Delhi MCD Bypolls: ఢిల్లీలో బీజేపీకి ఘోర పరాభవం, ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ వార్డుల్లో నాలుగు ఆప్ కైవసం, ఒకటి కాంగ్రెస్ ఖాతాలోకి, 15 ఏళ్లుగా ఎంసీడీని పాలించిన బీజేపీకి ఒక్క సీటు కూడా రాని వైనం
దేశ రాజధాని ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)లోని 5 వార్డులకు గత నెల 28న జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు (Delhi MCD Bypolls Results) నేడు విడుదలయ్యాయి. ఐదు వార్డుల్లో నాలుగింటిని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గెలుచుకోగా, ఓ స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించింది. 15 ఏళ్లపాటు ఎంసీడీని పాలించిన బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు.
New Delhi, Mar 4: దేశ రాజధాని ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)లోని 5 వార్డులకు గత నెల 28న జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు (Delhi MCD Bypolls Results) నేడు విడుదలయ్యాయి. ఐదు వార్డుల్లో నాలుగింటిని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గెలుచుకోగా, ఓ స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించింది. 15 ఏళ్లపాటు ఎంసీడీని పాలించిన బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు.
ఈ సందర్భంగా కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతోషంగా ఉన్నారనడానికి ఈ ఫలితాలు నిదర్శనమన్నారు. ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. బీజేపీ (BJP) ఎంసీడీని మోస్ట్ కరప్ట్ డిపార్ట్‌మెంట్‌గా మలిచినందునే ఆ పార్టీకి ఒక్క స్ధానం కూడా లభించలేదని దుయ్యబట్టారు.
అదే సమయంలో బీజేపీపై కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ వ్యవహరించిన తీరు నచ్చకే ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదన్నారు. ఎంసీడీని ( Delhi MCD) 15 ఏళ్లపాటు పాలించిన బీజేపీ దానిని అవినీతి శాఖగా మార్చేసిందని కేజ్రీవాల్ ఆరోపించారు. దానిని ప్రక్షాళన చేయాలనే ప్రజలు తమను గెలిపించారని అన్నారు.
ఆప్ కార్యక్రమాలకు ప్రజలు ఆమోదం తెలిపారని, ఢిల్లీ మున్సిపల్ ఉప ఎన్నికల్లో ఐదు స్ధానాలకు గాను నాలుగు స్ధానాల్లో తమ అభ్యర్ధులు గెలుపొందడం ద్వారా ఆప్ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడైందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఢిల్లీని మరింత పరిశుభ్రనగరంగా తీర్చిదిద్దుతామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.
(The above story first appeared on LatestLY on Mar 04, 2021 01:25 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

