Maharashtra Floor Test: నేడు బల పరీక్ష ఎదుర్కోనున్న ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం, కొత్త ప్రొటెం స్పీకర్‌గా ఎన్సీపీ ఎమ్మెల్యే దిలీప్ వాల్సే పాటిల్, శివసేన ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు మూడు కలిసి మహా వికాస్ ఆఘాడి కూటమి(Maha Vikash Aghadi govt)గా ఏర్పాడిన సంగతి అందిరికీ తెలిసిందే.
Mumbai, November 30: మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాల తర్వాత ఊహించని ట్విస్టుల నడుమ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఉద్ధవ్ ఠాక్రే (Shiv Sena chief Uddhav Thackeray) ప్రభుత్వం నేడు అసెంబ్లీలో బల పరీక్ష(Maharashtra Assembly Floor Test) ఎదుర్కోనుంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు మూడు కలిసి మహా వికాస్ ఆఘాడి కూటమి(Maha Vikash Aghadi govt)గా ఏర్పాడిన సంగతి అందిరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో శాసనసభలో బలనిరూపణ చేసుకోవాలని ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ (governor Bhagat Singh Koshyari) సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు డిసెంబర్ 3 వరకు గడువు ఇచ్చారు.
ఈ నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎదుర్కోనుంది. నవంబర్ 30 మధ్యాహ్నం అసెంబ్లీ ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోనుందని అసెంబ్లీ అధికారులు వెల్లడించారు.
ఎన్సీపీ ఎమ్మెల్యే దిలీప్ వాల్సే పాటిల్(Dilip Walse Patil)ను కొత్త ప్రొటెం స్పీకర్‌గా నియమించారు. ఫడ్నవీస్ ప్రభుత్వం నియమించిన ప్రొటెం స్పీకర్ కాళిదాసు కొలాంబ్కర్ స్థానంలో పాటిల్‌కు బాధ్యతలు అప్పగించారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దిలీప్ పాటిల్ గతంలో అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు.
ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం లాంఛనంగా అధికార బాధ్యతలు చేపట్టారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. మొత్తం 288 సీట్లలో మెజారిటీకి అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్య 145. ఎన్నికల్లో శివసేనతో కలిసి పోటీ చేసిన బీజేపీ 105 స్థానాల్లో గెలుపొందింది.
కాగా వసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఎన్నికల అనంతరం జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. ఇతర రాజకీయ పక్షాలతో పొత్తుపెట్టుకోవడం పార్టీల హక్కు అని సుప్రీంకోర్టు(Supreme Court) పేర్కొంది. ప్రజాస్వామ్యంలో పార్టీలకున్న ఆ హక్కును తొలగించలేమని వ్యాఖ్యానించింది.
రాజకీయ నైతికత, రాజ్యాంగ నైతికత వేర్వేరని, వాటిని పోల్చలేమని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.మేనిఫెస్టోలను అమలు చేయాలంటూ పార్టీలను కోర్టులు ఆదేశించలేవని కూడా పేర్కొంది.
ఇదిలా ఉంటే మహారాష్ట్ర తరువాత తమ తదుపరి లక్ష్యం గోవాయేనని శివసేన నేత సంజయ్ రౌత్ ప్రకటించారు. గోవాలో కూడా బీజేపీయేతర సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు.