After Maharashtra, BJP may lose Goa too in political earthquake: Shiv Sena MP Sanjay Raut (Photo-ANI)

Mumbai, November 29: శివసేన దెబ్బకు బీజేపీ పార్టీ మహారాష్ట్ర(Maharashtra)లో అధికారాన్ని కోల్పోయిన సంగతి విదితమే. ఆ పార్టీ ఇప్పుడు అక్కడ ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. అయితే బీజేపీ పని మహారాస్ట్రతో అయిపోయేలా లేదు, మహారాష్ట్ర రాజకీయ ప్రకంపనలు గోవాను కూడా తాకేలా ఉన్నాయి. ఇందుకు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (Shiv Sena MP Sanjay Raut) చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.

మహారాష్ట్ర తర్వాత గోవాలోనూ బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ ప్రకంపనలు (BJP may lose Goa too in political earthquake) చోటుచేసుకుంటాయని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీ పార్టీలో కలకలం రేపుతున్నాయి. బీజేపీ పాలిత గోవాలో గోవా ఫార్వార్డ్‌ పార్టీ (GFP) అధ్యక్షుడు విజయ్‌ సర్ధేశాయ్‌ (Goa Forward Party President Vijay Sardesai) ముగ్గురు ఎమ్మెల్యేలతో కలిసి శుక్రవారం ఉదయం సంజయ్‌ రౌత్‌తో భేటీ కావడం బీజేపీ వర్గాల్లో గుబులు రేపుతోంది.

ANI Tweet

గోవాలో నెలకొన్న రాజకీయ పరిస్థితిపై వారు చర్చించినట్టు ప్రచారం సాగడంతో భారతీయ జనతా పార్టీ (BJP)వర్గాలు ఉలిక్కిపడ్డాయి. జీఎఫ్‌పీ చీఫ్‌ విజయ్‌ సర్ధేశాయ్‌ సహా కనీసం నలుగురు ఎమ్మెల్యేలు శివసేనతో టచ్‌లో ఉన్నారని శివసేన ఎంపీ రౌత్‌ పేర్కొన్నారు. మహరాష్ట్రవాది గోమంతక్‌ పార్టీ చీఫ్‌ సుధిన్‌ దవిల్కార్‌తోనూ తాను మాట్లాడానని, గోవా ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కొద్దిమంది ఇతర ఎమ్మెల్యేలూ తమతో టచ్‌లో ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు.

గోవా ప్రభుత్వాన్ని అనైతికంగా ఏర్పాటు చేశారని, కాంగ్రెస్‌ సహా పలు పార్టీలతో తాము ప్రత్యేక ఫ్రంట్‌ను నెలకొల్పి గోవాలో త్వరలోనే అద్భుతం చోటుచేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర తరహా మేజిక్‌ను గోవాలో పునరావృతం చేస్తామని గోవా మాజీ డిప్యూటీ సీఎం విజయ్‌ సర్ధేశాయ్‌ చెప్పారు.