమ్‌లో ఎందుకు చేర్చలేదని రాజశేఖరన్‌ ప్రశ్నించారు. ఇది జాతీయ అంశం. దీన్ని లీడ్ చేయడానికి కొన్ని కారణమవుతున్నాయని ఆయన తెలిపారు. వివిధ కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరల్లో వ్యత్యాసం కనిపిస్తుంది అన్నారు. దీనిని ఎందుకు జీఎస్టీ కిందకు తీసుకురావడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ క్రమంలో కేరళలో ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే.. లీటర్‌ పెట్రోల్‌ 60 రూపాయలకే అందిస్తామని తెలిపారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని లెక్కించిన తర్వాత తనకు ఇది అర్థమైందని ఆయన చెప్పుకొచ్చారు.

రాజస్తాన్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రల్లో అత్యధిక వ్యాట్ కారణంగా ఇప్పటికే లీటర్‌ పెట్రోల్‌ ధర 100 రూపాయల మార్కును దాటేసింది. ఇంధన ధరలు ఇంత భారీగా పెంచడం పట్ల ప్రతిపక్షాలు.. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నాయి.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Bandi Sanjay: ఎవడైనా హిందీ పేపర్ లీక్ చేస్తాడా..?..గ్రూప్-1 పేపర్ లీకేజీ కేసుతో నా ఇజ్జత్ పోయిందన్న కేంద్రమంత్రి బండి సంజయ్, వైరల్‌గా మారిన వీడియో

SLBC Tunnel Collapse: నల్గొండ SLBC టన్నెల్ వద్ద ప్రమాదం.. మూడు మీటర్ల మేర కూలిన పైకప్పు, ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా, పనులు మొదలు పెట్టిన వెంటనే ప్రమాదమా? అని బీఆర్ఎస్ ఫైర్

MLC Kavitha: చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి... పసుపు బోర్డుకు చట్టబద్దత ఏది? అని మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత, మార్చి 1లోపు బోనస్ ప్రకటించాలని డిమాండ్

CM Revanth Reddy: మహిళలకే మొదటి ప్రాధాన్యం..600 ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశామన్న సీఎం రేవంత్ రెడ్డి, స్వయం సహాయక సంఘాలకు ఏడాదికి రెండు చీరలు కానుకగా ఇస్తామని వెల్లడి

Share Now