KCR Re-Entry: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పొలిటికల్ రీ-ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడో కేటీఆర్ క్లారిటీ ఇచ్చేశారు.. మరి గులాబీ దళాధిపతి పురాగమనం ఎప్పుడంటే??

అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య వార్ నడుస్తొందని చెప్పుకొవచ్చు. అమలుకు సాధ్యం కానీ హమీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిందని బీఆర్ఎస్ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తుండగా.. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాల వల్లే తెలంగాణ వెనక్కు వెళ్లిందని కాంగ్రెస్ రివర్స్ ఎటాక్ కు దిగింది.

KCR Speech (photo-Video Grab)

Hyderabad, Nov 1: తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) రసవత్తరంగా మారాయి. అధికార కాంగ్రెస్ (Congress), విపక్ష బీఆర్ఎస్ (BRS) మధ్య వార్ నడుస్తొందని చెప్పుకొవచ్చు. అమలుకు సాధ్యం కానీ హమీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిందని బీఆర్ఎస్ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తుండగా.. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాల వల్లే తెలంగాణ వెనక్కు వెళ్లిందని కాంగ్రెస్ రివర్స్ ఎటాక్ కు దిగింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆస్క్ కేటీఆర్ పేరిట నెటిజన్ లతో చిట్ చాట్ చేశారు. ఈ క్రమంలో కొందరు నెటిజన్ లు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం సైతం ఇచ్చారు. ఇదిలా ఉండగా.. మాజీ సీఎం కేసీఆర్ కొన్ని నెలలుగా యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని, ఆయన మళ్లీ ఎప్పుడు వస్తారని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.

సిరిసిల్ల కళాకారుడి అద్భుతం, వాటర్ మిలన్‌పై సీఎం రేవంత్ రెడ్డి చిత్రం, వైరల్‌గా మారిన వీడియో

వచ్చే ఏడాది ఎంట్రీ..

వచ్చే ఏడాది గులాబీ దళాధిపతిపతి, మాజీ సీఎం కేసీఆర్ మళ్లీ యాక్టివ్ రాజకీయాల్లో వస్తారని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా.. 420 హమీలు ఇచ్చిన కాంగ్రెస్ మెడలు వంచుతామని కూడా స్పష్టం చేశారు. ‘కాంగ్రెస్ హామీలపై ఈ ప్రభుత్వానికి కావాలనే కేసీఆర్ ఒక సంవత్సరం సమయం ఇచ్చారు. 2025లో హామీలపై ప్రభుత్వాన్ని నిలదీస్తారు’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలనం, లక్ష్మీమాత బొమ్మ ఉన్న టపాసులను కాల్చొద్దు, అందరం ప్రతిజ్ఞ చేయాలని వీడియో రిలీజ్ 



సంబంధిత వార్తలు

Praja Vijayotsava Sabha: కేసీఆర్‌..ఒక్కసారి అసెంబ్లీకి రా, అన్నీ లెక్కలు తేలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి మండిపాటు, బీఆర్‌ఆఎస్ నేతలకు మైండ్‌ దొబ్బిందని విమర్శ

KCR Comments on Congress Govt: నిర్మించేందుకు అధికారం ఇచ్చారు, కూల్చేందుకు కాదు! కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ దే గెలుప‌ని ధీమా

KCR Re-Entry: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పొలిటికల్ రీ-ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడో కేటీఆర్ క్లారిటీ ఇచ్చేశారు.. మరి గులాబీ దళాధిపతి పురాగమనం ఎప్పుడంటే??

BRS Plan To Hold Dharna In Delhi: రేవంత్ రెడ్డి స‌ర్కారుపై స‌మ‌రానికి రంగంలోకి కేసీఆర్, త్వ‌ర‌లోనే ఢిల్లీలో ధ‌ర్నా చేప‌ట్ట‌నున్న గులాబీ పార్టీ అధినేత‌